Cricketers Raksha Bandhan: రైనా, పంత్ నుంచి సూర్యకుమార్ యాదవ్ వరకు భారత క్రికెటర్ల రక్షా బంధన్ సెలబ్రేషన్స్
Raksha Bandhan 2025 | భారత క్రికెటర్లు రక్షాబంధన్ వేడుకను జరుపుకున్నారు. సోదరిమణులు తమకు రాఖీ కట్టిన అపరూప సందర్భాన్ని క్రికెటర్లు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.

Cricketers Raksha Bandhan 2025 | దేశ వ్యాప్తంగా నేడు (ఆగస్టు 9న) సోదర సోదరీమణుల పండుగ రక్షాబంధన్ జరుపుకుంటున్నారు. భారత క్రికెటర్లు తమ సోదరీమణులతో కలిసి రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. క్రికెటర్లు తమ రక్షాబంధన్ వేడుకల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫ్యాన్స్ తమ అభిమాన క్రికెటర్ల రాఖీ వేడుకల ఫొటోలు, వీడియో పోస్టులు లైక్స్, కామెంట్ చేస్తున్నారు.
వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్, రిషబ్ పంత్, రవి బిష్ణోయ్, అర్జున్ టెండూల్కర్ సహా చాలా మంది క్రికెటర్లు ఘనంగా జరుపుకున్నారు. రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా అక్కాచెల్లెళ్లు తన సోదరుడికి రాఖీ కడుతారు. తన సోదరికి అన్ని విధాలా మద్దతు ఇస్తానని, వారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తానని వాగ్దానం చేస్తాడు. అలాగే, సోదరుడు తన సోదరికి తమకు తోచిన బహుమతి ఇస్తాడు. తన సోదరుడు ఎన్నో విజయాలు సాధించాలని, అతడు మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని సోదరి ఆకాంక్షిస్తుంది.
View this post on InstagramView this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
రాఖీ ఎన్ని రోజులు చేతికి ఉంటుంది..
రక్షాబంధన్ పండుగను భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా జరుపుకుంటారు. ఈ ఏడాది రక్షాబంధన్ ఆగస్టు 9, 2025న వచ్చింది. రక్షాబంధన్ రోజున అక్కాచెల్లెళ్లు తన సోదరుడి మణికట్టుకు రాఖీ కడుతారు. సోదరి కట్టిన రాఖీని శ్రావణ పూర్ణిమ నుంచి శ్రావణ అమావాస్య వరకు అంటే దాదాపు 15 రోజుల వరకు అలాగే ఉంచుకోవచ్చు. కొంతమంది రాఖీని 3, 7 లేదా 11 రోజుల వరకు చేతికి అలాగే ఉంచుకుని తీసేస్తారు. కొందరు కనీసం 24 గంటల రాఖీని చేతికి ఉంచుకుని మరుసటి రోజు తీసేస్తుంటారు.





















