అన్వేషించండి
Michael Vaughan: ప్రతిభ చూపిన ఇంగ్లాండ్ యువ స్పిన్నర్ బషీర్ - మాజీ కెప్టెన్ ప్రశంసల జల్లు
Shoaib Bashir: రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో తన బౌలింగ్‌తో ఇంగ్లాండ్ యువ స్పిన్నర్ బషీర్ ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్‌లో షోయబ్ బషీర్ కేవలం రెండు మ్యాచుల్లోనే 12 వికెట్లు తీసి అబ్బురపరిచాడు.

బషీర్ బౌలింగ్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ప్రశంసల జల్లు ( Image Source : Twitter )
Bashir has picked up eight wickets in fourth Test in Ranchi: ధర్మశాల వేదికగా మార్చి ఏడు నుంచి 11 వరకు అయిదో టెస్ట్ జరగనుంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఈ టెస్ట్‌లోనూ గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లు పెంచుకోవాలని చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని బ్రిటీష్ జట్టు చూస్తోంది. రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో తన బౌలింగ్‌తో ఇంగ్లాండ్ యువ స్పిన్నర్ బషీర్ ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్‌లో షోయబ్ బషీర్ కేవలం రెండు మ్యాచుల్లోనే 12 వికెట్లు తీసి అబ్బురపరిచాడు. భారత బ్యాటర్లను బాగానే తిప్పలు పెట్టాడు. ఇప్పుడు బషీర్‌పై ఇంగ్లాండ్ భారీగా ఆశలు పెట్టుకుంది. అయితే బషీర్ బౌలింగ్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ప్రశంసల జల్లు కురిపించాడు.
ప్రదర్శన అద్భుతం
ఇంగ్లాండ్ ఇటీవల వరుసగా ఓటములను చవిచూస్తున్నా ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతంగా ఉందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ అన్నాడు. ఈ మెగా సిరీస్‌లో ఇంగ్లాండ్ తరఫున ప్రపంచస్థాయి స్పిన్నర్ షోయబ్ బషీర్ వెలుగులోకి వచ్చాడని అన్నాడు. కేవలం తన రెండో మ్యాచ్‌లోనే 8 వికెట్లు తీశాడని. అతడు రవిచంద్రన్ అశ్విన్ కొత్త వెర్షన్ అని వాన్ అన్నాడు. తమ సెలక్టర్లు బషీర్‌ను తీసుకురావడం అభినందనీయమని... ఇంగ్లిష్ క్రికెట్‌కు తప్పకుండా మంచి జరుగుతుందన్నాడు. ధర్మశాలలో మా జట్టు విజయం సాధిస్తుందని భావిస్తున్నానని మైకెల్ వాన్ ధీమా వ్యక్తం చేశాడు. యాషెస్ సిరీస్‌తో పోలిస్తే ఇక్కడే అత్యుత్తమ టీమ్ ఆడుతోందన్నాడు. ఈ సిరీస్‌ను గెలుచుకోలేకపోయినా.. చివరి మ్యాచ్‌నైనా విజయంతో ముగిస్తామన్నాడు.
ఆ ఇద్దరి ముందు అరుదైన రికార్డు
అరుదైన రికార్డు ముందు ఆ ఇద్దరు...
ధర్మశాల వేదికగా మార్చి ఏడు నుంచి 11 వరకు అయిదో టెస్ట్ జరగనుంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఈ టెస్ట్‌లోనూ గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లు పెంచుకోవాలని చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని బ్రిటీష్ జట్టు చూస్తోంది. అయితే ఈ మ్యాచ్ ద్వారా ఇద్దరు ఆటగాళ్లు అరుదైన రికార్డు సృష్టించనున్నారు. టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టోలకు ఈ మ్యాచ్ ప్రతిష్టాత్మకంగా నిలవనుంది. అశ్విన్, జానీ బెయిర్ స్టోలు తమ కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరు ఎలా రాణిస్తారు అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ ఎవరికి తీపి గుర్తుగా మిగలనుందో మరికొద్ది రోజుల్లో తేలనుంది. టీమ్ఇండియా తరుపున ఇప్పటి వరకు కేవలం 13 మంది ఆటగాళ్లు మాత్రమే టెస్టుల్లో వందకు పైగా మ్యాచ్‌లు ఆడారు. అశ్విన్ 14వ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. భారత్ తరుపున అత్యధిక టెస్టులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ 200 టెస్టులతో తొలి స్థానంలో ఉన్నాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion