IND Vs HK Asia Cup: మొదట బ్యాటింగ్ మనదే - పరుగుల వరద ఖాయమేనా?
టీమిండియాతో జరుగుతున్న ఆసియా కప్ టీ20 మ్యాచ్‌లో హాంగ్ కాంగ్ కెప్టెన్ నిజకత్ ఖాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
టీమిండియాతో జరుగుతున్న ఆసియా కప్ టీ20 మ్యాచ్‌లో హాంగ్ కాంగ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆసియా కప్‌లో భారత్ ఇప్పటికే పాకిస్తాన్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలిస్తే అధికారికంగా సూపర్-4కు చేరుకోనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆదివారం పాకిస్తాన్‌తో టీమిండియా సూపర్-4 మ్యాచ్‌లో తలపడనుంది.
తుదిజట్టులో భారత్ ఒక్క మార్పు మాత్రమే చేసింది. గత మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసుకోవడంతో పాటు విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. తన స్థానంలో రిషబ్ పంత్‌కు స్థానం లభించింది. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ మొదటి మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.
టీమిండియా తుదిజట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్
హాంగ్ కాంగ్ తుదిజట్టు
నిజకత్ ఖాన్ (కెప్టెన్), యాసిమ్ ముర్తాజా, బాబర్ హయత్, కిన్‌చిత్ షా, అయిజాజ్ ఖాన్, స్కాట్ మెకెచ్‌నీ (వికెట్ కీపర్), జీషన్ అలీ, హరూన్ అర్షద్, ఎహ్‌సాన్ ఖాన్, ఆయుష్ శుక్లా, మహ్మద్ ఘజన్‌ఫర్
View this post on Instagram
View this post on Instagram