(Source: Poll of Polls)
ICC World Cup 2023 Venue: రేపో మాపో వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్! - వేదికలు ఖరారు - సెమీస్ మ్యాచ్‌లు ఎక్కడంటే?
ఈ ఏడాది అక్టోబర్ నుంచి భారత్ నుంచి జరుగబోయే వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది.
ICC World Cup 2023 Venue: భారత క్రికెట్ అభిమనులకు బీసీసీఐ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. టీమిండియా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ త్వరలోనే విడుదల కానున్నట్టు సమాచారం. అన్నీ కుదిరితే ఈ వారంలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), బీసీసీఐలు షెడ్యూల్‌కు తుది కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
పలు జాతీయ వెబ్‌సైట్స్‌తో పాటు సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం మేరకు.. ఈ వారంలో, కుదిరితే జూన్ 27, 28 తేదీలలోనే వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేయనున్నట్టు సమచారం. దీంతో పాటు వరల్డ్ కప్ సెమీస్ వేదికలపై కూడా బీసీసీఐ, ఐసీసీ తుది నిర్ణయానికి వచ్చినట్టు బోర్డు వర్గాల ద్వారా తెలుస్తున్నది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌తో పాటు ముంబైలోని ప్రఖ్యాత వాంఖెడే స్టేడియంలో సెమీస్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు రంగం సిద్ధమైందట..!
వన్డే వరల్డ్ కప్ నకు తొలగిన అడ్డంకి..
వన్డే వరల్డ్ కప్‌లో నిన్నా మొన్నటిదాకా పాకిస్తాన్ ఆడుతుందో లేదో..? ఆడినా ఎక్కడ ఆడుతుంది..? అన్న క్లారిటీ రాకపోవడంతో షెడ్యూల్ ఆలస్యమైంది. కానీ రెండ్రోజుల క్రితమే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ముందుగా నిర్ణయించిన డ్రాఫ్ట్ షెడ్యూల్ కు అంగీకారం తెలిపినట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో ఐసీసీ, బీసీసీఐకి ప్రధాన అడ్డంకి తొలగిపోవడంతో షెడ్యూల్ విడుదలకు కసరత్తులు చేస్తున్నది. పాకిస్తాన్ షెడ్యూల్ కు అంగీకారం చెప్పడంతో ఇక భారత్ - పాక్ మ్యాచ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా తీర్చిదిద్దిన అహ్మదాబాద్ వేదికగానే జరుగనుంది.
Semi-final venues for World Cup 2023: [ANI]
— Johns. (@CricCrazyJohns) June 26, 2023
- Eden Gardens
- Wankhede Stadium. pic.twitter.com/ML6N8qPKjI
వాస్తవానికి బీసీసీఐ, ఐసీసీలు సెమీస్‌ను ముంబైతో పాటు చెన్నై, బెంగళూరులో నిర్వహించాలని భావించాయి. కానీ బీసీసీఐ ఆఖరి నిమిషంలో సెమీస్ వేదికను చెన్నై, బెంగళూరు నుంచి మార్చి ఈడెన్ గార్డెన్‌కు తరలించినట్టు తెలుస్తున్నది.
వరల్డ్ కప్ వేదికలు ఇవేనా..?
అధికారిక ప్రకటన వెలువడకపోయినా ఈ కింది వేదికలలో వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతాయని సోషల్ మీడియలో న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. అవేంటంటే..
1. అహ్మదాబాద్
2. బెంగళూరు
3. చెన్నై
4. ఢిల్లీ
5. ధర్మశాల
6. గువహతి
7. హైదరాబాద్
8. ఇండోర్
9. కోల్‌కతా
10. ముంబై
11. రాయ్‌పూర్
12. రాజ్‌కోట్
Wankhede Stadium will host India's match in the Semi-final if they qualify. [PTI] pic.twitter.com/MqSf5t1jIp
— Johns. (@CricCrazyJohns) June 26, 2023
Details of World Cup 2023 Trophy launch & Tours:
— CricketMAN2 (@ImTanujSingh) June 26, 2023
•WC Trophy become one of the first official sporting Trophies to be sent to space.
•Trophy being launched into Stratosphere, 120,000 feet above the earth.
•Trophy Tour in 18 countries.
•Trophy will remain India from 4 Sep. pic.twitter.com/erF623INKM
Join Us on Telegram: https://t.me/abpdesamofficial