ICC Chairman: ఐసీసీ ఛైర్మన్ గా మరోసారి ఎన్నికైన గ్రెగ్ బార్ క్లే
ICC Chairman: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ ICC) ఛైర్మన్‌గా గ్రెగ్ బార్‌క్లే మరోసారి నియమితులయ్యారు. శనివారం జరిగిన ఐసీసీ సమావేశంలో గ్రెగ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ICC Chairman: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ ICC) ఛైర్మన్‌గా గ్రెగ్ బార్‌క్లే మరోసారి నియమితులయ్యారు. శనివారం జరిగిన ఐసీసీ సమావేశంలో గ్రెగ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ 2020 నవంబరులో తొలిసారిగా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.
న్యూజిలాండ్ కు చెందిన గ్రెగ్ 2020 లో ఐసీసీ ఛైర్మన్ గా తొలిసారి ఎన్నికయ్యారు. ఈ నవంబరుతో ఆయన పదవీ కాలం ముగియనుంది. దీంతో ఛైర్మన్ పదవికి ఎన్నికలు నిర్వహించారు. ఈ పదవికి జింబాబ్వేకి చెందిన తవెంగ్వా ముకులానీ కూడా పోటీ చేశారు. అయితే చివరి నిమిషంలో ఆయన తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత బీసీసీఐతో పాటు 17 మంది ఐసీసీ బోర్డు సభ్యులు గ్రెగ్ బార్ క్లేకు మద్దతివ్వగా.. ఆయన ఏకగ్రవంగా ఎన్నికయ్యారు. మరో రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. గ్రెగ్ గతంలో న్యూజిలాండ్ క్రిెకెట్ బోర్డు ఛైర్మన్ గా వ్యవహరించారు. 2015 ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఐసీసీ ఛైర్మన్ పదవికి బీసీసీఐ మొదట సౌరవ్ గంగూలీని బరిలోకి దింపాలని భావించినప్పటికీ.. చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుంది.
తన ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తరువాత బార్ క్లే బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్ళలో క్రికెట్‌ను కొత్త దేశాలకు విస్తరింపజేయడంలో విజయం సాధించామని, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని వ్యాఖ్యానించారు. ఈ గేమ్‌ను మరింత బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Greg Barkley gets second term as ICC President https://t.co/NdiYlBSVT7
— Harpia News (@harpianews) November 12, 2022