News
News
X

IND vs NZ T20 Series: న్యూజిలాండ్‌లో టీమిండియా- 'క్రొకొడైల్ రైడ్' ఆస్వాదిస్తున్న కెప్టెన్లు

IND vs NZ T20 Series: నవంబర్ 18 నుంచి టీమిండియా, న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో ఇరు జట్ల కెప్టెన్లు సరదాగా ముచ్చటించుకున్నారు. వెల్లింగ్టన్ లో క్రొకొడైల్ రైడ్ ను ఆస్వాదించారు.

FOLLOW US: 

IND vs NZ T20 Series: నవంబర్ 18 నుంచి టీమిండియా, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. అనంతరం వన్డే సిరీస్ కూడా ఉంది. ఈ సిరీస్‌లో భారత్ 3 టీంలు ఆడనుంది. ఈ పర్యటనకు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కు విశ్రాంతి నిచ్చారు. రెగ్యులర్ కెప్టెన్ అందుబాటులో లేకపోవటంతో హార్దిక్ పాండ్యా జట్టును నడిపించనున్నాడు. 

నవంబర్ 18న మొదలయ్యే మొదటి టీ20 కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు మీడియాతో మాట్లాడారు. అంతేకాదు వారిద్దరూ వెల్లింగ్టన్ లో క్రొకొడైల్ రైడ్ ను ఎంజాయ్ చేశారు. 

కుర్రాళ్లకు ఇది మంచి అవకాశం

'ప్రధాన ఆటగాళ్లు ఈ సిరీస్ కు అందుబాటులో లేరు. అయితే ఇప్పుడున్న ప్లేయర్స్ కూడా గత ఒకటి, రెండేళ్లుగా మంచి క్రికెట్ ఆడుతున్నారు. ఇప్పుడు వారికి అవకాశం వచ్చింది. సీనియర్ల గైర్హాజరీలో తమని తాము నిరూపించుకోవడానికి వారికిది చక్కని అవకాశం. వారిలో ఉన్న సత్తాను బయటకు తీయడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. కొత్త జట్టు కొత్త శక్తితో మేం ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నాం.' అని హార్దిక్ అన్నాడు.

News Reels

కివీస్ కెప్టెన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. టీమిండియా ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు. భారత యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారని అన్నాడు. 'టీమిండియాలో చాలామంది సూపర్ స్టార్లు ఉన్నారు. వారి ప్రతిభ ఏంటో నాకు తెలుసు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ భీకరంగా ఆడుతున్నాడు. అందుకే టీ20ల్లో నెంబర్ వన్ గా ఉన్నాడు.' అని విలియమ్సన్ అన్నాడు.

భారత టీ20 జట్టు

హార్దిక్ పాండ్యా (కెప్టెన్). రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్ , వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ , అర్ష్ దీప్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్.

న్యూజిలాండ్ జట్టు

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖెల్ బ్రేస్ వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, ఐష్ సోధి, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, బ్లెయిర్ టిక్నర్.

View this post on Instagram
 
A post shared by BLACKCAPS (@blackcapsnz)

View this post on Instagram
 
A post shared by BLACKCAPS (@blackcapsnz)

Published at : 16 Nov 2022 02:05 PM (IST) Tags: Hardik Pandya Williamson Wellington NZ vs IND NZ vs IND series NZ vs IND T20 series Team India in Newzealand India vs Newzealand India vs Newzealand t20 series Newzealand Cricket

సంబంధిత కథనాలు

IND vs NZ, 2nd ODI:  భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే- మరో గంటలో ప్రారంభం కాకపోతే ఆట రద్దే!

IND vs NZ, 2nd ODI: భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే- మరో గంటలో ప్రారంభం కాకపోతే ఆట రద్దే!

Sanju Samson Dropped: ఎక్కువ సిక్సర్లు కొట్టినందుకే సంజూపై వేటు! పంతే ముద్దు!

Sanju Samson Dropped: ఎక్కువ సిక్సర్లు కొట్టినందుకే సంజూపై వేటు! పంతే ముద్దు!

IND vs NZ ODI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్- రెండు మార్పులతో బరిలోకి దిగిన భారత్

IND vs NZ ODI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్- రెండు మార్పులతో బరిలోకి దిగిన భారత్

Gujarat Election 2022: భార్య తరఫున ఎన్నికల ప్రచారం చేస్తూ బిజీగా భారత ఆల్ రౌండర్

Gujarat Election 2022: భార్య తరఫున ఎన్నికల ప్రచారం చేస్తూ బిజీగా భారత ఆల్ రౌండర్

భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే రేపే - కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ - ఎక్కడ చూడాలంటే?

భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే రేపే - కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ - ఎక్కడ చూడాలంటే?

టాప్ స్టోరీస్

TSLPRB: పోలీస్ ఉద్యోగార్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల తేదీలు ఖరారు - ఎప్పటినుంచంటే?

TSLPRB: పోలీస్ ఉద్యోగార్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల తేదీలు ఖరారు - ఎప్పటినుంచంటే?

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

NTR: ఎన్టీఆర్ ఒక్కో యాడ్ కు ఎంత తీసుకుంటారో తెలుసా?

NTR: ఎన్టీఆర్ ఒక్కో యాడ్ కు ఎంత తీసుకుంటారో తెలుసా?

Aliens: డిసెంబర్‌ నెలలో భూమి మీదకు ఏలియన్స్‌ - గతంలో మహిళ రేప్ ఆరోపణలు!

Aliens: డిసెంబర్‌ నెలలో భూమి మీదకు ఏలియన్స్‌ - గతంలో మహిళ రేప్ ఆరోపణలు!