By: Vihari TP | Updated at : 19 Jan 2023 05:10 PM (IST)
ఇషాన్ కిషన్‌ను బూతులు తిట్టిన శుభ్‌మన్ గిల్- నవ్వుకున్న రోహిత్ శర్మ(Image Source: BCCI Twitter)
ఇషాన్ కిషన్ ను శుభ్ మన్ గిల్ బూతులు తిట్టాడంట. అదేంటీ వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా... బూతులు తిట్టేంత పని కిషన్ ఏం చేశాడనుకుంటున్నారా.. ? లేదా డబుల్ సెంచరీ కొట్టిన తర్వాత గిల్ ఏమైనా కాస్త ఎక్స్ ట్రాలు చేస్తున్నాడని అనుకుంటున్నారా..?
అసలు విషయమేంటంటే.... నిన్న కివీస్ తో మొదటి వన్డే ముగిసిన తర్వాత... ఎప్పట్లానే బీసీసీఐ తన అఫీషియల్ వెబ్ సైట్ లో ఓ ఫన్ ఇంటర్వ్యూ పోస్ట్ చేసింది. ఇందులో రోహిత్ హోస్ట్. గిల్, ఇషాన్ కిషన్ గెస్ట్స్ అన్నమాట. మరి ఈ వీడియో హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
డబుల్ సెంచరీ సాధించడంపై గిల్ కు రోహిత్ కంగ్రాట్స్ చెప్పాడు. గిల్ ఆలోచనలను అడిగి తెలుసుకున్నాడు. శ్రీలంకతో తొలి రెండు వన్డేల్లో భారీ స్కోరు చేద్దామని గిల్ అనుకున్నాడంట. కానీ కుదర్లేదంట. నిన్నటి వన్డేలో అలాంటి అవకాశం మళ్లీ వచ్చిందని, దాన్ని ఇంతటి భారీ స్కోరుగా మార్చగలిగినందుకు ఆనందంగా ఉందని గిల్ చెప్పాడు.
ఓ వైపున వికెట్లు కోల్పోతున్నా ఇన్నింగ్స్ నిర్మించిన విధానం చాలా బాగుందంటూ గిల్ కు రోహిత్ కితాబిచ్చాడు. గిల్ స్కోర్ 208 ఆ తర్వాతి బెస్ట్ స్కోర్ 34. ఈ తేడానే చెప్తోంది...ఎంత గొప్ప ఇన్నింగ్సో అంటూ రోహిత్ ప్రశంసించాడు. గిల్ ఆలోచనా విధానాన్ని మెచ్చుకున్న రోహిత్.... వరుసగా వికెట్లు పడుతుంటే నీ మైండ్ లో ఏం నడుస్తోందని గిల్ ను ప్రశ్నించాడు.
1⃣ Frame
— BCCI (@BCCI) January 19, 2023
3️⃣ ODI Double centurions
Expect a lot of fun, banter & insights when captain @ImRo45, @ishankishan51 & @ShubmanGill bond over the microphone 🎤 😀 - By @ameyatilak
Full interview 🎥 🔽 #TeamIndia | #INDvNZ https://t.co/rD2URvFIf9 pic.twitter.com/GHupnOMJax
వికెట్లు పడుతుంటే... బౌలర్ ను ప్రెషర్ లో పడేయాలి, వీడు ఫోర్లు కొట్టడానికి చూస్తున్నాడని బౌలర్ అనుకునేలా చేయాలని అనుకున్నానని గిల్ అన్నాడు. కిషన్ బ్యాటింగ్ కు వచ్చినప్పుడు కూడా అదే చెప్పినట్టు గిల్ వెల్లడించాడు.
ఈ టైంలో రోహిత్ ఓ చిన్న జోక్ క్రాక్ చేశాడు. అసలు ఈ వీడియోలో వీడెందుకు ఇక్కడ అంటూ కిషన్ ను ఉద్దేశించి అన్నాడు. అప్పుడు కిషన్... గిల్ ను ఓ ప్రశ్న అడిగాడు. మ్యాచ్ కు ముందు నువ్వు ఎలా సిద్ధమవుతావు, అంటే ప్రీ మ్యాచ్ రోటీన్ ఏంటని కిషన్ అడిగాడు. మీ ఇద్దరూ రూమ్మేట్సే కదా నీకు తెలియదా అని రోహిత్ పంచ్ వేశాడు. గిల్ నోటి నుంచి వినాలనుకుంటున్నానని కిషన్ బదులిచ్చాడు.
నా ప్రీ మ్యాచ్ రోటీన్ అంతా కిషన్ నాశనం చేస్తాడని, పొద్దున పడుకోనివ్వడని గిల్ చెప్పాడు. ఎయిర్ పాడ్స్ వాడడని, ఫుల్ వాల్యూమ్ తో సినిమాలు చూస్తాడని గిల్ అన్నాడు. బూతులు తిట్టి మరీ సౌండ్ తగ్గించమని తాను చెప్తే.... ఇది నా రూం, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అన్నట్టుగా కిషన్ బదులిస్తాడని గిల్ చెప్పాడు.
వీడియో చివర్లో రోహిత్, కిషన్ కలిసి 200 క్లబ్ లోకి గిల్ కు స్వాగతం పలికారు. ఇక్కడే ఎండింగ్ పంచ్ హైలైట్. కిషన్... నువ్వు డబుల్ సెంచరీ కొట్టిన తర్వాత 3 మ్యాచెస్ ఆడలేదు కదా అని రోహిత్ కిషన్ ను ట్రోల్ చేశాడు. కెప్టెన్ నువ్వే కదా భయ్యా అంటూ కిషన్ అంతే వేగంగా కౌంటర్ వేసేసరికి ముగ్గరూ పగలబడి నవ్వుకున్నారు.
సరే అవన్నీ కాదు కానీ నీకు నంబర్ 4లో బ్యాటింగ్ ఇష్టమే కదా అని రోహిత్... ఇషాన్ ను అడిగాడు. ఆ స్థానంలో బ్యాటింగ్ నచ్చుతోందని కిషన్ బదులివ్వడంతో వీడియో ముగుస్తుంది. సో ఓవరాల్ గా ఈ ముగ్గురు డబుల్ సెంచురీయన్స్ వీడియో మంచి ఫన్నీగా సాగిందన్నమాట.
IND vs AUS, 1st Test Live: ఉత్కంఠ పోరుకు వేళాయే- నేడే భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్ట్
IND vs AUS: తొలి టెస్టులో ఆస్ట్రేలియా తుదిజట్టు - మార్పులు జరగనున్నాయా?
WTC Final Date: టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు డేట్ ఫిక్స్ - భారత్‌కు ఛాన్స్ ఉందా?
Harry Brook: ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టిన హ్యారీ బ్రూక్ - మోస్ట్ ఎక్సైట్మెంట్లో సన్‌రైజర్స్!
MS Dhoni: రైతు అవతారం ఎత్తిన మహేంద్ర సింగ్ ధోని - ట్రాక్టర్‌ను స్వయంగా నడుపుతూ!
Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్