News
News
X

IND vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే - మొదటి వన్డేకు వేరే కెప్టెన్!

ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న వన్డే సిరీస్‌కు జట్టును బీసీసీఐ ప్రకటించింది.

FOLLOW US: 
Share:

India Squad Announced For Australia ODI Series: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడిన తర్వాత భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కూడా జరగనుంది. ఇందుకోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఫిబ్రవరి 19వ తేదీన జట్టును ప్రకటించింది. వ్యక్తిగత కారణాలతో తొలి వన్డేకు రోహిత్ శర్మ దూరం కాగా, ఈ మ్యాచ్‌లో అతని స్థానంలో హార్దిక్ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో కేఎల్ రాహుల్‌తో పాటు విరాట్ కోహ్లీ, ఇతర ప్రముఖ ఆటగాళ్లకు కూడా జట్టులో చోటు కల్పించారు.

భారత జట్టు ఈ ఏడాది ఇప్పటివరకు రెండు వన్డే సిరీస్‌లు ఆడింది. వీటిలో ఒకటి శ్రీలంకతో, మరొకటి న్యూజిలాండ్‌తో జరిగాయి. ఈ రెండు సిరీస్‌ల్లోనూ జట్టు అద్భుతంగా గెలిచింది. ఈ వన్డే సిరీస్ జట్టు గురించి చెప్పాలంటే కెప్టెన్ రోహిత్ శర్మ చివరి రెండు మ్యాచ్‌లకు జట్టులో చేరనున్నారు. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీతో పాటు, శ్రేయస్ అయ్యర్ కూడా జట్టులో ఉన్నాడు.

ఆల్ రౌండర్ ఆటగాళ్ల గురించి చెప్పాలంటే హార్దిక్ పాండ్యాతో పాటు టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రtదర్శన చేస్తున్న రవీంద్ర జడేజా కూడా వన్డే జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. వీరు మాత్రమే కాకుండా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ కూడా జట్టులోకి ఎంపికయ్యారు.

వీరితో పాటు కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్‌లు భారత జట్టులోకి వచ్చారు. అదే సమయంలో ఫాస్ట్ బౌలింగ్‌లో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, జయదేవ్ ఉనద్కత్‌లు జట్టులో ఉన్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ మార్చి 17వ తేదీన ముంబైలో, రెండో మ్యాచ్ మార్చి 19వ తేదీన విశాఖపట్నంలో, చివరి వన్డే మార్చి 22వ తేదీన చెన్నైలో జరగనున్నాయి.

వన్డే సిరీస్ కోసం భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్

Published at : 19 Feb 2023 07:05 PM (IST) Tags: Hardik Pandya India vs Australia ROHIT SHARMA Ind vs Aus ODI Series

సంబంధిత కథనాలు

‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న  నెటిజన్లు

‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న నెటిజన్లు

అనుమానమే నిజమయ్యేట్టుంది- కేకేఆర్‌‌తోపాటు భారత్‌కూ షాక్ తప్పేట్టులేదుగా!

అనుమానమే నిజమయ్యేట్టుంది- కేకేఆర్‌‌తోపాటు భారత్‌కూ షాక్ తప్పేట్టులేదుగా!

IPL: ఐపీఎల్‌లో కొత్త రూల్స్- ఈ సీజన్ నుంచే అమలు- అవేంటంటే..!

IPL: ఐపీఎల్‌లో కొత్త రూల్స్- ఈ సీజన్ నుంచే అమలు- అవేంటంటే..!

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: లక్ష్యం దిశగా సాగుతున్న టీమిండియా - మంచి టచ్‌లో కింగ్, కేఎల్!

IND Vs AUS 3rd ODI: లక్ష్యం దిశగా సాగుతున్న టీమిండియా - మంచి టచ్‌లో కింగ్, కేఎల్!

టాప్ స్టోరీస్

TSPSC Issue : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

TSPSC Issue :   తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌

Hindenburg Research: మరో బాంబ్‌ పేల్చిన హిండెన్‌బర్గ్‌, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్‌