Virat Kohli: కోహ్లీ ఉండే హోటల్ గదిలోకి అభిమానులు- అసహనం వ్యక్తం చేసిన విరాట్
Virat Kohli's Post: విరాట్ కోహ్లీ సోమవారం ఉదయం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఇతరుల గోప్యతను గౌరవించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.
Virat Kohli's Hotel Room: టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోమవారం ఉదయం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌లో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కనిపించాడు కోహ్లీ. తను లేనప్పుడు తన హోటల్ గదిని వీడియో తీసినందుకు విరాట్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఓ అభిమాని ఈ పని చేసినట్టు తెలుస్తోంది.
హోటల్ గదిలో విరాట్ లేనప్పుడు కొంతమంది అభిమానులు గదిలోకి ప్రవేశించారు. అక్కడ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో వైరల్ కావడంతో విరాట్ రియాక్ట్ అయ్యాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతోపాటు ఓ పోస్ట్ కూడా రాశాడు.
'అభిమానులు తమ అభిమాన ఆటగాడిని చూడటానికి ఎంత సంతోషిస్తారో తెలుసు.అతన్ని కలవడానికి ఎంత ఉత్సాహంగా ఉంటారో కూడా అర్థం చేసుకున్నాను' అని విరాట్ రాసుకొచ్చాడు. నేను దానికి ఆనందపడతాను. కానీ ఈ వీడియో చాలా భయానకంగా ఉంది. ఇది నా ప్రైవసీపై ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ నా హోటల్ రూమ్‌లోనే నాకు గోప్యత లేకపోతే... ఇక నాకు ప్రైవసీ ప్లేస్‌ను ఎక్కడ ఉంటుంది. నా ప్రైవసీ విషయంలో ఇలాంటివి చేయడం సరికాదు. దయచేసి ప్రజల గోప్యతను గౌరవించండి, దానిని వినోదంగా ఉపయోగించవద్దు.
View this post on Instagram
విరాట్ కోహ్లీ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెలబ్రిటీలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానం అదుపులో ఉంటేనే ఆనందంగా ఉంటుందని... లేకుంటే ప్రమాదకరంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, డేవిడ్ వార్నర్ వంటి లెజెండరీ ప్రముఖులు విరాట్ చేసిన ఈ పోస్ట్‌పై స్పందించారు.
Also Read: మా ఫీల్డింగ్ ఆశించిన స్థాయిలో లేదు - భారత కెప్టెన్ రోహిత్ శర్మ!