IND vs NZ: బెంగళూరు టెస్టులో భారత్‌పై సెంచరీతో కదం తొక్కిన రచిన్ - తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు 356 పరుగుల ఆధిక్యం
IND vs NZ 1st Test: భారత్‌పై న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగుల ఆధిక్యం సాధించింది. రచిన్ రవీంద్ర సెంచరీతో భారత్‌ను దెబ్బతీశాడు.
IND vs NZ 1st Test: బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ కేవలం 46 పరుగులకే పరిమితం కావడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం ఆధిక్యం 356 పరుగుల ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర 134 పరుగులు చేసి తన టెస్టు కెరీర్‌లో రెండో సెంచరీ నమోదు చేశాడు. అతనితో పాటు టిమ్ సౌథీ, డెవాన్ కాన్వే హాఫ్ సెంచరీలు చేశారు.
బెంగళూరు టెస్టులో తొలిరోజు వర్షం కారణంగా టాస్ కుదరలేదు. రెండో రోజు టాస్ గెలిచిన తర్వాత భారత్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీనికి భారత జట్టుకు భారీ మూల్యం చెల్లించుకుంది. భారత జట్టు మొత్తం 46 పరుగులకే కుప్పకూలింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. తర్వాత రెండో రోజు మ్యాచ్‌ను నిలిపేశారు.
మూడో రోజు రచిన్ రవీంద్ర ఆధిపత్యం
180/3 స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన కివీ జట్టు దూకుడుగా ఆడింది. ఆట ప్రారంభమైన కాసేపటికే డారిల్ మిచెల్‌ను మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. అక్కడి నుంచి గంట వ్యవధిలోనే కీలకమైన నాలుగు వికెట్లను న్యూజిలాండ్ కోల్పోయింది. 233 పరుగులకు 7 వికెట్లకు కోల్పోయింది. ఆ దశలో రచిన్ రవీంద్ర 124 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి టిమ్ సౌథీతో కలిసి 137 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రవీంద్ర, సౌథీ కలిసి జట్టు స్కోరును 350 పరుగులు దాటించారు.
తేలిపోయిన భారత బౌలింగ్
మూడో రోజు భారత జట్టు బౌలర్లు ఆరంభంలోనే డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, మాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్ వికెట్లు తీశారు. కానీ ఆ తర్వాత వికెట్ల కోసం తీవ్రంగా శ్రమించారు. చివరి మూడు వికెట్లు తీయడానికి 169 పరుగులు సమర్పించుకున్నారు. ఇప్పుడు భారత్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. కానీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 5 కంటే ఎక్కువ ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చాడు. రవీంద్ర జడేజా 3 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీశారు.
మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ పూర్తిగా తేలిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ చేసి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్ ముగ్గురూ ఒక్క పరుగు తేడాతో అవుటయ్యారు. 10 పరుగులకే భారత్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. తర్వాత వచ్చిన యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీళ్లు ఇద్దరూ నాలుగో వికెట్‌కు 21 పరుగులు జోడించారు. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో ఇదే భారీ భాగస్వామ్యం. తర్వాత వికెట్ కోల్పోయిన వరుసగా మూడు వికెట్లు చేజార్చుకుంది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ డకౌట్ అయ్యారు. ఆ తర్వాత భారత్ మొదటి ఇన్నింగ్స్‌కు తెరపడటానికి ఎక్కువ సమయం పట్టలేదు. దీంతో 46 పరుగులకే ఆలౌట్ అయింది.
Also Rea: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో రిషబ్ పంత్ యాక్టింగ్ చేశాడా! రోహిత్ కామెంట్లపై స్పందించిన కీపర్