News
News
X

T20 World Cup Final: దాన్ని కర్మ అంటారు బ్రో - షోయబ్ అక్తర్‌కు షమీ సాలిడ్ రిప్లై!

టీ20 ప్రపంచకప్ ఫైనల్ అనంతరం షోయబ్ అక్తర్ వేసిన ట్వీట్‌కు మహ్మద్ షమీ రిప్లై ఇప్పుడు వైరల్ అవుతుంది.

FOLLOW US: 
 

2022 టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిన తరువాత షోయబ్ అక్తర్ చేసిన ట్వీట్‌కు టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాక్ ఓటమికి షోయబ్ అక్తర్ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేశాడు. దాన్ని మహ్మద్ షమీ కోట్ చేసి "సారీ బ్రదర్ ఇట్స్ కాల్ కర్మ" అని వ్రాశాడు. షమీ ఇచ్చిన క్విక్ రిప్లై ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది గాయపడడం ఇంగ్లండ్‌కు ఎంతో మేలు చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ బాబర్ ఆజం కూడా ఇదే విషయాన్ని అంగీకరించాడు.

"ఇంగ్లండ్‌కు అభినందనలు. వారు ఛాంపియన్‌లుగా ఉండటానికి అర్హులు. మాకు ఆస్ట్రేలియా ఇంటిలా అనిపించింది. ప్రతి వేదికలోనూ గొప్ప మద్దతు లభించింది. మేం మొదటి రెండు గేమ్‌లలో ఓడిపోయాం. కానీ తర్వాత నాలుగు గేమ్‌లలో ఎలా ఆడామన్నది నమ్మశక్యంగా లేదు. తమ సహజ ఆట ఆడమని నేను ఆటగాళ్లకు చెప్పాను. మేం మొదటి ఇన్నింగ్స్‌లో 20 పరుగులు వెనకబడ్డాం. బౌలర్లు అసాధారణంగా పోరాడారు. మా బౌలింగ్ ప్రపంచంలోనే అత్యుత్తమ అటాక్స్‌లో ఒకటి. దురదృష్టవశాత్తు షహీన్ గాయం మాకు అడ్డంగా నిలిచింది. కానీ అది ఆటలో భాగమే." అని మ్యాచ్ అనంతరం బాబర్ ఆజం చెప్పాడు.

మెల్‌బోర్న్‌ వేదికగా నువ్వా నేనా అన్నట్టు సాగిన ఫైనల్లో పాకిస్తాన్‌పై ఇంగ్లండ్ అద్వితీయ విజయం అందుకుంది. బంతితో గట్టి పోటీనిచ్చిన పాకిస్థాన్‌ను ఓడించింది. రెండోసారి టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీని ముద్దాడింది. 2019 వన్డే ప్రపంచకప్‌ మొనగాడు బెన్‌స్టోక్స్‌ (52; 49 బంతుల్లో 5x4, 1x6) అజేయంగా పోరాడి మరోసారి తన పేరు నిలబెట్టుకున్నాడు. కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ (26; 17 బంతుల్లో 3x4, 1x6) రాణించాడు. అంతకు ముందు పాక్‌లో బాబర్‌ ఆజామ్‌ (32; 28 బంతుల్లో 2x4), షాన్‌ మసూద్‌ (38; 28 బంతుల్లో 2x4, 1x6) టాప్‌ స్కోరర్లు.

ఓపెనర్లు ఉన్న ఫామ్‌కి ఇంగ్లాండ్ సునాయాసంగా విజయం అందుకోవాలి! ఓవర్‌ క్యాస్ట్‌ కండీషన్స్‌ ఉండటం, రెండో ఇన్నింగ్స్‌ సాగుతున్నంత సేపూ చిన్న చిన్న చినుకులు పడుతుండటం పాక్‌ బౌలర్లకు అనుకూలంగా మారింది. ఆ జట్టు ఫాస్ట్‌ బౌలర్లు అద్భుతమైన సీమ్‌, బౌన్స్‌తో ఆంగ్లేయులను ఇబ్బంది పెట్టారు. పవర్‌ ప్లే ముగిసే సరికే 3 వికెట్లు పడగొట్టారు. ఇన్నింగ్స్‌ ఆరో బంతికే అలెక్స్‌ హేల్స్‌ (1)ను షాహిన్‌ అఫ్రిది బౌల్డ్‌ చేశాడు. 32 వద్ద ఫిల్‌సాల్ట్‌ (10), 45 వద్ద బట్లర్‌ను హ్యారిస్‌ రౌఫ్‌ పెవిలియన్‌ పంపించాడు. బట్లర్‌ దూకుడుగా ఆడి బౌండరీలు రాబట్టడంతో పవర్‌ప్లేలో రావాల్సిన రన్స్‌ వచ్చాయి. 7-15 ఓవర్ల మధ్య ఆంగ్లేయులపై పాక్‌ బౌలర్లు ఒత్తిడి పెంచారు. బ్యాక్‌ ఆఫ్ ది లెంగ్త్‌ బంతులతో ముచ్చెమటలు పట్టించారు.

హీరో బెన్ స్టోక్సే!
బెన్‌స్టోక్స్‌ ఆఖరి వరకు ఉండటం ఇంగ్లాండ్‌కు కలిసొచ్చింది. మరో వికెట్‌ పడకుండా అతడు నిలబడ్డాడు. హ్యారీ బ్రూక్‌ (20)తో కలిసి సింగిల్స్‌, డబుల్స్‌ తీశాడు. 13వ ఓవర్ వరకు వికెట్‌ ఇవ్వకపోవడంతో పాక్‌పై ఒత్తిడి పెరిగింది. ఈ సిచ్యువేషన్‌లో బ్రూక్‌ను షాదాబ్‌ ఔట్‌ చేసి బ్రేకిచ్చాడు. వసీమ్‌ తన ఆఖరి రెండు ఓవర్లలో చాలా బంతుల్ని బీట్‌ చేశాడు. అయితే స్టోక్స్‌కు మొయిన్‌ అలీ (19) అండగా నిలిచాడు. బ్రూక్‌ క్యాచ్‌ అందుకున్న అఫ్రిది మోకాళ్లు గాయపడటంతో మళ్లీ బౌలింగ్‌ చేయలేకపోయాడు. ఇఫ్తికార్‌ వేసిన 16వ ఓవర్లో స్టోక్స్‌ ఆఖరి 2 బంతుల్ని 4, 6గా మలిచాడు. తర్వాతి ఓవర్లో మొయిన్‌ మూడు బౌండరీలు కొట్టాడు. సమీకరణం 12 బంతుల్లో 7కు మారడంతో అలీ ఔటైనా ఇంగ్లాండ్ గెలిచేసింది.

అదరగొట్టిన ఇంగ్లాండ్ బౌలర్లు
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ బ్యాటర్లను ఇంగ్లిష్ బౌలర్లు వణికించారు. ఓవర్‌ క్యాస్ట్‌ కండిషన్స్‌ను ఉపయోగించుకొని చక్కని లెంగ్తుల్లో బంతులు విసిరారు. స్వింగ్‌, బౌన్స్‌తో ప్రత్యర్థికి మెరుగైన ఆరంభం దక్కనీయలేదు. ఓపెనర్లు రిజ్వాన్‌ (15), బాబర్‌ ఆజామ్‌ (32) షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడ్డారు. జట్టు స్కోరు 29 వద్ద కరన్‌ వేసిన బంతికి రిజ్వాన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దాంతో పవర్‌ ప్లే ముగిసే సరికి పాక్‌ 39/1తో నిలిచింది.

వన్‌డౌన్‌లో వచ్చిన హ్యారిస్‌ (8)ను రషీద్‌ బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో బాబర్‌, మసూద్‌ 24 బంతుల్లో 39 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. అద్భుతమైన గూగ్లీతో బాబర్‌ను ఔట్‌ చేసి రషీద్‌ ఈ జోడీని విడగొట్టాడు. తన స్పిన్‌తో పరుగుల్నీ నియంత్రించాడు. మరికాసేపటికే స్టోక్స్‌ బౌలింగ్‌లో ఇఫ్తికార్‌ ఔటయ్యాడు. కష్టాల్లో పడ్డ జట్టును షాదాబ్‌ (20) ఆదుకొనే ప్రయత్నం చేశాడు. రెండు పరుగుల వ్యవధిలోనే మసూద్‌, షాదాబ్‌ పెవిలియన్ చేరడంతో రన్‌రేట్‌ తగ్గిపోయింది. ఆఖర్లో టపటపా వికెట్లు పడటంతో పాక్‌ 138/7 వద్ద ఆగిపోయింది.

Published at : 13 Nov 2022 07:04 PM (IST) Tags: Mohammed Shami Shoaib Akhtar T20 World Cup Final ENG vs PAK Highlights ICC T20 WC 2022 Final

సంబంధిత కథనాలు

IND vs BAN 3rd ODI: కెప్టెన్‌, ఇద్దరు బౌలర్లు బంగ్లా సిరీస్‌ నుంచి ఔట్‌ - ద్రవిడ్‌

IND vs BAN 3rd ODI: కెప్టెన్‌, ఇద్దరు బౌలర్లు బంగ్లా సిరీస్‌ నుంచి ఔట్‌ - ద్రవిడ్‌

BCCI Review Meeting: సిగ్గు.. సిగ్గు! బంగ్లా చేతిలో 2 సిరీసుల్లో అవమానం - టీమ్‌ఇండియా రాగానే బీసీసీఐ సమీక్ష!

BCCI Review Meeting: సిగ్గు.. సిగ్గు! బంగ్లా చేతిలో 2 సిరీసుల్లో అవమానం - టీమ్‌ఇండియా రాగానే బీసీసీఐ సమీక్ష!

Warner On Captaincy Ban: 'నా కుటుంబమే నాకు ముఖ్యం- ఆ చెత్తను క్లీన్ చేసే వాషింగ్ మెషీన్ ను కాదు'

Warner On Captaincy Ban: 'నా కుటుంబమే నాకు ముఖ్యం- ఆ చెత్తను క్లీన్ చేసే వాషింగ్ మెషీన్ ను కాదు'

Rohit Sharma: రోహిత్ ఖాతాలో అదిరిపోయే రికార్డు - క్రిస్ గేల్ తర్వాతి స్థానంలో!

Rohit Sharma: రోహిత్ ఖాతాలో అదిరిపోయే రికార్డు - క్రిస్ గేల్ తర్వాతి స్థానంలో!

ROHIT SHARMA: రోహిత్‌కు తీవ్ర గాయం - భారత్‌కు తిరిగిరానున్న కెప్టెన్!

ROHIT SHARMA: రోహిత్‌కు తీవ్ర గాయం - భారత్‌కు తిరిగిరానున్న కెప్టెన్!

టాప్ స్టోరీస్

AP BJP Reaction On Sajjla : మళ్లీ వైఎస్ఆర్‌సీపీ , టీఆర్ఎస్ డ్రామా స్టార్ట్ - సజ్జల సమైక్యవాదంపై ఏపీ బీజేపీ సెటైర్ !

AP BJP Reaction On Sajjla :  మళ్లీ వైఎస్ఆర్‌సీపీ , టీఆర్ఎస్ డ్రామా స్టార్ట్ - సజ్జల సమైక్యవాదంపై ఏపీ బీజేపీ సెటైర్ !

Why Vijaysaireddy Lost Post : అసభ్య ట్వీట్లే పదవిని దూరం చేశాయా ? విజయసాయిరెడ్డికి " ప్యానల్ వైస్ చైర్మన్" పోస్ట్ ఎలా దూరం అయింది ?

Why Vijaysaireddy Lost Post :  అసభ్య ట్వీట్లే పదవిని దూరం చేశాయా ? విజయసాయిరెడ్డికి

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!

Gujarat Election Results 2022: పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఘన విజయం, కాంగ్రెస్ అభ్యర్థిపై భారీ మెజార్టీ

Gujarat Election Results 2022: పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఘన విజయం, కాంగ్రెస్ అభ్యర్థిపై భారీ మెజార్టీ