అన్వేషించండి
Advertisement
IND vs NED: ప్రపంచకప్‌లో రాహుల్ ఫాస్టెస్ట్ సెంచరీ, రోహిత్ శర్మ రికార్డు బద్దలు
ODI World Cup 2023: డచ్ జట్టుపై కేవలం 62 బంతుల్లో సెంచరీ చేసిన రాహుల్..వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ తరపున వేగవంతమైన శతకం చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.
నెదర్లాండ్స్‌తో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో శతకం బాదిన కె.ఎల్. రాహుల్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. డచ్ జట్టుపై కేవలం 62 బంతుల్లో సెంచరీ చేసిన రాహుల్..వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ తరపున వేగవంతమైన శతకం చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. నెదర్లాండ్స్‌పై కేవలం 62 బంతుల్లోనే రాహుల్ సెంచరీ సాధించి ఈ ఘనత సాధించాడు.
ఇదే ప్రపంచకప్‌లో టీమిండియా సారధి రోహిత్ శర్మ.. అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 63 బంతుల్లో సెంచరీ కొట్టి రికార్డు సృష్టించాడు. హిట్ మ్యాన్ పేరిట ఉన్న రికార్డును రాహుల్ బద్దలు కొట్టాడు. 2007లో బెర్ముడాపై వీరేంద్ర సెహ్వాగ్ 81 బంతుల్లోనే సెంచరీ చేసి సృష్టించిన రికార్డును ఈ ప్రపంచకప్‌లో రోహిత్ బద్దలు కొట్టాడు. ఇప్పుడు రోహిత్ పేరున ఉన్న రికార్డును రాహుల్ అధిగమించాడు.
ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ చేసిన భారత బ్యాటర్లు
KL రాహుల్ vs నెదర్లాండ్స్, 2023 - 62 బంతులు
రోహిత్ శర్మ vs ఆఫ్ఘానిస్తాన్, 2023 - 63 బంతులు
వీరేంద్ర సెహ్వాగ్ vs బెర్ముడా, 2007 - 81 బంతులు
విరాట్ కోహ్లీ vs బంగ్లాదేశ్, 2011 - 83 బంతులు
ఇక నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత టాపార్డర్ జోలు విదిల్చింది. డచ్ బౌలర్లను ఊచకోత కోస్తూ భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన ఆరంభం నుంచే దూకుడు మంత్రాన్ని జపించింది. శ్రేయస్స్ అయ్యర్ 94 బంతుల్లో 10 ఫోర్లు అయిదు సిక్సులతో 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రాహుల్ కేవలం 62 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో 102 పరుగులు చేశాడు. అయ్యర్, రాహుల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చివరి 10 ఓవర్లలో టీమిండియా 126 పరుగులు రాబట్టింది. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. ప్రపంచ కప్‌లో టీమ్ఇండియాకిది రెండో అత్యధిక స్కోరు. 2007 బెర్ముడాపై 413/5 స్కోరు సాధించగా.. ఇప్పటివరకు అదే అత్యుత్తమ స్కోరు. ఇప్పుడు నెదర్లాండ్స్‌పై భారత జట్టు 400 పరుగుల మైలురాయిని దాటింది.
ఇదే మ్యాచ్‌లో టీమిండియా సారధి రోహిత్‌శర్మ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 14 వేల పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 14 వేల పరుగులకుపైగా చేసిన మూడో భారత ఓపెనర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఈ రికార్డు ఉంది. రోహిత్ శర్మ ఇప్పటివరకు వన్డేలు, టీ20లు, టెస్టులు, ఐపీఎల్‌లో కలిపి 13,988 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల వద్ద 14 వేల మైలురాయిని రోహిత్ అందుకున్నాడు. మరో రికార్డును కూడా రోహిత్ తన పేరిట లిఖించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివీలియర్స్ పేరు మీదున్న రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. నెదర్లాండ్స్ మ్యాచ్‌లో సిక్సు కొట్టిన రోహిత్ ఈ అరుదైన ఘనత సాధిస్తాడు. 2015లో డివిలియర్స్ ఒకే ఏడాదిలో వన్డేల్లో 58 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ 60 సిక్సులతో ఈ రికార్డును బద్దలు కొట్టాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
నెల్లూరు
క్రైమ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement