అన్వేషించండి
Advertisement
ODI World Cup 2023: టాప్ 5లో ఇద్దరు భారత్ ఆటగాళ్లే, పాయింట్ల పట్టికలోనూ టాప్ మనమే
ODI World Cup 2023: స్వదేశంలో అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
స్వదేశంలో అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ అయిదు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ సేన అన్నింట్లో విజయం సాధించి పది పాయింట్లో పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉంది. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ భారీ స్కోర్లు నమోదు చేస్తున్న దక్షిణాఫ్రికా 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నెదర్లాండ్స్‌పై ఒక్క ఓటమి మినహా, టోర్నమెంట్ అంతటా ప్రోటీస్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. న్యూజిలాండ్ 8 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన కివీస్.. మిగిలిన అన్ని మ్యాచుల్లో విజయం సాధించి మూడో స్థానంలో కొనసాగుతోంది. మహా సంగ్రామంలో తొలి రెండు మ్యాచుల్లో పరాజయం పాలైన కంగారులు.... తర్వాత పుంజుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకున్నారు. తర్వాత మూడు మ్యాచుల్లో గెలిచిన కంగారులు 6 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఈ నాలుగు జట్లే సెమీస్ చేరుతాయాని మాజీ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు. నాలుగు పాయింట్లతో పాకిస్థాన్ అయిదో స్థానంలో అవే నాలుగు పాయింట్లతో అఫ్గానిస్థాన్ అరవ స్థానంలో ఉంది. శ్రీలంక, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి.
అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ఆటగాళ్లు
ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా దక్షిణాఫ్రికా బ్యాటింగ్ స్టార్ క్వింటన్ డి కాక్ తొలి స్థానంలో ఉన్నాడు. టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్లలో రెండో స్థానంలో ఉన్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు.
1. క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా) - 5 ఇన్నింగ్స్‌ల్లో 407 పరుగులు
2. విరాట్ కోహ్లీ (భారత్) - 5 ఇన్నింగ్స్‌ల్లో 354 పరుగులు
3. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) - 5 ఇన్నింగ్స్‌ల్లో 332 పరుగులు
4. రోహిత్ శర్మ (భారత్) - 5 ఇన్నింగ్స్‌లలో 311 పరుగులు
5. మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్) - 5 ఇన్నింగ్స్‌ల్లో 302 పరుగులు
ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్ జంపా ఐదు ప్రపంచ కప్ మ్యాచ్‌లలో 13 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు, కివీ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ 12 వికెట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. దిల్షాన్ మధుశంక 11 వికెట్లు, బుమ్రా 11 వికెట్లు, మాట్ హెన్రీ 11 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే సగటు ఆధారంగా మధుశంక మూడో స్థానంలో ఉండగా... బుమ్రా నాలుగు, హెన్రీ అయిదో స్థానంలోఉన్నారు.
1. ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) - 5 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు
2. మిచెల్ సాంట్నర్ (న్యూజిలాండ్) - 5 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు
3. దిల్షాన్ మధుశంక (శ్రీలంక) - 4 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు
4. జస్ప్రీత్ బుమ్రా (భారత్) - 5 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు
5. మాట్ హెన్రీ (న్యూజిలాండ్) - 5 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు
ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతున్నా కొద్దీ భారీగా పరుగులు నమోదు అవుతున్నాయి. బ్యాటర్లు భారీ స్కోర్లు నమోదు చేస్తుండగా.... బౌలర్లు కూడా మెరుగ్గా రాణిస్తున్నారు. నాకౌట్ దశకు చేరువవుతున్న సమయంలో మ్యాచ్‌లు మరింత ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. జట్లన్నీ నాకౌట్‌కు చేరడం మీద కన్నేయడంతో మ్యాచ్‌లు మరింత ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion