అన్వేషించండి
Advertisement
MS Dhoni: ధోనికి ఇది చివరి ఐపీఎల్ కాదా !మరో సీజన్‌కు సిద్ధమేనా?
MS Dhonis IPL retirement prediction: ధోనీకిది చివరి ఐపీఎల్ కాదని టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Irfan Pathan Updates On MSD Retirement : మహేంద్రసింగ్ ధోనీ(Mahendra Singh Dhoni) కూల్ కెప్టెన్.. టీమిండియా(Team India)కు అత్యధిక ఐసీసీ ట్రోఫీ(ICC Trophies)లు అందించిన కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. అంతేనా ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL )లో చెన్నైసూపర్ కింగ్స్‌కు 5 టైటిళ్లు అందించి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. కెప్టెన్సీతో మ్యాజిక్ చేసి గెలవదు అనుకున్న ఎన్నో మ్యాచ్‌లను మలుపు తిప్పి గెలిచేలా చేయడంలో ధోనీ ప్రావీణ్యం అందరికీ తెలిసిందే. 40 ఏళ్ల వయసులోనూ గతేడాది చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలబెట్టి తాను ఎందుకు అంత విజయవంతమైన కెప్టెన్‌నో మరోసారి క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇక ధోనీ తన కెరీర్‌లో చివరి ఐపీఎల్‌కు కూడా సిద్ధమైపోయాడని ఊహాగానాలు చెలరేగాయి. అయితే ధోనీకిది చివరి ఐపీఎల్ కాదని టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇర్ఫాన్ ఏమన్నాడంటే..?
ఎంఎస్ ధోనికి కొన్నిరోజుల కిందట కలిశానని. పొడవాటి జుట్టు పెంచుతూ కెరీర్ తొలినాళ్లలతో ఉన్న ధోనిలా తయారవుతున్నాడని ధోనీ తెలిపాడు. 40 ఏళ్లు దాటినా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని... ఫ్రాంఛైజీ కోసం, అభిమానుల కోసం ఇంకొన్ని సీజన్లు ఆడేలా అతడు కనిపిస్తున్నాడని పఠాన్ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 2023 తరువాత ధోనీ ఐపీఎల్ నుంచి తప్పుకుంటారని ప్రచారం జరిగింది. గతేడాది టోర్నీ సమయంలో ధోనీ మోకాలి గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఐపీఎల్ 2024 టోర్నీలో ఎంఎస్ ధోనీ పాల్గొనడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ధోనీ ఫిట్ గా ఉన్నాడని, రాబోయే సీజన్ లో ఐదుసార్లు విజేతగా నిలిచిన సీఎస్కే జట్టుకు నాయకత్వం వహిస్తాడని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశాడు. ఇప్పుడు ధోనీ ప్రాక్టీస్ మొదలెట్టడంతో అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి.
కెప్టెన్సీ హితోపదేశం
టీమిండియా మాజీ సారధి, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) యువకులకు మరోసారి హితోపదేశం చేశాడు. కేవలం ఒక ఉన్నత పదవిలో ఉన్నంత మాత్రాన గౌరవం రాదని.. దాన్ని మన ప్రవర్తనతో సంపాదించుకోవాలని సూచించాడు. మాటలు చెప్పడం కంటే చేతల్లో చూపిస్తేనే సహచరుల నమ్మకం పొందగలమని దిశానిర్దేశం చేశాడు. డ్రెస్సింగ్ రూంలో సహచరులు, సహాయ సిబ్బందికి మన పట్ల గౌరవం లేకపోతే విధేయతతో ఉండరని ధోనీ కుండబద్దలు కొట్టాడు. కేవలం మాటలు చెబితే సరిపోదు. ఏదైనా చేతల్లోనే చూపించాలని స్పష్టం చేశాడు. మన కుర్చీ లేదా ర్యాంకు వల్ల గౌరవం వస్తుందని తాను భావించట్లేదని మహీ తెలిపాడు . గౌరవం దానంతట అదే రాదని దాన్ని మనమే సంపాదించుకోవాలని ధోని తెలిపాడు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ధోనీ ఈ వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ధోనీ కొత్త లోగో ఉన్న బ్యాట్‌తో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అది ఏ పెద్ద కంపెనీ లోగోనో కాదు. ఆ బ్యాటుపై ఉన్న స్టిక్కర్ ఏ కంపెనీది కాదు. ఆ స్టిక్కర్ మీద అతడి స్నేహితుడి షాపు పేరు రాసి ఉంది. బాల్యమిత్రుడికి సాయం చేయాలనే ఉద్దేశంతో ధోనీ తన ఫ్రెండ్ షాప్ పేరుతో ఉన్న స్టిక్కర్ అతికించిన బ్యాటుతో మహీ ప్రాక్టీస్ చేశాడు. ధోనీ చిన్నప్పటి స్నేహితుడికి ‘ప్రైమ్ స్పోర్ట్స్' అనే క్రీడా పరికరాల దుకాణం ఉంది. ఇందులో క్రికెట్ కిట్తో పాటు జెర్సీలు, ఇతర ఆట సామగ్రి లభిస్తాయి. దాంతో, తన మిత్రుడి దుకాణానికి మరింత పాపులారిటీ తేవడం కోసం ధోనీ.. ప్రైమ్ స్పోర్ట్స్ స్టిక్కర్ ఉన్న బ్యాటుతో ప్రాక్టీస్ చేశాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
గాడ్జెట్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion