అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

T20 World Cup 2024: ప్రశాంతంగా నిర్వహిస్తాం, ఉగ్రముప్పు వార్తలపై ఐసీసీ

T20 World Cup 2024: 2024 టీ20 ప్రపంచకప్‌నకు తీవ్రవాద బెదిరింపులు వచ్చిన తర్వాత భద్రతా చర్యలను పటిష్టం చేసేందుకు ఆతిథ్య దేశాలతో కలిసి పనిచేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది.

ICC responds after alleged terror threat to T20 World Cup:  జూన్ 1 నుంచి అమెరికా-వెస్టిండీస్ కలిసి నిర్వహిస్తున్న ట్వంటీ-20 ప్రపంచ కప్ టోర్నీకి ఉగ్ర ముప్పు పొంచి ఉంది. ఉత్తర పాకిస్థాన్ లో పనిచేస్తున్న తీవ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు వచ్చినట్టు వెస్టిండీస్ లోని ఓ దేశమైన ట్రినిడాడ్ అండ్ టుబాగో ప్రధాని కీత్ రౌలే వెల్లడించారు. ఉగ్రమూకలు ఎలాంటి దాడులకైనా పాల్పడే ప్రమాదం ఉందని, వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. టోర్నీ ఆసాంతం మ్యాచ్ లు జరిగే వేదికలు, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. ఇప్పటికే.. తమ దేశ ఇంటెలిజెన్స్ , సెక్యూరిటీ ఏజెన్సీలు ఆ కార్యక్రమంలో నిమగ్నమైనట్టు కీత్ రౌలే స్పష్టం చేశారు.  ఈ పరిస్థితులను గమనిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి-ICCఆతిథ్య దేశాల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు వెల్లడించింది. 

పటిష్ట భద్రత: ఐసీసీ
2024 టీ20 ప్రపంచకప్‌నకు తీవ్రవాద బెదిరింపులు వచ్చిన తర్వాత భద్రతా చర్యలను పటిష్టం చేసేందుకు ఆతిథ్య దేశాలతో కలిసి పనిచేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది. పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024 కోసం తగిన భద్రతా ఏర్పాట్లు చేశామని, మరింత భద్రత ఏర్పాటు చేసేందుకు ఆతిథ్య దేశాలతో కలిసి చురుగ్గా పనిచేస్తున్నామని ఐసీసీ తెలిపింది. తీవ్రవాద ముప్పు గురించి నివేదికలు వచ్చిన తర్వాత ఐసీసీ అధికారులు తక్షణం స్పందించారని వెల్లడించింది. ప్రపంచకప్‌నకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాన మంత్రి కీత్ రౌలీ తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా టీ 20 ప్రపంచకప్‌ నిర్వహించేందుకు సమగ్ర భద్రతా ప్రణాళిక ఉందని క్రికెట్ వెస్టిండీస్ ప్రతి ఒక్కరికీ హామీ ఇచ్చిందని ఐసీసీ అధికారి ఒకరు తెలిపారు.

ఆరంభం అప్పుడే..
జూన్‌ 1 నుంచి పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో కెనడా తలపడబోతోంది. జూన్‌ 1న ప్రారంభంకానున్న టీ 20 ప్రపంచకప్‌ జూన్‌ 29న ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్‌ ఏ లో భారత్‌(Team India), పాకిస్థాన్‌(Pakistan) జట్లు ఉన్నాయి. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 9న జరగనుంది. టీమిండియా గ్రూప్ దశలో జూన్‌ అయిదున ఐర్లాండ్‌తో 12న అమెరికాతో 15న కెనడాతో తలపడనుంది. 
అమెరికాతో 15న కెనడాతో తలపడనుంది. 
టీ 20 ప్రపంచకప్‌లో టీం ఇండియా షెడ్యూల్‌
ఇండియా vs ఐర్లాండ్‌ - జూన్‌ 5 (న్యూయార్క్)
ఇండియా vs పాకిస్థాన్‌ - జూన్‌ 9 ( న్యూయార్క్)
ఇండియా vs యూఎస్‌ఏ - జూన్‌ 12 (న్యూయార్క్)
ఇండియా vs కెనడా - జూన్‌ 15 (ఫ్లోరిడా)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Embed widget