అన్వేషించండి

ICC World Cup: వరల్డ్ కప్ టీమ్‌లో దక్కని చోటు - చాహల్ కీలక నిర్ణయం

టీమిండియా వెటరన్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు ప్రస్తుతం పాకిస్తాన్, శ్రీలంకలలో జరుగుతున్న ఆసియా కప్‌తో పాటు వచ్చే నెలలో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో కూడా చోటు దక్కలేదు.

ICC World Cup: రెండ్రోజుల క్రితమే వన్డే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన  టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర  చాహల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీ20లలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన  ఈ వెటరన్ స్పిన్నర్.. ఆసియా కప్‌తో పాటు  వన్డే ప్రపంచకప్‌లలోనూ చోటు కోల్పోవడంతో    తనను తాను మరింత మెరుగుపరుచుకోవడానికి గాను  కౌంటీ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.  ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న కౌంటీ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా  ‘కెంట్’ తరఫున ఆడేందుకు చాహల్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. 

చాహల్‌కు  కౌంటీ క్రికెట్‌లో ఇదే తొలి సీజన్. ఇంతవరకూ  ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 51  ఇన్నింగ్స్‌లలో 87 వికెట్లు తీసిన చాహల్.. కౌంటీలలో ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. తన సొంత రాష్ట్రం హర్యానా తరఫున రంజీలు ఆడిన చాహల్ చివరిసారిగా  2022లో  రంజీ ట్రోఫీ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు.   ఈనెల 10 నుంచి మొదలుకాబోయే కౌంటీ ఛాంపియన్‌షిప్  డివిజన్ వన్  2023 టోర్నీలో  చివరి మూడు మ్యాచ్‌లలో అతడు ఆడనున్నాడు.  భారత్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పలు మ్యాచ్‌లు ఆడిన చాహల్ ఇంతవరకూ  రెడ్ బాల్ క్రికెట్‌లో మాత్రం ఎంట్రీ ఇవ్వలేదు. 

చాహల్ ఎంట్రీపై  కెంట్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్  పాల్ డౌన్‌‌టౌన్ స్పందిస్తూ.. ‘చాహల్ మా టీమ్ తరఫున ఆడుతున్నందుకు మాకు   చాలా సంతోషంగా ఉంది. ఈ సీజన్‌లో అతడు మాతో చివరి మూడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడు.   ప్రస్తుతం మా జట్టు స్పిన్నర్లు మాథ్యూ పార్కిన్సన్, హమి ఖాద్రిలు అందుబాటులో లేకపోవడంతో ఆ లోటును చాహల్ భర్తీ చేస్తాడు. చాహల్ కూడా ఇంగ్లాండ్ పరిస్థితుల్లో ఆడటానికి ఉత్సాహంగా ఉన్నాడు.   చాహల్ వంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాడు మా జట్టులోకి రావడం  మా టీమ్‌కు మరింత బలాన్నిచ్చేదే’ అని  చెప్పాడు. 

ఎదురుచూస్తున్నా : చాహల్ 

కౌంటీలలో ఆడబోతుండటం తనకూ ఉత్సాహంగా ఉందంటున్నాడు చాహల్.  కెంట్‌తో ఒప్పందం నేపథ్యంలో చాహల్ మాట్లాడుతూ.. ‘ఇది నాకు కొత్త సవాల్ వంటిది. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో పరిస్థితులకు తగ్గట్టు అలవాటుపడి రాణించడం అనేది కీలకం.   ఆ  సవాళ్లను స్వీకరించేందుకు  నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..’ అని తెలిపాడు.  

ఈ ఏడాది కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ వన్  టోర్నీలో కెంట్ ప్రదర్శన ఆశించిన  స్థాయిలో లేదు. ఈ సీజన్‌లో ఆ జట్టు   11 మ్యాచ్‌‌లు ఆడి కేవలం రెండింటిలో మాత్రమే నెగ్గింది.  పాయింట్ల పట్టికలో ఆ జట్టు ప్రస్తుతం 9వ స్థానంలో ఉంది.  తర్వాత  మూడు మ్యాచ్‌లలో కెంట్.. నాటింగ్‌హామ్‌షైర్, సోమర్‌‌సెట్, లంకాషైర్‌లతో తలపడాల్సి ఉంది.  

ఇక వన్డే వరల్డ్ కప్‌లో  చాహల్‌కు చోటుదక్కడంపై  టీమిండియా మాజీలు  సెలక్షన్ కమిటీపై విమర్శలు గుప్పిస్తున్నారు.  మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్విటర్ వేదికగా  స్పందిస్తూ.. ప్రపంచకప్ జట్టులో   యుజ్వేంద్ర చాహల్ లేకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది.  అతడు ప్యూర్ మ్యాచ్ విన్నర్’ అని  రాసుకొచ్చాడు. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Jemimah Injury Twist: ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget