Hardik Pandya ODI Best: కెరీర్ బెస్ట్ బౌలింగ్ చేసిన హార్దిక్ - ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు
హార్దిక్ పాండ్యా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో తన కెరీర్‌లోనే బెస్ట్ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో హార్దిక్ పాండ్యా కెరీర్ బెస్ట్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కేవలం ఏడు ఓవర్లలోనే 24 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. వీటిలో మూడు మెయిడెన్ ఓవర్లు కూడా ఉండటం విశేషం. తన వన్డే కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు ఇవే కావడం విశేషం.
తన మొదటి స్పెల్‌లో రాయ్, స్టోక్స్‌ను అవుట్ చేసిన హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ 37వ ఓవర్లో అద్భుతం చేశాడు. క్రీజులో నిలదొక్కుకున్న జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్‌లను కేవలం నాలుగు బంతుల వ్యవధిలోనే అవుట్ చేసి ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చాడు.
హార్దిక్ అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్ 246 పరుగులకే ఆలౌట్ అయింది. హార్దిక్‌తో పాటు యుజ్వేంద్ర చాహల్ మూడు వికెట్లు తీయగా... మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు, రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో 60 పరుగులు చేసిన జోస్ బట్లరే టాప్ స్కోరర్.
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

