![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
T20 World Cup 2024: టీ 20 విజేతపై కనకవర్షం కురవనుందా? ప్రైజ్ మనీ తెలిస్తే కళ్ళు తిరిగిపోతాయ్
T20 World Cup 2024: ICC T20 వరల్డ్ కప్ 2024 టీంలపై ఈసారి డబ్బుల వర్షం కురవనుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ప్రకటించింది.
![T20 World Cup 2024: టీ 20 విజేతపై కనకవర్షం కురవనుందా? ప్రైజ్ మనీ తెలిస్తే కళ్ళు తిరిగిపోతాయ్ Icc Has Increased The Prize Money Announced For The Winners Of The Short World Cup T20 World Cup 2024: టీ 20 విజేతపై కనకవర్షం కురవనుందా? ప్రైజ్ మనీ తెలిస్తే కళ్ళు తిరిగిపోతాయ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/04/a15af1fac1edbe085dd43d6efe663efd17174684646721036_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
T20 World Cup 2024 Prize Money: వెస్టిండీస్, USA లో జరుగుతున్న T20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024) ప్రైజ్ మనీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది. ఈ ప్రపంచకప్ టోర్నీలో ప్రపంచంలోని 20 వివిధ దేశాల జట్లు పాల్గొంటున్నాయి. ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకున్న జట్టుకు 2.45 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ. 20.4 కోట్లు బహుమతిగా ఇవ్వబడుతుంది. ఇక రన్నరప్‌కి ప్రైజ్ మనీ 1.28 మిలియన్ US డాలర్లు. భారత కరెన్సీ ప్రకారం, రన్నరప్ జట్టుకు సుమారు రూ. 10.6 కోట్లు అందుతుంది. గత టీ20 వరల్డ్ కప్ మనీ 5.6 మిలియన్ డాలర్లు కాగా ఈసారి ప్రైజ్‌మనీ సుమారు రెట్టింపు అన్నమాట. అసలు టీ20 ప్రపంచకప్ చరిత్రలో విజేత జట్టు ఇంత మొత్తం అందుకోవడం తొలిసారి.
గేమ్ లో సెమీ-ఫైనల్‌కు చేరుకునే మిగిలిన రెండు జట్లకు కూడా సమాన మొత్తంలో $787,500 డాలర్లు, అంటే రూ. 6.54 కోట్లు ఇస్తారు. మొత్తం ఈసారి టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లు పాల్గొంటున్నాయి. పాల్గొనే ప్రతి జట్టుకు ఐసీసీ కొంత మొత్తాన్ని అందజేస్తుంది. అసలు సూపర్-8(Super 8) దాటి ముందుకు సాగని ప్రతి జట్లకు కూడా $382,500 అంటే సుమారు రూ. 3.17 కోట్లు అందుతాయి. ఇక తొమ్మిదో స్థానం నుంచి 12వ స్థానాల్లో నిలిచిన జట్లకు ఒక్కొక్కరికి $247,500 అంటే సుమారు రూ. 20.57 కోట్లు అందుతాయి. ఇక 13 నుంచి 20వ ర్యాంక్‌లో ఉన్న జట్లకు ఒక్కొక్కరికి $225,000 సుమారు రూ. 1.87 కోట్లు ఇస్తారు. T20 ప్రపంచ కప్ కోసం మొత్తం $11.25 మిలియన్ అంటే సుమారు రూ. 93.51 కోట్లు ప్రైజ్ మనీ ఫిక్స్ చేశారు.
ICC reveal historic prize money for the Men's #T20WorldCup 🤩
— ICC (@ICC) June 3, 2024
Details ⬇️https://t.co/jRhdAaIkmc
- విన్నర్ : దాదాపు రూ. 20.36 కోట్లు
- రన్నరప్: రూ. 10.64 కోట్లు
- సెమీ-ఫైనల్: రూ. 6.54 కోట్లు
- రెండో రౌండ్‌లో ఔట్: రూ. 3.17 కోట్లు
- 9 నుంచి 12వ ర్యాంక్‌లో ఉన్న జట్లు: రూ. 2.05 కోట్లు
- జట్లు 13 నుంచి 20వ ర్యాంక్: రూ. 1.87 కోట్లు
- మొదటి, రెండవ రౌండ్‌లలో విజేతలు: రూ. 25.89 లక్షలు
- టోర్నీలో గెలిచిన ప్రతి మ్యాచ్‌కు ఒక్కో జట్టు అదనంగా రూ. 25 లక్షలు
వరల్డ్‌కప్ చరిత్రలోనే రికార్డు ప్రైజ్‌మనీ
భారత కరెన్సీ ప్రకారం , T20 ప్రపంచ కప్ 2024 కోసం ICC మొత్తం 93.5 కోట్ల రూపాయల ప్రైజ్ ఫండ్‌ను సిద్ధం చేసింది. గెలిచిన జట్టుపై కోట్లాది రూపాయల వర్షం కురిపించినప్పటికీ, సెమీఫైనలిస్టులతో పాటు చివరి స్థానంలో నిలిచిన జట్టుకు కూడా కొంత మొత్తాన్ని ప్రైజ్ ఫండ్ నుంచి అందజేస్తారు. ఉగాండా, పపువా న్యూ గినియాతో సహా అనేక అసోసియేట్ దేశాలలో క్రికెట్ కష్టతరమైన పరిస్థితిలో ఉంది. అక్కడ క్రికెట్‌ను ప్రోత్సహించడంలో ICC ఇచ్చే నిధులు సహాయపడతాయి. ఈ కారణంతోనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక టోర్నీలో గెలిచిన ప్రతి మ్యాచ్‌కు ఒక్కో జట్టు అదనంగా రూ. 25 లక్షలు సంపాదిస్తుంది. రెండేండ్ల క్రితం ఆస్ట్రేలియాపై ట్రోఫీ అందుకున్న ఇంగ్లండ్ రూ.13 కోట్లు గెలుచుకుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)