IND vs END 2nd Test: భారత్ విజయంపై నీళ్లు చల్లుతున్న వరుణుడు!సేఫ్ జోన్‌లో ఇంగ్లాండ్ టీమ్
భారత్ ఇంగ్లండ్ మ్యాచ్ వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అవుతోంది. రిజల్ట్ తేలాలంటే ఎక్కువ ఓవర్లు ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేయాలి.

IND vs ENG Day 5 Match Delay Due To Rain: ఎడ్జ్ బాస్టన్ వేదికగా తొలి టెస్టు నెగ్గాలన్న టీమిండియా కలకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఐదవ రోజు వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమైంది. భారతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది, వర్షం కారణంగా ఆట మొదలుకాలేదు. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో తొలి విజయం కోసం ఎదురుచూస్తున్న టీమిండియాకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. ఎడ్జ్ బాస్టన్ లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం తగ్గి రెండు సెషన్లు జరిగినా ఫలితం వచ్చే అవకాశం ఉంది. కానీ ఎక్కువ ఓవర్లు వర్షార్పణం అయితే మ్యాచ్ కూడా వర్షార్పణం అయి డ్రాగా ముగుస్తుంది.
వర్షం కారణంగా టెస్ట్ మ్యాచ్ రూల్స్ ఏంటి?
భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ రిజల్ట్ తేలేది నేడే. ఐదవ రోజు ఆట ప్రారంభానికి ముందే ఎడ్జ్ బాస్టన్‌లో వర్షం కురుస్తోంది. ఈ వర్షం అలాగే కొనసాగితే మ్యాచ్ ఓవర్లు చాలా వరకు తగ్గుతాయి. వర్షం ఎంతకు తగ్గకపోతే టెస్ట్ మ్యాచ్ డ్రాగా ప్రకటిస్తారు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ కోసం రిజర్వ్ డే లేదు. ఇది సాధారణ టెస్ట్ మ్యాచ్. కేవలం WTC ఫైనల్ కోసం మాత్రమే టెస్ట్ మ్యాచ్‌లో రిజర్వ్ డే కేటాయిస్తారు. మిగిలిన అన్ని మ్యాచ్‌ల నిర్ణయం 5 రోజుల్లోనే వస్తుంది. ఐదు రోజుల ఆట పూర్తయినా మ్యాచ్ ఫలితం రాకపోతే, ఈ మ్యాచ్ డ్రా అవుతుంది.
Weather report: 𝑾𝒆𝒕 🌧️
— England Cricket (@englandcricket) July 6, 2025
We’ll have a delayed start at Edgbaston. pic.twitter.com/3aNVr52LPQ
వాతావరణం అనుకూలించికపోతే ఎవరికి ప్రయోజనం?
భారత్-ఇంగ్లాండ్ రెండు టెస్ట్ ఫలితం తేలాలంటే మొత్తం ఓవర్లు మ్యాచ్ జరగాలి. కానీ వర్షం కారణంగా నేటి మ్యాచ్ ఆల్రెడీ ఆలస్యం అయింది. వర్షం ఆగిపోయినా వెంటనే గ్రౌండ్ రెడీగా ఉండదు. తొలి సెషన్ వాష్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. నేటి మ్యాచ్ లో ఫలితం రావాలంటే పూర్తి స్థాయిలో రెండు సెషన్లైనా ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేయాలి. దాంతో భారత బౌలర్లు వికెట్లు తీసి ప్రత్యర్థిని ఆలౌట్ చేయాలి. చివరిరోజైన నేడు వర్షం వల్ల మ్యాచ్ జరగకపోయినా, తక్కువ ఓవర్లు బ్యాటింగ్ చేసినా ఇంగ్లాండ్ డ్రా కోసం ప్రయత్నిస్తుంది. దాంతో ఓటమి అంచు నుంచి డ్రా చేసుకుని సచిన్, అండర్సన్ సిరీస్ లో 1-0తో ఆతిథ్య ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది.
భారత్ విజయం సాధించాలంటే 7 వికెట్లు తీయాలి. ఇంగ్లాండ్ నెగ్గాలంటే నేడు 536 రన్స్ చేయాలి. కానీ అది అసాధ్యం. కనుక వర్షం వల్ల మ్యాచ్ జరగకపోయినా, తక్కువ ఓవర్లు మ్యాచ్ జరిగి ఇంగ్లాండ్ ఆలౌట్ కాకుండా వికెట్లు కాపాడుకుంటే వారికే వర్షం అనుకూలించినట్లు. వర్షం త్వరగా ఆగిపోవాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎడ్జ్ బాస్టన్ లో తొలి విజయం సాధించాలని ఎంతో ఆశగా భారత ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు. సచిన్, సెహ్వాగ్, గంగూలీ, రాహుల్ ద్రావిడ్, ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలకు సాధ్యం కాని విజయాన్ని అందుకోవాలని చూస్తున్న యంగ్ ఇండియాకు వరుణుడు షాకిస్తున్నాడు.





















