IND vs BAN 1st ODI: ముగిసిన 25 ఓవర్ల ఆట- తడబడిన టీమిండియా టాపార్డర్- స్కోరు ఎంతంటే!
IND vs BAN 1st ODI: బంగ్లాదేశ్- భారత్ మధ్య ఢాకా వేదికగా తొలి వన్డే జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా టాపార్డర్ తడబడింది. 25 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.
IND vs BAN 1st ODI: బంగ్లాదేశ్- భారత్ మధ్య ఢాకా వేదికగా తొలి వన్డే జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా టాపార్డర్ తడబడింది. 25 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ క్రీజులో ఉన్నారు.
ఇన్నింగ్స్ ను ప్రారంభించిన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు నిదానంగా బ్యాటింగ్ చేశారు. రోహిత్ తనదైన శైలిలో దూకుడుగానే ఆడగా... ధావన్ నెమ్మదిగా ఆడాడు. ఉన్నంతసేపు ఇబ్బందిపడ్డ ధావన్ (7) స్పిన్నర్ మెహదీ హసన్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ, రోహిత్ (27) ఇన్నింగ్స్ ను నడిపించారు. రోహిత్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టాడు. కోహ్లీ సింగిల్స్, డబుల్స్ రాబట్టాడు. క్రీజులో సౌకర్యంగా కదిలిన కెప్టెన్ షకీబుల్ హసన్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరపాటు పడ్డాడు. దీంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అదే ఓవర్లో షకీబ్ భారత్ కు మరో షాక్ ఇచ్చాడు. బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ పట్టిన ఓ అద్భుతమైన క్యాచ్ కు కోహ్లీ (9) వెనుదిరిగాడు. దాంతో టీమిండియా 49 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత ఇన్నింగ్స్ ను నడిపించే బాధ్యతను శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లు తీసుకున్నారు. వీరిద్దరూ సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోరు బోర్డును నడిపించారు. శ్రేయస్ అయ్యర్ కొన్ని మంచి షాట్లు ఆడాడు. అయితే కుదురుకున్నట్లే కనిపించిన ఈ జోడీని ఎబాడట్ హొస్సేన్ విడదీశాడు. షార్ట్ పిచ్ బంతిని షాట్ ఆడిన శ్రేయస్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 92 పరుగుల వద్ద నాలుగో వికెట్ పడింది. 25 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ క్రీజులో ఉన్నారు.
☝️ Rohit Sharma
— ICC (@ICC) December 4, 2022
☝️ Virat Kohli
Two wickets in quick succession for Bangladesh 💥
Follow the #BANvIND action 👉 https://t.co/Ymfh2IDe14 pic.twitter.com/qOGZhPQUCV
భారత్ తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్.
బంగ్లాదేశ్ తుది జట్టు
లిట్టన్ దాస్(కెప్టెన్), అనముల్ హక్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఎబాడోత్ హుస్సేన్.
TOYAM Sports Limited ODI Series: Bangladesh vs India: 1st ODI
— Bangladesh Cricket (@BCBtigers) December 4, 2022
Bangladesh Playing XI#BCB | #Cricket | #BANvIND pic.twitter.com/dB7CwTGzxq