IND VS ENG T20 Result Update: చేజేతులా ఓడిన భారత్.. బౌలింగ్ వైఫల్యంతో ఇంగ్లాండ్ చేతిలో చిత్తు.. రాణించిన ఇషాన్, తిలక్, అర్షదీప్
అనవసర తప్పులు చేసి, చేజేతులా టీమిండియా.. రెండో టీ20లో ఓడిపోయింది. పట్టు సాధించిన దశలో భారీగా పరుగులు సమర్పించుకుని, ఓటమిపాలైంది. ఈ విజయంతో 0-1తో భారత్ వెనుకంజలో నిలిచింది.

IND VS ENG T20 Latest Update: బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత్ ఇంకా ఖాతా తెరవలేదు. ఐర్లాండ్ పై 2-0తో క్లీన్ స్వీప్ అయిన టీమిండియా.. శనివారం ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టీ20లో 4 వికెట్లతో పరాజయం పాలైంది. బ్యాటింగ్ లో ఫర్వాలేదనిపించిన శ్రేయస్ సేన, బౌలింగ్ లో మాత్రం తేలిపోయి ఈ టూర్ లో మూడో పరాజయాన్ని మూట గట్టుకుంది. అంతకుముందు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 49, 6 ఫోర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. శామ్ కరన్ కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేజింగ్ ను 19 ఓవర్లలోనే 6 వికెట్లకు 191 పరుగులు చేసి, కంప్లీట్ చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ జాకబ్ బెతెల్ స్టన్నింగ్ ఫిఫ్టీ (46 బంతుల్లో 76 నాటౌట్, 5 ఫోర్లు, 5 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచి, జట్టును విజయతీరాలకు చేర్చాడు. బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్ లో 1-0తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో నిలిచింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఇరుజట్ల మధ్య మూడో టీ20 నాటింగ్ హామ్ వేదికగా మంగళవారం జరుగుతుంది. ఇక ఇండియాపై ఇంగ్లాండ్ కిదే అత్యుత్తమ ఛేజింగ్ కావడం విశేషం.
England win by 4 wickets in Manchester#TeamIndia will look to turn things around in the 3rd T20I in Trent Bridge
— BCCI (@BCCI) July 4, 2026
Scorecard ▶️ https://t.co/WYfL8tAm58 #ENGvIND pic.twitter.com/2KZN6H39DR
అర్షదీప్ డబుల్ స్ట్రైక్..
ఇక భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ను స్టార్ పేసర్ అర్ష్ దీప్ సింగ్ వణికించాడు. తొలి ఓవర్లోనే ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ ను డకౌట్ చేసి, షాకిచ్చాడు. దీంతో ఓపెనర్లిద్దరూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ ముఖం పట్టారు. ఈ దశలో కెప్టెన్ హేరీ బ్రూక్ (39) ఎదురు దాడికి దిగాడు. అర్ష దీప్ సింగ్ ఓవర్లో 27 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికి అతడిని అక్షర్ పటేల్ పెవిలియన్ కు పంపాడు. మరోవైపు బెతెల్ మాత్రం, చివరికంటా నిలిచి, తన క్లాస్ చూపించాడు.
కొంపముంచిన బిష్ణోయ్..
త్వరగా మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ, టామ్ బాంటన్ (39) తో కలిసి బెతెల్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ వేగంగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ, స్కోరు బోర్డును ముందుకు సాగించారు. ఈ దశలో 67 పరుగులను నాలుగో వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లాండ్ గేమ్ లోకి వచ్చింది. ఈ దశలో బాంటన్ ను ఔట్ చేసి, అర్ష్ దీప్ సింగ్ మరోసారి బ్రేక్ ఇచ్చాడు. విల్ జాక్స్ (9) విఫలం కావడంతో ఇంగ్లాండ్ ఒత్తిడిలో పడింది. ఈ దశలో బిష్ణోయ్ చెత్తగా బౌలింగ్ చేసి 29 పరుగులు సమర్పించుకున్నాడు. విచిత్రంగా సైడ్ లైన్లను తాకుతూ రెండు నోబాల్స్ వేయడంతో రెండు ఫ్రీ హిట్లు వచ్చాయి. వాటిని సిక్సర్లుగా మలిచిన బెతెల్ ఇంగ్లాండ్ ను మ్యాచ్ లోకి తెచ్చాడు. ఇదే ఊపులో 39 బంతుల్లో ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు. ఆ తర్వాత శామ్ కరన్ (7) ఔటైనా, బెతెల్ చివరికంటా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. బెతెల్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ట్రెండింగ్ వార్తలు



















