అన్వేషించండి

IND Vs AUS, Match Highlights: రెండో మ్యాచ్‌లోనూ ఘన విజయం, కంగారులకు వరుసగా రెండో ఓటమి

IND Vs AUS, Match Highlights: కంగారులతో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు... రెండో టీ 20లోనూ ఘన విజయం సాధించింది.

 ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ 20 సిరీస్‌లో యువ భారత్ జోరు మాములుగా లేదు. కంగారులతో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు... రెండో టీ 20లోనూ ఘన విజయం సాధించింది. తొలుత భారీ స్కోరు సాధించిన సూర్యకుమార్‌ యాదవ్‌ సేన.. అనంతరం కంగారులను కంగారు పెట్టి విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. టపార్డర్‌ రాణించడంతో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ చేసింది. అనంతరం 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారులు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమతమయ్యారు. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి 426 పరుగులు చేయడం విశేషం. 
 ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా... టీమిండియాను బ్యాటింగ్‌కు అహ్వానించింది. ఇది ఎంత తప్పుదు నిర్ణయమో కంగారులకు పవర్ ప్లే లోనే అర్ధం అయింది. టీమిండియా బ్యాటర్లు మరోసారి జూలు విదిల్చడంతో కంగారులపై భారత, జట్టు మరోసారి భారీ స్కోరు చేసింది. తొలి టీ20 మ్యాచ్లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా ఈసారి తొలుత బాటింగ్ చేసి భారీ స్కోర్ నమోదు చేసింది. టీమిండియా ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్.. యశస్వి జైస్వాల్... భారత్ కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం ఆరు ఓవర్ లలో 77 పరుగులు జోడించి భారీ స్కోరుకు పునాది వేశారు. యశస్వి జైస్వాల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లో 53 పరుగులు చేశాడు. జైస్వాల్ 9 ఫోర్లు, రెండు భారీ సిక్సర్లు బాదాదు.  జైస్వాల్ ని ఇంగ్లీష్ అవుట్ చేశాడు. అనంతరం రుతురాజ్ గైక్వాడ్ తో ఇషాన్ కిషన్ జత కలిసి స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించాడు.  కేవలం 32 బంతుల్లో ఇషాన్ కిషన్ 3 ఫోర్లు, 4 సిక్సర్ లతో 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 164 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 
 అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్... రుతురాజ్ తో కలిసి మరోసారి మెరుపు బాటింగ్ చేసాడు. కేవలం 10 బంతుల్లో 2 సిక్సర్లతో 19 పరుగులు చేసి సూర్య అవుట్ అయ్యాడు. దీంతో 189 పరుగుల వద్ద భరత్ మూడో వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్ హీరో రింకూ సింగ్ రాకతో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లింది. రుతురాజ్ గైక్వాడ్ 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. రింకూ సింగ్ 9 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 2 బంతుల్లో 7 పరుగులు చేసాడు. టాప్ ఆర్డర్ విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో టీం ఇండియా 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఆసిస్‌ బౌలర్లలో నాథన్‌ ఎలిస్‌ 4 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. భారత బ్యాటర్ల ధాటికి సీన్‌ అబాట్‌ కేవలం 3 ఓవర్లలోనే 56 పరుగులు సమర్పించుకున్నాడు. 


 అనంతరం 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 35 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. కళ్ల ముందు భారీ స్కోరు కనపడుతుండడంతో వేగంగా ఆడాలన్న ఒత్తిడిలో కంగారులు వరుసగా వికెట్లు కోల్పోయారు. రవి బిష్ణోయ్‌ ఆరంభంలోనే వికెట్లు తీసి కంగారులను కష్టాల్లోకి నెట్టేశాడు. 35 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన కంగారులు... 39 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత వరుస విరామాల్లో ఆస్ట్రేలియా వికెట్‌ కోల్పోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా స్టోయినిస్‌ పోరాడాడు. కానీ ఈ పోరాటం సరిపోలేదు. 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా జట్టులో ఇదే అత్యధిక స్కోరు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు బ్యాటర్లు మాత్రమే 25 పరుగులు దాటగలిగారు. భారత బౌలర్లు రాణించడంతో 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారులు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమతమయ్యారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ మంచి బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చిన ప్రసిద్ధ్‌ కృష్ణ మూడు వికెట్లు తీశాడు. రవి బిష్ణోయ్‌ కూడా 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget