News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

IND vs AUS: జోరు కొనసాగని! - సిరీస్ విజయంపై కన్నేసిన భారత్ - కమ్‌బ్యాక్ ఆశల్లో ఆసీస్

భారత్ - ఆస్ట్రేలియాల మధ్య ఆదివారం ఇండోర్ వేదికగా రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ భారత్ సొంతమవుతుంది.

FOLLOW US: 
Share:

IND vs AUS: వన్డే ప్రపంచకప్‌కు ముందు  తొలి వన్డేలో ఆస్ట్రేలియాను ఓడించి  మూడు ఫార్మాట్లలోనూ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న భారత జట్టు  జోరు కొనసాగించాలని  చూస్తున్నది.   మూడు  మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా  రెండ్రోజుల క్రితమే మొహాలీ వేదికగా ముగిసిన తొలి మ్యాచ్‌లో కంగారూలను ఓడించిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే  వన్డే సిరీస్‌ను గెలుచుకునే అవకాశం దక్కుతుంది. మరోవైపు  ఆసీస్  కూడా  కమ్ బ్యాక్ ఇవ్వాలని  చూస్తోంది.  మొహాలీలో ఓడినా ఇండోర్‌లో భారత్‌కు షాకిచ్చి  సిరీస్ విజేతను మూడో వన్డేకు వాయిదా వేయాలని ప్రణాళికలు రచిస్తోంది. 

అతడికి ఆఖరి అవకాశం.. 

ఆసీస్‌తో వన్డే  సిరీస్ ద్వారా వరల్డ్ కప్‌కు సన్నద్దమవుతున్న టీమిండియాకు మిడిలార్డర్ బ్యాటర్  శ్రేయస్ అయ్యర్ ఫామ్ ఆందోళనగా ఉంది.  ఆసియా కప్‌లో ఒక్కటంటే ఒక్కటే మ్యాచ్ ఆడి తిరిగి వెన్ను నొప్పితో ఇబ్బందిపడ్డ  అయ్యర్.. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో  భాగంగా మొహాలీలో ఆడినా తొలి వన్డేలో మూడు పరుగులే చేసి విఫలమయ్యాడు.   నేడు జరుగబోయే రెండో వన్డేలో అయినా అతడు రాణించాల్సి ఉంది.   ఈ రెండు మ్యాచ్‌లలో  ఆడకుంటే వరల్డ్ కప్‌లో అతడు బెంచ్‌కే పరిమితమవ్వాల్సి ఉంటుంది. 

మరోవైపు తొలి వన్డేలో ఓపెనర్లుగా రాణించిన గిల్, గైక్వాడ్‌లో నేటి మ్యాచ్‌లో కూడా అదే  ఫామ్ కొనసాగించాలని భారత్ కోరుకుంటోంది. ఈ ఇద్దరితో పాటు  కెప్టెన్ కెఎల్ రాహుల్ ఫామ్ కొనసాగించగా.. సుమారు ఏడాదిన్నర తర్వాత సూర్యకుమార్ యాదవ్ వన్డేలలో హాఫ్ సెంచరీ చేయడం టీమిండియాకు శుభసూచికమే. ఇషాన్ కూడా టచ్‌లోనే ఉన్నాడు.   బౌలింగ్‌లో అశ్విర్, జడేజాలు  స్పిన్ బాధ్యతలు చూసుకోనుండగా తొలి వన్డేలో భారీగా పరుగులిచ్చిన శార్దూల్ ఠాకూర్ (10 ఓవర్లలో 78)ను తప్పించి సిరాజ్‌కు తుదిజట్టులో చోటు కల్పించొచ్చు.  ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో  భారత్ బరిలోకి దిగనుంది. 

కంగారూలకు గాయాల బెడద

ఆస్ట్రేలియాకు గాయాలు ఇంకా వేధిస్తున్నాయి.  మిచెల్ స్టార్క్ ఇంకా  పూర్తిగా కోలుకోలేదని తెలుస్తున్నది. అతడు ఇండోర్ లో కూడా బెంచ్‌కే పరిమితం కావొచ్చు. తొలి వన్డే మాదిరిగానే జోష్ హెజిల్‌‌వుడ్ కూడా  ఈ మ్యాచ్ ఆడే అవకాశాలు లేవు. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌దీ అదే పరిస్థితి.   ట్రావిస్ హెడ్ లేకపోవడంతో ఆ జట్టు మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్‌లతో ఓపెనింగ్ జోడీని పంపించినా మార్ష్ విఫలమయ్యాడు.  వార్నర్‌తో పాటు స్టీవ్ స్మిత్, లబూషేన్, కామెరూన్ గ్రీన్ ఫర్వాలేదనిపించినా భారీ స్కోర్లు చేయలేక చతికిలపడ్డారు.  కానీ ఇండోర్‌లో ఈ  స్టార్ బ్యాటర్లు జూలు విదిల్చాలని ఆసీస్ కోరుకుంటున్నది.   ఈ మ్యాచ్‌లో కూడా ఆసీస్ జట్టులో పెద్ద మార్పులేమీ ఉండకపోవచ్చు. తొలి వన్డే జట్టుతోనే  కంగారూలు బరిలోకి దిగొచ్చు. 

వర్షం ముప్పు..? 

ఇండోర్‌లోని హోల్కర్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. ఆదివారం ఇండోర్‌లో వర్షం పడే అవకాశం ఉన్నట్టు  వాతావరణ శాఖ అంచనాలున్నాయి.   నేడు ఉదయం, రాత్రి వేళల్లో ఇక్కడ ఉరుములతో కూడిన వర్షం పడొచ్చని సమాచారం.  రోజంతా ఆకాశం మబ్బులు పట్టి ఉన్నా ఆటకు అంతరాయం కలిగించే అవకాశాలు తక్కువే అని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. 

తుది జట్లు (అంచనా) : 

భారత్ : కెఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్,  సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్/శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ

ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్,  జోష్ ఇంగ్లిస్, కామెరూన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్,  పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్,  ఆడమ్ జంపా

మ్యాచ్  వెన్యూ, టైమ్: 

- రెండో వన్డేకు ఇండోర్ లోని హోల్టర్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఆదివారం  మధ్యాహ్నం  1.30 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. 

లైవ్ వివరాలు.. 

- ఈ వన్డే సిరీస్  ప్రత్యక్ష ప్రసారాలను టెలివిజన్‌లో అయితే  స్పోర్ట్స్ 18లో.. యాప్, వెబ్‌సైట్స్‌లో అయితే జియో  సినిమా యాప్‌లో ఉచితంగానే  చూడొచ్చు. 

Published at : 24 Sep 2023 08:45 AM (IST) Tags: KL Rahul Shreyas Iyer Mitchell Starc Pat Cummins India vs Australia IND vs AUS IND vs AUS Live Streaming IND vs AUS 2nd ODI Indore Stadium Holkar Stadium

ఇవి కూడా చూడండి

WPL Auction 2024: వేలంలో ఏ ప్రాంచైజీ ఎవరిని దక్కించుకుందంటే?

WPL Auction 2024: వేలంలో ఏ ప్రాంచైజీ ఎవరిని దక్కించుకుందంటే?

WPL Auction 2024: భారత అమ్మాయిలపై కాసుల వర్షం, కోట్లు దక్కించుకున్న అన్‌ క్యాప్‌డ్‌ ప్లేయర్లు

WPL Auction 2024: భారత అమ్మాయిలపై కాసుల వర్షం, కోట్లు దక్కించుకున్న అన్‌ క్యాప్‌డ్‌ ప్లేయర్లు

India vs England Women : సిరీస్‌ ఇంగ్లాండ్‌ మహిళలదే, రెండో టీ 20లోనూ భారత్‌ చిత్తు

India vs England Women : సిరీస్‌ ఇంగ్లాండ్‌ మహిళలదే, రెండో టీ 20లోనూ భారత్‌ చిత్తు

India vs South Africa : సఫారీలతో తొలి సవాల్‌, యువ భారత్‌ సత్తా చాటేనా?

India vs South Africa : సఫారీలతో  తొలి సవాల్‌, యువ భారత్‌ సత్తా చాటేనా?

WPL Auction 2024: ఐపీఎల్‌ వేలంలో తెలంగాణ అమ్మాయి, గుజరాత్‌ టీమ్‌లోకి త్రిష

WPL Auction 2024: ఐపీఎల్‌ వేలంలో తెలంగాణ అమ్మాయి, గుజరాత్‌ టీమ్‌లోకి త్రిష

టాప్ స్టోరీస్

General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

General elections in February :  ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ?  కేంద్ర  ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!

Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!

Chhattisgarh CM: ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - మొత్తానికి క్లారిటీ ఇచ్చిన పార్టీ

Chhattisgarh CM: ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - మొత్తానికి క్లారిటీ ఇచ్చిన పార్టీ