IND Vs SA, 1st ODI: క్లాసీన్ క్లాస్ - మిల్లర్ మాస్ - మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా ఎంత కొట్టిందంటే?
టీమిండియాతో జరుగుతున్న మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.
భారత్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా మొదటి స్కోరును సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (75 నాటౌట్: 63 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు), హెన్రిచ్ క్లాసీన్ (74 నాటౌట్: 65 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) రాణించారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు జానేమన్ మలన్ (22: 42 బంతుల్లో, మూడు ఫోర్లు), క్వింటన్ డికాక్ (48: 54 బంతుల్లో, ఐదు ఫోర్లు) మొదటి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అనంతరం జానేమన్ మలన్‌ను అవుట్ చేసి ఠాకూర్ ఇండియాకు మొదటి వికెట్ అందించారు. అయితే ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ టెంబా బవుమా (8: 12 బంతుల్లో, రెండు ఫోర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (0: 5 బంతుల్లో) విఫలం అయ్యారు. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ కూడా అర్థ సెంచరీ ముంగిట అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా 110 పరుగులుకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ (75 నాటౌట్: 63 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు), హెన్రిచ్ క్లాసీన్ (74 నాటౌట్: 65 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు)జ దక్షిణాఫ్రికాను ఆదుకున్నారు. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఈ జోడిని విడదీయడం సాధ్యం కాలేదు. అభేద్యమైన ఐదో వికెట్‌కు వీరు 106 బంతుల్లోనే 139 పరుగులు జోడించారు. చివరి ఐదు ఓవర్లలో వీరు 55 పరుగులు చేశారు. దీంతో దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీయగా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
View this post on Instagram
View this post on Instagram