అన్వేషించండి

మ్యాచ్‌లు

Todd Murphy Record: టాడ్ మర్ఫీ సంచలనం- 141 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఆసీస్ ఆఫ్ స్పిన్నర్

Todd Murphy Record: ఆస్ట్రేలియా యువ ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున అతి పిన్న వయసులో 5 అంతకన్నా ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

Todd Murphy Record: ఆస్ట్రేలియా యువ ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ అరుదైన రికార్డును అందుకున్నాడు. భారత్ తో తొలి టెస్టులో అరంగేట్రం చేసిన మర్ఫీ.. తన తొలి మ్యాచ్ లోనే 7 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో పలు రికార్డులను బద్దలు కొట్టాడు. 

141 ఏళ్ల రికార్డ్ బద్దలు

నాగ్ పూర్ వేదికగా భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఆసీస్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ అద్భుత ప్రదర్శన చేశాడు. అరంగేట్రంలోనే 7 వికెట్లు తీశాడు. రెండో రోజు 5 వికెట్లు తీసిన మర్ఫీ.. మూడో రోజు మరో 2 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో ఆస్ట్రేలియా తరఫున అతి పిన్న వయసులో 5 అంతకన్నా ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డ్ జోయ్ ప్లామర్ పేరిట ఉండేది. 

జోయ్ ప్లామర్ 1882లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 5 వికెట్ల ఘనతను సాధించాడు. అప్పుడు జోయ్ వయసు 22 ఏళ్ల 360 రోజులు. తాజాగా టాడ్ మర్ఫీ 22 ఏళ్ల 87 రోజుల వయసులోనే అరంగేట్ర టెస్టులో 7 వికెట్లు తీశాడు. అంటే 141 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాకుండా అరంగేట్రంలోనే 5 వికెట్లు పడగొట్టిన ఆస్ట్రేలియా నాలుగో ఆఫ్ స్పిన్నర్ గా రికార్డు సృష్టించాడు. మర్ఫీ కన్నా ముందు పీటర్ టేలర్, జాసన్ క్రూజా, నాథన్ లియాన్ లు ఉన్నారు. 

భారీ ఆధిక్యంలో భారత్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 223  పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 7 వికెట్ల నష్టానికి 321 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌ 400 పరుగులకు ఆలౌట్ అయింది. అక్షర్ పటేల్ (174 బంతుల్లో 84), షమీ (47 బుంతుల్లో 37) అద్భుతంగా రాణించి భారత్‌కు మంచి స్కోరు అందించారు. అక్షర్ కు టెస్టుల్లో ఇదే అత్యధిక స్కోరు.

రాణించిన బ్యాటర్లు

కెప్టెన్ రోహిత్ శర్మ (212 బంతుల్లో 120), ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ( 185 బంతుల్లో 70), అక్షర్ పటేల్    (174 బంతుల్లో 84) లు రాణించటంతో ఆస్ట్రేలియా పై పైచేయి సాధించింది. సెంచరీతో రోహిత్ శర్మ పలు రికార్డులను చేరుకున్నాడు. రెండేళ్ల తర్వాత శతకం బాదిన హిట్ మ్యాన్ కెప్టెన్ గా అన్ని ఫార్మాట్లలో సెంచరీలు బాదిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా కెప్టెన్ గా టీ20, వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో శతకాలు చేసిన మొదటి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 

జడేజా ఆల్ రౌండ్ షో

తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ షో ప్రదర్శించాడు. బంతితో 5 వికెట్లు పడగొట్టిన జడ్డూ.. బ్యాట్ తోనూ 70 పరుగులు చేశాడు. అక్షర్ తో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించిన జడేజా జట్టు భారీ స్కోరు సాధించడంలో సహాయపడ్డాడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
Telangana News: కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు
కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు
Hanuma Vihari: హనుమ విహారికి షోకాజ్‌ నోటీస్‌, మళ్లీ మొదలైన రగడ
హనుమ విహారికి షోకాజ్‌ నోటీస్‌, మళ్లీ మొదలైన రగడ
Prathinidhi 2 Teaser: నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?
నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?
కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి, అందరి హక్కులు కాపాడాలంటూ వ్యాఖ్యలు
కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి, అందరి హక్కులు కాపాడాలంటూ వ్యాఖ్యలు
Embed widget