అన్వేషించండి

IND vs ENG 5th Test: లంచ్‌ సమయానికే 5 వికెట్లు, ఇంగ్లాండ్‌ ఖేల్‌ ఖతమే

Dharamshala test: భారత్ వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ లో ఇంగ్లాండ్ ఓటమి దిశగా పయనిస్తోంది. భారత స్పిన్నర్ల ధాటికి విలవిలాడుతోంది. లంచ్‌ సమయానికి అయిదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

England in trouble as they lose five wickets in the morning session: భారత్(Bharat) వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ లో ఇంగ్లాండ్(England) ఓటమి దిశగా పయనిస్తోంది. భారత స్పిన్నర్ల ధాటికి విలవిలాడుతోంది. లంచ్‌ సమయానికి అయిదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అశ్విన్, కుల్‌దీప్‌ స్పిన్‌ మాయాజాలం ప్రారంభం కావడంతో వరుసగా వికెట్లు కోల్పోతుంది. అశ్విన్ నాలుగు వికెట్లు, కుల్‌దీప్‌ ఒక వికెట్‌ తీశారు. పిచ్ స్పిన్ కు సహకరిస్తున్న వేళ టీం ఇండియా స్టార్ స్పిన్నర్లను ఎదుర్కోవడం అంత తేలిక కాదు. మూడో రోజు లంచ్‌ బ్రేక్‌ సమయానికి భారత్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.
రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌ను తొలి సెషన్‌లోనే కోలుకోలేని దెబ్బ తీసింది. సెషన్‌ చివరి ఓవర్లో అశ్విన్ బెన్‌ స్టోక్స్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. అశ్విన్‌ ఖాతాలో 4 వికెట్లు పడ్డాయి. పర్యటక జట్టు ఇంకా 156 పరుగులు వెనుకంజలోనే ఉంది. క్రీజ్‌లో రూట్‌ 34 పరుగులతో రూట్‌ ఉన్నాడు. ప్రస్తుతం లంచ్ సమయానికి ఇంగ్లాండ్‌ స్కోరు 103/5గా ఉంది. అశ్విన్‌ తన స్పిన్‌తో ఇంగ్లాండ్‌ బ్యాటర్లను తిప్పేస్తున్నాడు. భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లాండ్‌ ఏ దశలోనూ కోలుకునేలా కనిపించట్లేదు.

దుమ్ములేపిన భారత బ్యాటర్లు
 ధర్మశాల టెస్టులో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. ఇంగ్లండ్‌ బ్యాటర్లు విఫలమైన చోట మనోళ్లు శతక గర్జన పూరించారు. కెప్టెన్‌ రోహిత్‌శర్మ, శుభ్‌మన్‌గిల్‌ సూపర్‌ సెంచరీలతో చెలరేగిన వేళ..టీమ్‌ఇండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్ళింది. తొలి ఇన్నింగ్స్ 477 పరుగుల వద్ద ముగిసింది. 437/8తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమిండియా 40 పరుగులు జోడించి చివరి రెండు వికెట్లను కోల్పోయింది.  రోహత్ శర్మ (Rohit Sharma), శుభ్‌మన్‌ గిల్‌(Shubman Gill) శతకాలతో కదం తొక్కిన వేళ.. ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టులో రెండో రోజు కూడా భారత్‌ ఆధిపత్యం కొనసాగింది. ఈ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 218 పరుగులకే ఆలౌట్‌ చేసిన భారత్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. వికెట్‌ నష్టానికి.... 135 పరుగుల వద్ద భారత్‌ జట్టు బ్యాటింగ్‌ కొనసాగించగా..రెండో వికెట్‌కు రోహిత్‌, శుభ్‌మన్‌ గిల్‌ 171 పరుగులు జోడించారు. ఈ క్రమంలో.. ఇద్దరూ శతకాలతో రాణించారు. రోహిత్‌ 103, గిల్‌ 110 పరుగులు చేసిన తర్వాత పెవిలియన్‌ చేరగా.. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన దేవ్‌దత్‌ పడిక్కల్, సర్ఫరాజ్‌ఖాన్‌ అర్ధ శతకాలతో మెరిశారు. టెస్టు క్రికెట్‌ అరంగేట్రం మ్యాచ్‌లోనేఅర్ధ శతకం సాధించిన పడిక్కల్ 65 పరుగులు చేయగా సర్ఫరాజ్‌ 56 పరుగులు చేసి వెనుదిరిగారు. తర్వాత జడేజా, ధ్రువ్‌ జురేల్, అశ్విన్ తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరినా చివర్లో కుల్‌దీప్‌ యాదవ్, బుమ్రా ఇంగ్లాండ్‌ బౌలర్లను గట్టిగా ప్రతిఘటించారు. 437/8తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమిండియా 40 పరుగులు జోడించి చివరి రెండు వికెట్లను కోల్పోయింది. చివరి వికెట్‌గా వెనుదిరిగిన బుమ్రా 20 పరుగులు చేశాడు.  ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 5 వికెట్లు పడగొట్టగా జేమ్స్ అండర్సన్, టామ్ హర్ట్‌లీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 259 పరుగుల ఆధిక్యం లభించింది. 

  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Bigg Boss 9 Emmanuel: చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Bigg Boss 9 Emmanuel: చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
Balakrishna : యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
Embed widget