చిట్టగాంగ్ టెస్టులో డ్రింక్స్ సమయానికి 305/7 పరుగులు చేసిన టీమిండియా
82 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ ఆ స్కోరుకు మరో నాలుగు పరుగులు మాత్రమే జోడించి సెంచరీ చేయకుండానే అవుట్ అయ్యాడు.
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు డ్రింక్స్ బ్రేక్ సమయానికి భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. ప్రస్తుతం రవిచంద్రన్ అశ్విన్ 21 పరుగులతో, కుల్దీప్ యాదవ్ 2 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
278/6 ఓవర్‌నైట్ స్కోరుతో టీమిండియా రెండో రోజు బ్యాటింగ్ మొదలు పెట్టింది. 82 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ ఆ స్కోరుకు మరో నాలుగు పరుగులు మాత్రమే జోడించి సెంచరీ చేయకుండానే అవుట్ అయ్యాడు. తర్వాత క్రీజ్‌లోకి కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్‌కు వచ్చాడు.
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య చిట్టగాంగ్ వేదికగా బుధవారం నుంచి తొలి టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ఛతేశ్వర్ పుజారా సెంచరీని చేజార్చుకున్నప్పటికీ భారత్ తరఫున అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. పుజారా 90 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా 86 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సెంచరీ మిస్ చేసుకున్నాడు. రిషబ్ పంత్ 46 పరుగులు చేశాడు.
టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు. అందుకే అతని గైర్హాజరీలో కేఎల్ రాహుల్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. రాహుల్, శుభ్మన్ గిల్ తొలి రోజు భారత్ కోసం ఓపెనింగ్ చేశారు. రాహుల్ 22, శుభ్మన్ 20 పరుగులు చేశారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఒక్క పరుగు మాత్రమే చేశాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ పుజారాతో కలిసి ముఖ్యమైన భాగస్వామ్యం ఆడాడు. పంత్ 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేశాడు.
రిషబ్ పంత్ ఔటయ్యాక పుజారా, శ్రేయాస్ అయ్యర్ బలమైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇద్దరు బ్యాట్స్ మెన్ లు 317 బంతులు ఎదుర్కొని 149 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటైన పుజారా తిరిగి పెవిలియన్ చేరాడు. అతను 203 బంతులను ఎదుర్కొని 11 ఫోర్లు కొట్టాడు. పుజారా తర్వాత అక్షర్ పటేల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అతను 2 ఫోర్ల సహాయంతో 14 పరుగులు చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి శ్రేయాస్ 169 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. 10 ఫోర్లు కొట్టాడు. తర్వాత రెండో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే నాలుగు పరుగులు మాత్రమే జోడించి 86 పరుగుల వద్ద శ్రేయాస్ అవుటయ్యాడు. ప్రస్తుతం అశ్విన్, కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ చేస్తున్నారు.
1ST Test. 107.4: Taijul Islam to Kuldeep Yadav 4 runs, India 315/7 https://t.co/CVZ44N7IRe #BANvIND
— BCCI (@BCCI) December 15, 2022