News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

T20 WC 2024 Venues: అగ్రరాజ్యాన పొట్టి ప్రపంచకప్, వేదికలు ఖరారు - దాయాదుల పోరు ఎక్కడంటే!

2024లో జరుగబోయే టీ20 వరల్డ్ కప్‌‌లో వెస్టిండీస్‌తో పాటు అమెరికా కూడా ఆతిథ్య హక్కులు పొందిన విషయం విదితమే.

FOLLOW US: 
Share:

T20 WC 2024 Venues: ఇప్పుడిప్పుడే వన్డే వరల్డ్ కప్ ఫీవర్ మొదలవుతున్న  తరుణంలో  అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరో గుడ్ న్యూస్ చెప్పింది.  వచ్చే  ఏడాది  నిర్వహించాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్ కోసం అగ్రరాజ్యం అమెరికాలో  వేదికలను కూడా ఖరారుచేసింది.   2024లో జరుగబోయే మెగా టోర్నీలో వెస్టిండీస్‌తో పాటు  అమెరికా కూడా  ఆతిథ్య హక్కులు పొందిన విషయం విదితమే.   అమెరికాలోని  మూడు మైదానాలలో  పొట్టి ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.  

ఈ మేరకు ఐసీసీ మూడు వేదికలను ఖరారుచేసింది. అమెరికాలోని న్యూయార్క్, డల్లాస్, ఫోరిడాలలో  వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగున్నాయి.  న్యూయార్క్ లోని నసౌ కౌంటీ స్టేడియం, ఫ్లోరిడాలో బ్రోవార్డ్ కౌంటీ, డల్లాస్‌లోని గ్రాండ్ ఫ్రైరీ స్టేడియాలలో  మ్యాచ్‌లను నిర్వహించేందుకు ఐసీసీ ఏర్పాట్లు చేస్తోంది. క్రికెట్‌లో అత్యంత క్రేజ్ ఉన్న  భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌ను  కూడా న్యూయార్క్‌లోనే నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది. 

వెస్టిండీస్‌తో పాటు సంయుక్తంగా అమెరికా  కూడా వరల్డ్ కప్‌ను నిర్వహిస్తున్న నేపథ్యంలో  ఐసీసీ అధికారులు.. న్యూయార్క్, డల్లాస్, ఫ్లోరిడా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైనట్టు సమాచారం.  న్యూయార్క్ నగరానికి సమీపంలో, సుమారు 30 మైళ్ల దూరంలోని ఈస్ట్ మన్‌హట్టన్‌లో  స్టేడియంలో సౌకర్యాలను మెరుగుపరచాలని, 30 వేల సీటింగ్ కెపాజిటీతో ఇక్కడ అభివృద్ధి  పనులు మొదలుపెట్టాలని న్యూయార్క్ ప్రతినిధి బృందానికి తెలిపింది. అమెరికాలో క్రికెట్ విస్తరణ కోసం ప్రత్యేకంగా వచ్చే టీ20 వరల్డ్ కప్‌కు ఆతిథ్యమివ్వడం వెనుక  ఐసీసీ  భారీ ప్రణాళిక ఉందని బహిరంగ రహస్యమే. ఇదివరకే అమెరికాలో కొద్దిరోజుల క్రితం భారత్‌లోని ఐపీఎల్  టీమ్స్  ఒక్కడ ఓ మినీ ఐపీఎల్‌ (మేజర్ లీగ్  క్రికెట్‌) ను కూడా నిర్వహించాయి.  ఆ లీగ్ కూడా మంచి విజయవంతం అయింది.  టీ20 వరల్డ్ కప్ సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో అమెరికా కూడా అంతర్జాతీయ జట్లకు క్రికెట్ డెస్టినేషన్ కానుంది. 

అయితే ఆ మేరకు  అమెరికాలో క్రికెట్ స్టేడియాలు, వసతులు లేవు. వాటిని త్వరితగతిన పూర్తి చేయడానికి ఐసీసీ అన్ని ఏర్పాట్లనూ దగ్గరుండి సమీక్షిస్తోంది. ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన స్టేడియాలలో మాడ్యూలర్ విధానంలో  సౌకర్యాలు కల్పించేందుకు గాను ఐసీసీ ఇదివరకే మాడ్యూలర్ స్టేడియం సొల్యూషన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.  వచ్చే టీ20 వరల్డ్ కప్‌లో దాదాపు 20 మ్యాచ్‌లు అయినా అమెరికాలో నిర్వహించాలని  ఐసీసీ భావిస్తుండగా.. వాటిని ఈ మూడు (డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్) స్టేడియాలకు పంచనున్నారు.  వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనబోయే జట్ల సంఖ్య కూడా భారీగా పెరగనుందని.. సుమారు 20 జట్లు పాల్గొనే అవకాశం (క్వాలిఫయర్ రౌండ్‌కు ముందు)  ఉందని  ఐసీసీ ఇదివరకే ప్రకటించింది. 2024 జూన్ 4 నుంచి జూన్ 30 వరకు కరేబియన్ దీవులు, అమెరికాలో జరుగబోయే ఈ మెగా టోర్నీకి సంబంధించిన ఇతర విషయాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఐసీసీ.. టీ20 ప్రపంచకప్‌నకు సంబంధించిన అప్డేట్స్ వెల్లడించే అవకాశం ఉంది. 

Published at : 20 Sep 2023 05:17 PM (IST) Tags: ICC New York T20 World Cup 2024 IND vs PAK T20 WC 2024 Venues

ఇవి కూడా చూడండి

India vs Australia 4th T20I: ఆసిస్‌ లక్ష్యం 175 , బౌలర్లు కాపాడుకుంటారా?

India vs Australia 4th T20I: ఆసిస్‌ లక్ష్యం 175 , బౌలర్లు కాపాడుకుంటారా?

Ravichandran Ashwin: ఆ టైంలో వాళ్లను చూసి చాలా బాధేసింది: అశ్విన్

Ravichandran Ashwin:  ఆ టైంలో వాళ్లను చూసి చాలా బాధేసింది: అశ్విన్

ICC T20 World Cup 2024: టీ20 వరల్డ్‌కప్‌ కు బెర్త్‌ ఖాయం చేసుకున్న ఉగాండా

ICC T20 World Cup 2024:  టీ20 వరల్డ్‌కప్‌ కు  బెర్త్‌ ఖాయం చేసుకున్న ఉగాండా

India vs Australia 4th T20 match: సమం చేస్తారా, సాధించేస్తారా ..

India vs Australia 4th T20 match: సమం చేస్తారా, సాధించేస్తారా ..

Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్

Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్

టాప్ స్టోరీస్

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు

Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్