IND vs SA 2nd ODI: భారీ స్కోరు వైపు సఫారీలు! హెండ్రిక్స్, మార్‌క్రమ్ హాఫ్ సెంచరీలు
IND vs SA 2nd ODI: రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ధాటిగా ఆడుతోంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు భారీ స్కోరు వైపు సాగుతోంది. 30 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 157-2తో నిలిచింది.
IND vs SA 2nd ODI: రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ధాటిగా ఆడుతోంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు భారీ స్కోరు వైపు సాగుతోంది. 33 ఓవర్లకు దక్షిణాఫ్రికా 180-3తో ఉంది. రెజా హెండ్రిక్స్ (74; 76 బంతుల్లో 9x4, 1x6), అయిడెన్ మార్‌క్రమ్ (69; 77 బంతుల్లో 7x4, 1x6) హాఫ్ సెంచరీలు సాధించారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీలకు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 7 వద్దే ఓపెనర్ క్వింటన్ డికాక్ (5) ఔటయ్యాడు. మహ్మద్ సిరాజ్ ఆఫ్ సైడ్ వేసిన బంతిని ఆడబోయి వికెట్ల మీదకు ఆడుకున్నాడు. ఈ క్రమంలో జానెమన్ మలన్ (25; 31 బంతుల్లో 4x4)తో కలిసి రెజా హెండ్రిక్స్ ఇన్నింగ్స్ నిర్మించాడు. బంతులు తక్కువ బౌన్స్‌తో వచ్చి ఇబ్బంది పెడుతున్నా ఓపికగా నిలిచాడు. రెండో వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యం అందించాడు.
Reeza Hendricks and Aiden Markram have built up a strong partnership for the visitors 💪#INDvSA | Scorecard: https://t.co/ZFqBOFeCus pic.twitter.com/JTIvGFSa5k
— ICC (@ICC) October 9, 2022
కీలక సమయంలో మలన్‌ను అరంగేట్రం ఆటగాడు షాబాజ్ అహ్మద్ ఎల్బీ చేశాడు. ఆ తర్వాత వచ్చిన అయిడెన్ మార్క్రమ్ నిలకడగా ఆడాడు. బంతికో పరుగైనా చేయలేదు. ఫామ్ లేకపోవడంతో క్రీజులో గడిపాడు. సింగిల్స్ తీస్తూ మెల్లగా బౌండరీలు కొట్టడం మొదలు పెట్టాడు. హెండ్రిక్స్ 58, మార్క్రమ్ 64 బంతుల్లో హాఫ్ సెంచరీలు అందుకొని 129 బంతుల్లో 129 భాగస్వామ్యం అందించారు. అజేయంగా మారిన ఈజోడీని హెండ్రిక్స్‌ను ఔట్ చేయడం ద్వారా సిరాజ్ విడదీశాడు. 31.2వ బంతికి అతడిచ్చిన క్యాచ్‌ను షాబాజ్ అహ్మద్ సునాయాసంగా అందుకున్నాడు. మార్క్రమ్ (69), క్లాసెన్ (5) క్రీజులో ఉన్నారు.
That First Wicket Feeling! 🙌 🙌
— BCCI (@BCCI) October 9, 2022
Here's how debutant Shahbaz Ahmed scalped his maiden wicket in international cricket 🎥 🔽 #TeamIndia | @mastercardindia
Follow the match ▶️ https://t.co/6pFItKiAHZ
Don’t miss the LIVE coverage of the #INDvSA match on @StarSportsIndia. pic.twitter.com/Rq9vRyEWCo