Shubman Gill Records: చరిత్ర సృష్టించిన శుభమన్ గిల్, ద్రావిడ్ రికార్డును బద్దలు కొట్టి తొలి భారత బ్యాటర్‌గా రికార్డ్
Ind vs Eng Lords test | ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్ట్ లో రెండో ఇన్నింగ్స్ లో గిల్ 6 పరుగులు చేశాడు. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్ 23 ఏళ్ల కిందట ద్రవిడ్ నెలకొల్పిన భారీ రికార్డ్ బద్దలు కొట్టాడు.

Ind vs Eng 3rd Test | లండన్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డులు తిరగరాస్తున్నాడు. ఇదివరకే దాదాపు పది రికార్డులను తన ఖాతాలో వేసుకున్న గిల్ ఇంగ్లాండ్‌తో లార్డ్స్ గ్రౌండ్‌లో జరుగుతున్న మూడో టెస్టులో రాహుల్ ద్రావిడ్ రికార్డును అధిగమించాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే చేయడం ఛేజింగ్ లో భారత జట్టుపై ఒత్తిడిని పెంచింది. అయితే, ఈ ఇన్నింగ్స్ ద్వారా రాహుల్ ద్రవిడ్ 23 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పుడు ఇంగ్లాండ్‌లో ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డ్ మిస్టర్ డిపెండబుల్ ద్రావిడ్ పేరట ఉండేది.
రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
మూడో టెస్టులో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేసర్ బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కీలకమైన ఈ ఇన్నింగ్స్ లో గిల్ కేవలం 6 పరుగులు చేశాడు. దీంతో ఈ టెస్ట్ సిరీస్‌లో గిల్ 607 పరుగులు చేశాడు. దాంతో ఇంగ్లాండ్‌లో ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు రాహుల్ ద్రావిడ్ పేరిట ఉంది. ద్రావిడ్ 2002లో ఇంగ్లాండ్‌లో జరిగిన 4 మ్యాచ్‌లay 6 ఇన్నింగ్స్‌లలో మొత్తం 602 పరుగులు చేశాడు. తాజాగా గిల్ ఆ
- శుభ్‌మన్ గిల్ (2025)- 607* పరుగులు
- రాహుల్ ద్రవిడ్ (2002)- 602 పరుగులు
- విరాట్ కోహ్లీ (2018)- 593 పరుగులు
ఇప్పుడు ఈ రికార్డుపై గిల్ ఫోకస్
ఇప్పుడు భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డుపై శుభ్‌మన్ గిల్ కన్నేశాడు. అతను టెస్ట్ సిరీస్ లో తరువాత మ్యాచ్ లలో ఇది సాధించవచ్చు. ఇంగ్లాండ్ పై టెస్ట్ సిరీస్ లో గ్రాహం గూచ్ (Graham Alan Gooch) పేరిట అత్యధిక పరుగుల రికార్డ్ ఉంది. గ్రాహం గూచ్ 1990లో 752 పరుగులు చేశాడు. గిల్ అతని రికార్డును బద్దలు కొట్టాలంటే తరువాత 4 ఇన్నింగ్స్‌లలో గిల్ 146 పరుగులు చేయాలి.
గిల్ ఈ సిరీస్‌తో టెస్ట్‌లో టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అతను సెంచరీ చేశాడు. రెండో టెస్ట్‌లో అతను 430 పరుగులు (269+161) చేశాడు. ఓ టెస్టుల్లో ఒక భారత బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక స్కోరు ఇది.
మూడో టెస్ట్ నేడు నిర్ణయాత్మక రోజు
ఇంగ్లాండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. జో రూట్ సెంచరీతో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసింది. భారత్ నుంచి మొదటి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ సెంచరీ చేయడంతో పాటు పంత్, జడేజాల హాఫ్ సెంచరీలతో ఇండియా కూడా 387 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో కేవలం 192 పరుగులకు ఆలౌట్ అయింది, నాల్గవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ సైతం 4 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది.
నేడు ఐదవ రోజున భారత్ విజయానికి 135 పరుగులు చేయాలి. మరోవైపు ఇంగ్లాండ్ నెగ్గాలంటే 6 వికెట్లు తీయాలి. కేఎల్ రాహుల్ 33 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. భారత్ ఆశలన్నీ అతడి మీదే ఉన్నాయి. పంత్ వేగంగా పరుగులు చేయడం జట్టుకు కలిసి రానుంది.





















