(Source: ECI/ABP News/ABP Majha)
Glenn Maxwell: మాక్సి మామ మనోడే, ఎలాగంటే?
Glenn Maxwell: గ్లెన్ మాక్స్‌వెల్ వ్యక్తిగత జీవితానికి వస్తే అతనికి మన దేశంతో దగ్గరి సంబంధం ఉంది. ఈ స్టార్ బ్యాటర్ భారతీయ మూలాలున్న ఫార్మాసిస్ట్ వినీ రామన్ ను మాక్స్ వివాహం చేసుకున్నాడు.
Glenn Maxwell Wife : ముంబై(Mumbai)లోని వాంఖడే స్టేడియం(Wankhede Stadium) గ్లెన్ మాక్స్‌వెల్ విధ్వంసంతో దద్దరిల్లిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్లో మాక్స్ వెల్ వీరోచితమైన పోరాటం చేశాడు. రికార్డులు బద్దలు కొట్టాడు. సిక్సర్లు, ఫోర్ లతో చెలరేగిపోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన జట్టును విజయతీరానికి చేర్చాడు. చివరికి డబుల్ సెంచరీ చేసి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ సాధారణ ఆటతీరుపై ప్రపంచం అంతా వెర్రెత్తిపోతోంది. ఈ మ్యాచ్ తో ప్రపంచ క్రికెట్ చరిత్రలో విధ్వంసకర ఆటగాడిగా తనకంటూ ఓ పేరును లిఖించుకున్నాడు. ఇక ఇప్పుడు ఎవరినోటవిన్నా అదే మాట.. ఎక్కడ చూసినా అతని గురించే వెతుకులాట.
ఇక గ్లెన్ మాక్స్‌వెల్ వ్యక్తిగత జీవితానికి వస్తే అతనికి మన దేశంతో దగ్గరి సంబంధం ఉంది. ఈ స్టార్ బ్యాటర్ భారతీయ మూలాలున్న ఫార్మాసిస్ట్ వినీ రామన్ ను మాక్స్ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి పెళ్లి క్రిస్టియన్, హిందూ సంప్రదాయ పద్దతుల్లో జరిగింది. ఇక వినీ రామన్ సీమంతపు వేడుకును ఎంతో ఘనంగా నిర్వహించారు. అచ్చమైన చీరకట్టు, బొట్టులో మహాలక్ష్మిలా ఉన్న మాక్సీ భార్య ఫోటోలు ఒకప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యాయి. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. మాక్స్‌వెల్ భారీ విధ్వంసం తరువాత వినీ రామన్ పెవిలియన్ గ్రౌండ్ నుంచి ఒక ఫోటోను జత చేస్తూ ఒక ప్రత్యేక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెట్టింది. ముందు స్టోరీలో రాసిన 100 ను కొట్టేసి అక్కడ 201 నాట్ అవుట్ సింబల్ పెట్టడంతో పాటూ విత్ ఆల్ ఎమోషన్స్ అని ఒక వాక్యాన్ని జత చేసింది.
34 ఏళ్ల మ్యాక్స్.. ఆల్ రౌండర్ గా రాణిస్తూ ఆస్ట్రేలియాకు ఎన్నో విజయాలు కట్టబెట్టాడు. ముఖ్యంగా టీ20ల్లో మ్యాక్స్ బ్యాటింగ్ స్టైల్ చాలా డిఫరెంట్. 98 టీ20 మ్యాచ్లు ఆడిన మ్యాక్స్వెల్.. 150.98 స్ట్రైక్ రేట్తో 2159 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు ఉన్నాయి.
ఇక ఈ వరల్డ్ కప్ లో మ్యాక్స్‌వెల్ ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు. కేవలం 40 బంతుల్లోనే ఈ మైలురాయి చేరుకున్నాడు, దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్‌రామ్ 43 బంతుల్లో చేసిన రికార్డును మ్యాక్స్‌వెల్ బద్దలు కొట్టాడు. 40 బంతుల్లోనే చేసిన సెంచరీ వన్డే చరిత్రలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ చేసిన వేగవంతమైన శతకం కూడా. అలాగే వన్డేల్లో చివరి పది ఓవర్లలో 100కి పైగా పరుగులు చేసిన తొలి ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్. ఈ సెంచరీని మాక్స్వెల్ తన కుమారుడు లోగన్ మాక్స్వెల్ కు అంకితం ఇచ్చాడు. ఇక మాక్స్‌వెల్ తన ఇన్నింగ్స్‌లో ఎనిమిది సిక్సర్లు కొట్టాడు. ఆడమ్ గిల్‌క్రిస్ట్ , రికీ పాంటింగ్‌లతో కలిసి పాటు ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో మ్యాక్స్‌వెల్ రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే మాక్స్‌వెల్ -పాట్ కమ్మిన్స్ ఏడో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. ఇది ప్రపంచ కప్ లో ఏడో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం.
వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లలో భాగంగా అఫ్గాన్ తో మంగళవారం జరిగిన మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ సిక్సర్ తో డబుల్ సెంచరీ సాధించాడు. సెంచరీ తరువాత కండరాలు పట్టేసి, కాలు నొప్పి వేధిస్తున్నా ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసుకుంటూ దాదాపుగా స్ట్రైకింగ్ భారాన్ని, జట్టును గెలిపించే బాధ్యతను తనపై వేసుకుని జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఓ దశలో మ్యాక్స్ వెల్ బాధను చూడలేక టీమ్ మేనేజ్ మెంట్ అతడ్ని రిటైర్డ్ హర్ట్ గా వెనక్కి పిలిపించి స్పిన్నర్ ఆడమ్ జంపాను బ్యాటింగ్ కు పంపించాలని చూసింది. అప్పటికి కూడా ఆసీస్ విజయానికి మరో 50 పరుగుల మీదే అవసరం ఉంది. కానీ పట్టుదలగా ఆడిన మ్యాక్స్ వెల్ పలు రికార్డులు బద్దులకొట్టాడు. జట్టును గెలిపించే క్రమంలో 158 వ్యక్తిగత పరుగులు దాటడంతో అద్భుత రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.