అన్వేషించండి

IND vs NZ ODI: 'మానసికంగా బలంగా ఉండడం ముఖ్యం- రేపటి మ్యాచులో కచ్చితంగా గెలుస్తాం'

IND vs NZ ODI: ఆత్మపరిశీలన చేసుకుని, తప్పుల్ని దిద్దుకుని న్యూజిలాండ్ తో జరిగే రెండో వన్డేలో బలంగా తిరిగివస్తామని టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు.

IND vs NZ ODI:  న్యూజిలాండ్ తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. బ్యాటింగ్ లో ధావన్, గిల్, శ్రేయస్ అయ్యర్ లు రాణించి భారీ స్కోరు సాధించినప్పటికీ... బౌలర్ల వైఫల్యంతో ఓటమి పాలయింది. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ 80 పరుగులతో భారత్ తరఫున అత్యధిక స్కోరు సాధించాడు. మ్యాచులో ఓటమి, తర్వాత గేమ్ సన్నద్ధతపై అతను మాట్లాడాడు. 

ఒక మ్యాచులో ఓడిపోయినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. మానసికంగా బలంగా ఉండడం ముఖ్యమని తెలిపాడు. కొత్త ఆలోచనలు, పదునైన వ్యూహాలతో తర్వాతి మ్యాచులో బలంగా పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశాడు. 'భారత్ నుంచి నేరుగా న్యూజిలాండ్ వచ్చి ఆడడం అంత తేలిక కాదు. ప్రాంతాలను బట్టి పిచ్ లు ఉంటాయి. కివీస్ పిచ్ లపై ఆడడం సవాల్ తో కూడుకున్నదే. అయితే పరిస్థితిని అర్ధం చేసుకుని ఆడాం. ఓపెనర్లు అంత మంచి భాగస్వామ్యం అందించాక దాన్నిభారీ స్కోరుగా మలచలేకపోయాం. అయినా చివరికి ప్రత్యర్థికి గట్టి టార్గెట్ నే సెట్ చేశాం. అయితే కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్ లు అద్భుతంగా ఆడి మా నుంచి మ్యాచ్ ను లాగేసుకున్నారు.' అని శ్రేయస్ తెలిపాడు. 

మధ్య ఓవర్లలో త్వరగా వికెట్లు కోల్పోయాక 307 స్కోరు చేరుకోవడం మెచ్చుకోదగ్గ అంశమని ఈ మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ అన్నాడు. 'ఈరోజు కొన్ని విషయాలు మాకు అనుకూలంగా జరగలేదు. అయితే ఆటలో ఇవన్నీ సహజం. ఆత్మ పరిశీలన చేసుకుని, తప్పుల్ని సరిదిద్దుకుని తర్వాతి మ్యాచ్ కు సిద్ధమవుతాం. ప్రతి పిచ్ దేనికదే వేరుగా ఉంటుంది. మానసికంగా బలంగా ఉండడం, పరిస్థితులను అర్ధం చేసుకుని ఆడడం ముఖ్యమని' చెప్పాడు. 

వారిద్దరి భాగస్వామ్యమే మమ్మల్ని ఓడించింది 

కివీస్ తొలి 20 ఓవర్లలో ముగ్గురు టాపార్డర్ బ్యాట్స్ మెన్ ను కోల్పోయి ఇబ్బంది పడింది. అయితే కెప్టెన్ విలియమ్సన్, టామ్ లాథమ్ 221 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో వారి జట్టును గెలిపించుకున్నారు. ముఖ్యంగా లాథమ్ కేవలం 104 బంతుల్లోనే 145 పరుగులు చేసి భారత్ కు విజయాన్ని దూరంచేశాడు. 

" కేన్, టామ్ ఇద్దరూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఏ బౌలర్ ను లక్ష్యంగా చేసుకోవాలో వారికి బాగా తెలుసు. వారి భాగస్వామ్యమే మమ్మల్ని విజయానికి దూరం చేసింది. మధ్య ఓవర్లలో మా బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా 40వ ఓవర్లో టామ్ లాథమ్ చెలరేగి 25 పరుగులు రాబట్టాడు. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది." అని శ్రేయస్ అన్నాడు. 

రేపు హోమిల్టన్ వేదికగా రెండో వన్డే జరగనుంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Delhi Capitals vs Gujarat Titans Highlights | రషీద్ ఖాన్ ట్రై చేసినా.. విజయం దిల్లీదే | ABP DesamPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP DesamCM Revanth Reddy vs Harish Rao | రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన హరీశ్ రావు | ABP DesamPawan Kalyan Dance in Nomination Ryally | కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి నామినేషన్ లో పవన్ చిందులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget