అన్వేషించండి

IND vs ENG Test: శతాబ్దంన్నరలో మూడోసారే !అశ్విన్‌, బెయిర్‌స్టోల ఘనత

IND vs ENG Test: టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు ర‌విచంద్రన్ అశ్విన్‌, ఇంగ్లాండ్ బ్యాట‌ర్ జానీ బెయిర్ స్టోలకు ధర్మశాల వేదికగా జరగనున్న అయిదవ టెస్ట్ మ్యాచ్  ప్రతిష్టాత్మకంగా నిల‌వ‌నుంది.

Jonny Bairstow and R Ashwin News: ధర్మశాల(Dharamshala) వేదికగా మార్చి 7 నుంచి 11 వరకు అయిదో టెస్ట్‌ జరగనుంది. ఇప్పటికే టెస్ట్‌ సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా(Team India).. ఈ టెస్ట్‌లోనూ గెలిచి వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌(WTC) పాయింట్లు పెంచుకోవాలని చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని బ్రిటీష్‌ (England) జట్టు చూస్తోంది. అయితే ఈ మ్యాచ్‌ ద్వారా ఇద్దరు ఆటగాళ్లు అరుదైన రికార్డు సృష్టించనున్నారు. టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు ర‌విచంద్రన్ అశ్విన్‌, ఇంగ్లాండ్ బ్యాట‌ర్ జానీ బెయిర్ స్టోలకు ఈ మ్యాచ్  ప్రతిష్టాత్మకంగా నిల‌వ‌నుంది. అశ్విన్‌, జానీ బెయిర్ స్టోలు త‌మ కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరు ఎలా రాణిస్తారు అన్న అంశంపై ఆస‌క్తి నెల‌కొంది. ఈ మ్యాచ్ ఎవ‌రికి తీపి గుర్తుగా మిగ‌ల‌నుందో మ‌రికొద్ది రోజుల్లో తేల‌నుంది. ఒక టెస్టులో ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు వందో మ్యాచ్‌లు ఆడుతుండటం 147 ఏండ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇది మూడోసారి మాత్రమే. 

చరిత్రలో రెండుసార్లే 
2006లో న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించింది. ఈ సిరీస్‌లో భాగంగా కివీస్‌ దిగ్గజం స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ , దక్షిణాఫ్రికా లెజెండరీ పేసర్‌ షాన్‌ పొలాక్‌ కలిసి వందో టెస్టు ఆడారు. 2013లో ఇంగ్లండ్‌ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా అలెస్టర్‌ కుక్‌, మైఖెల్‌ క్లార్క్‌ కలిసి వందో టెస్టు ఆడారు. ఇప్పుడు తాజాగా అశ్విన్‌ – బెయిర్‌ స్టోలు ఆడనుండటం మూడోసారి ఆడనున్నారు. ఈ సిరీస్‌లో అశ్విన్‌ ఎప్పటిలాగే వికెట్ల వేట కొనసాగిస్తుండగా బెయిర్‌ స్టో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. 

గవాస్కర్‌ సంచలన వ్యాఖ్యలు
రాంచీ(Ranchi) వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో విజయంతో ఇంగ్లాండ్‌(England)తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ గెలుపుతో రోహిత్‌ సేన మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ కైవసం చేసుకుంది. యువ క్రికెటర్లు తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ఆనందంగా ఉందని టీమిండియా సారధి రోహిత్‌ శర్మ అన్నాడు. సీనియర్లు మళ్లీ జట్టులోకి వచ్చినా ఒత్తిడికి గురికాకుండా నిర్ణయం తీసుకుంటామని హిట్‌ మ్యాన్‌ స్పష్టం చేశాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని టీమిండియా దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ కూడా అన్నాడు. బజ్‌బాల్‌తో టెస్ట్‌ క్రికెట్‌ను శాసిస్తున్న ఇంగ్లాండ్‌పై టెస్ట్‌ సిరీస్‌ విజయం తప్పకుండా కొందరికి హెచ్చరిక అని గవాస్కర్‌ పేర్కొన్నాడు. తాము లేకపోతే భారత్ గెలవలేదని అనుకొనే వారికి ఇదొక బలమైన సందేశమని వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌లు గెలిచేందుకు కేవలం పెద్ద స్టార్లు అవసరం లేదని కూడా అన్నాడు. ఇకనుంచి ఎవరైనా ‘స్టార్లు’ తాము లేకపోతే భారత్‌ గెలవడం కష్టమని భావించే వారికి ఈ సిరీస్‌ విజయం ఓ హెచ్చరిక అని గవాస్కర్‌ తెలిపాడు. క్రికెట్ అనేది జట్టుగా పోరాడేదని... కేవలం ఒకరిద్దరి మీదనే ఆధారపడి ఉండదని తేల్చి చెప్పాడు. 

టాప్ హెడ్ లైన్స్

Jaiswal Mind Games: ఐపీఎల్ ఆఫర్ తో జైస్వాల్ స్లెడ్జింగ్.. డిక్వెల్లాను ట్రాప్ చేసి వికెట్ పడగొట్టిన వైనం.. టీమిండియా మైండ్ గేమ్ అదుర్స్!
ఐపీఎల్ ఆఫర్ తో జైస్వాల్ స్లెడ్జింగ్.. డిక్వెల్లాను ట్రాప్ చేసి వికెట్ పడగొట్టిన వైనం.. టీమిండియా మైండ్ గేమ్ అదుర్స్!
Historic Test Victory: సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
Historic Cricket Diplomacy: కరాచీలో టెస్ట్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ లో వెల్ల‌డి!
కరాచీలో టెస్ట్ మ్యాచ్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ !
Jadeja Costly No-Ball:  అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..
అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Embed widget