అన్వేషించండి

మ్యాచ్‌లు

IND vs AUS, WTC Final 2023: 300కు చేరిన ఆసీస్ ఆధిక్యం - డబ్ల్యూటీసీ ఫైనల్‌పై పట్టు బిగించిన కంగారూలు

WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ టెస్టుపై ఆస్ట్రేలియా తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. మూడో రోజు ఆస్ట్రేలియా బ్యాటర్లు నిలకడగా ఆడి ఆ జట్టును పూర్తి ఆధిక్యంలో నిలిపారు.

IND vs AUS, WTC Final 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌పై ఆస్ట్రేలియా పట్టుబిగించింది.  భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో  296 పరుగులకే ఆలౌట్ చేసి 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 44 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. మార్నస్ లబూషేన్ (118 బంతుల్లో 41 బ్యాటింగ్, 4 ఫోర్లు), కామెరూన్ గ్రీన్ (27 బంతుల్లో 7 నాటౌట్, 1 ఫోర్) క్రీజులో ఉన్నారు.  తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 296  పరుగులకే ఆలౌట్ చేయడంతో దక్కిన ఆధిక్యంతో పాటు మూడో రోజు ఆటముగిసే సమయానికి చేసిన  పరుగులతో  ఆసీస్ ఆధిక్యం సుమారు 300 (296 పరుగులు) కు చేరింది. 

ఇంకా రెండు రోజుల ఆట మిగిలుండటంతో ఈ టెస్టులో ఫలితం తేలే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ అది టీమిండియాకు అనుకూలంగా రానుందా..? ఆసీస్‌కా అన్నది మాత్రం రేపు తేలనుంది.  ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే  మొగ్గు ఆసీస్  వైపునకే ఉంది. 

ఆదుకున్న రహానె- శార్దూల్.. 

ఓవర్  నైట్ స్కోరు  151 - 5 వద్ద మూడో రోజు ఆట ఆరంభించిన భారత జట్టు  ఒక్క పరుగు తీసి వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (5) వికెట్ల కోల్పోయింది.    ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన  శార్దూల్ ఠాకూర్‌ (109 బంతుల్లో 51, 6 ఫోర్లు) తో కలిసి  రహానె (129 బంతుల్లో 89, 11 ఫోర్లు, 1 సిక్స్) టీమిండియాను ఆదుకున్నాడు.   ఇద్దరూ కలిసి ఏడో వికెట్ కు 109 పరుగులు జోడించారు.  ఈ ఇద్దరూ భారత్ ను ఫాలో ఆన్ గండం నుంచి బయటపడేశారు. 

సాఫీగా సాగుతున్న ఈ  ఇన్నింగ్స్  లంచ్ తర్వాత కుదుపునకు లోనైంది.  లంచ్ తర్వాతి ఓవర్ వేసిన కమిన్స్ బౌలింగ్ లో  గ్రీన్ సూపర్ క్యాచ్‌తో  రహానె నిష్క్రమించాడు.   ఉమేశ్ యాదవ్ (5) కూడా అలా వచ్చి ఇలా వెళ్లాడు.  రహానె ఔట్ అయ్యాక  శార్దూల్ కూడా  అర్థ సెంచరీ పూర్తి చేసుకుని  గ్రీన్ బౌలింగ్ లో  వికెట్ కీపర్ కేరీకి క్యాచ్ ఇచ్చాడు.   షమీ (13) కూడా  త్వరగానే నిష్క్రమించాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్.. 296 పరుగుల వద్ద ముగిసింది. 

 

ఆసీస్ ఓపెనర్లను కోల్పోయినా.. 

173 పరుగుల తొలి  ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్‌కు ఆదిలోనే సిరాజ్, ఉమేశ్ లు డబుల్ స్ట్రోక్ ఇచ్చారు.  డేవిడ్ వార్నర్ (1) ను సిరాజ్ ఔట్ చేయగా ఉస్మాన్ ఖవాజా (13) ను ఉమేశ్ పెవిలియన్ పంపాడు. ఈ ఇద్దరూ వికెట్ కీపర్ భరత్‌కే క్యాచ్ లు ఇచ్చారు.

24 పరుగులకే ఓపెనర్లను కోల్పోయినా టీమిండియా  మళ్లీ పట్టు విడిచింది. స్టీవ్ స్మిత్ (47 బంతుల్లో 34, 3 ఫోర్లు) తో కలిసి  మార్నస్ లబూషేన్ మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించాడు.  అయితే స్మిత్‌ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. జడ్డూ వేసిన 30.1 వ ఓవర్లో  స్మిత్ భారీ షాట్ ఆడబోయి శార్దూల్‌కు క్యాచ్ ఇచ్చాడు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ట్రావిస్ హెడ్ (18) కూడా  ఎక్కువసేపు నిలువలేదు. హెడ్ వికెట్ కూడా   జడ్డూకే దక్కింది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Allu Arjun Wax Statue: తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Allu Arjun Wax Statue: తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Actress Aayushi Patel: లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Embed widget