IND Vs PAK: షమీ, అశ్విన్, శార్దూల్‌ల్లో చోటు ఎవరికి? - రోహిత్ ఎవరికి ఓటేస్తాడు?
పాకిస్తాన్ మ్యాచ్‌లో మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్‌ల్లో రోహిత్ శర్మ ఎవరి వైపు మొగ్గు చూపుతాడు? తుది జట్టులో చోటు ఎవరికి దక్కే అవకాశం ఉంది?
India vs Pakistan: ప్రపంచకప్‌లో భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 14వ తేదీన (శనివారం) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. భారత్, పాకిస్తాన్‌లు తమ తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయాలతో ఈ మ్యాచ్‌లో రంగంలోకి దిగనున్నాయి. భారత్ తన రెండో మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ స్తానంలో శార్దూల్ ఠాకూర్‌కు ఆడే అవకాశం ఇచ్చింది. అయితే చాలా మంది క్రికెట్ నిపుణులు మహ్మద్ షమీకి కూడా అవకాశం ఇవ్వవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో పాక్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ ప్లేయింగ్ కాంబినేషన్ ఏంటన్న చర్చలు మొదలయ్యాయి. టీమ్ ఇండియాలో 8వ స్తానం కోసం ముగ్గురు పోటీదారులు ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin), శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur), మహ్మద్ షమీల్లో (Mohammed Shami) రోహిత్ శర్మ (Rohit Sharma) ఎవరికి అవకాశం ఇస్తారో టాస్ తర్వాత మాత్రమే తెలుస్తుంది.
మహ్మద్ షమీకి అవకాశం లభిస్తుందా?
మహ్మద్ షమీ ఇప్పటివరకు పాకిస్తాన్‌తో మొత్తం మూడు వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను మొత్తం 28 ఓవర్లు బౌలింగ్ చేసి 107 పరుగులు ఇచ్చాడు. ఈ సమయంలో అతను ఐదు వికెట్లు తీయడంలో విజయవంతమయ్యాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్ 354. ఐపీఎల్‌లో అహ్మదాబాద్ పిచ్ అతనికి హోమ్ పిచ్. ఐపీఎల్ 2023లో అతను గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతూ 28 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. అందువల్ల షమీకి అహ్మదాబాద్‌లోని పిచ్‌పై పూర్తి అవగాహన ఉంది. అది పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అతనికి చోటు దక్కడానికి కారణం కావచ్చు.
రవిచంద్రన్ అశ్విన్
నరేంద్ర మోదీ స్టేడియం బౌండరీ కొంచెం పెద్దది కాబట్టి రోహిత్ శర్మ... రవిచంద్రన్ అశ్విన్ వైపు మొగ్గు చూపవచ్చు. ఎందుకంటే అశ్విన్ తన అనుభవంతో స్పిన్ బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను పరుగులు చేయకుండా ఆపగలడు. ఇది కాకుండా ఒక్క చోటి కోసం పోటీ పడుతున్న ముగ్గురిలో, అశ్విన్‌కు పాకిస్తాన్‌పై ఆడిన అనుభవం ఉంది. అతను బ్యాటింగ్‌లో కూడా జట్టుకు చాలా సహాయం చేయగలడు.
మరి శార్దూల్ ఠాకూర్
స్లో, మీడియం ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్న ఆటగాడు కావాలనుకుంటే శార్దూల్ ఠాకూర్‌ను రోహిత్ ఎంచుకోవచ్చు. అయితే భారత జట్టు బ్యాటింగ్ ఫామ్‌ను చూస్తుంటే జట్టుకు 8వ ర్యాంక్‌లో ఆల్‌రౌండర్ అవసరం లేదని అనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో శార్దూల్‌కు చోటు కష్టం కావచ్చు.
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా రెండు విజయాలతో దూసుకుపోతోంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై , రెండో మ్యాచ్‌లో అఫ్ఘనిస్తాన్‌పై భారత జట్టు ఘన విజయం సాధించింది. శనివారం అసలు సిసలు సమరానికి సిద్ధమవుతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా పాకిస్తాన్‌తో శనివారం టీమిండియా తలపడబోతోంది. ఈ క్రమంలో అందరి దృష్టి స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌పైనే ఉంది. డెంగ్యూ కారణంగా చెన్నైలో ఆస్పత్రిలో చేరి చికిత్స తర్వాత కోలుకున్న శుభ్‌మన్ గిల్ ఇప్పుడు అహ్మదాబాద్ చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గిల్ ఆడతాడా లేక టీమ్ మేనేజ్‌మెంట్ అతడికి విశ్రాంతి ఇస్తుందా అన్న దానిపై స్పష్టత లేదు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial