అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Aishwarya Rai: దిగజారిన అబ్దుల్‌ రజాక్‌, ఐశ్యర్యపై అనుచిత వ్యాఖ్యలు

ODI World Cup 2023: భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో సెమీస్ చేరకుండగానే పాకిస్థాన్‌ వెనుదిరిగింది. తన చివరి లీగ్‌ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయంతో స్వ దేశానికి పయనమైంది.

భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో సెమీస్ చేరకుండగానే పాకిస్థాన్‌(Pakistani) వెనుదిరిగింది. అఫ్ఘానిస్థాన్‌ (Afghanistan) చేతిలో పరాజయం పాలై నాకౌట్‌ అవకాశాలను దూరం చేసుకున్న దాయాది దేశం... తర్వాత పుంజుకున్నా ఫలితం లేకుండా పోయింది. తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌(England)తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయంతో పాకిస్థాన్‌ స్వ దేశానికి అవమాన భారంతో పయనమైంది. పాక్‌ ప్రదర్శనపై మాజీలు, క్రికెట్‌ అభిమానులు సహా అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ వరల్డ్‌కప్‌లో అత్యుత్తమమైన పేస్‌ దళంగా పేరొన్న పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్లు తేలిపోగా.. అత్యుత్తమ బ్యాటర్‌గా కొనియాడుతున్న కెప్టెన్‌ బాబర్‌ ఆజం కూడా పెద్దగా రాణించలేదు. పాక్ ఓటమికి ఆ దేశ క్రికెట్ బోర్డు కూడా కారణమన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు పాక్‌ బోర్డుపై విమర్శలు కూడా సంధిస్తున్నారు. అయితే పాక్‌ మాజీ ఆల్‌రౌండర్‌ అబ్దుల్‌ మాజక్‌(Abdul Razzaq) పాక్‌ బోర్డుపై విమర్శలు చేస్తూ శృతి తప్పాడు. బాలీవుడ్ నటి, కోట్లాది మంది అభిమానులకు రోల్‌ మోడల్‌ అయిన ఐశ్వర్యారాయ్‌(Aishwarya Rai)పై  రజాక్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్స్‌కు పక్కనే ఉన్న పాక్‌ మాజీ క్రికెటర్లు నవ్వడంపై  నెటిజన్లు ఒక స్థాయిలో మండిపడుతున్నారు. పాక్‌ మాజీ క్రికెటర్లను ఏకిపారేస్తున్నారు. ఇదేనా మీ సాంప్రదాయమంటూ  ఒక రేంజ్‌లో విమర్శలకు దిగుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

వన్డే ప్రపంచకప్ టోర్నీలో పాకిస్థాన్ ప్రదర్శనపై ఓ టీవీ చర్చా వేదికలో అబ్దుల్‌ రజాక్‌, షాహీద్‌ అఫ్రిదీ, ఉమర్‌ గుల్‌,యూనిస్‌ ఖాన్‌, సయీద్ అజ్మల్, షోయబ్‌ మాలిక్, కమ్రాన్‌ అక్మల్‌ పాల్గొన్నారు. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఉద్దేశం సరిగా లేదని వ్యాఖ్యానిస్తూ అబ్దుల్‌ రజాక్‌.. బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్‌ పేరును మధ్యలోకి తీసుకొచ్చాడు. క్రికెట్‌ను బాగు చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఏమాత్రం లేదన్న రజాక్‌ అలాంటప్పుడు మంచి ఫలితాలు ఎలా వస్తాయని విమర్శించాడు. అంతటితో ఆగకుండా తాను ఐశ్వర్యారాయ్‌ను పెళ్లి చేసుకోవడం వల్ల అందమైన పిల్లలు పుడతారని అనుకుంటే అది ఎప్పటికీ జరగదు కదా. ఇది కూడా అంతే అని... అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అబ్దుల్‌ రజాక్‌ చేసిన వ్యాఖ్యలకు  షాహిద్ అఫ్రిదీ, ఉమర్‌గుల్‌. నవ్వుతూ చప్పట్లు కొట్టారు. దీంతో భారత అభిమానులకు బాగా హర్ట్‌ అయ్యారు. సోషల్‌ మీడియా వేదికగా పాక్‌ మాజీ క్రికెటర్లకు గట్టిగా ఇచ్చి పడేశారు. 

అబ్దుల్ రజాక్‌ చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో నెటిజన్ల నుంచి ట్రోలింగ్‌ ఎదురైంది. ఇలా అనడానికి నీకు సిగ్గుండాలని ప్రారంభించిన నెటిజన్లు... అద్భుతమైన క్రికెటర్‌ అయి ఉండి ఇలాంటి థర్డ్‌క్లాస్‌ వ్యాఖ్యలు చేస్తావా అంటూ మండిపడుతున్నారు. షాహిద్‌ అఫ్రిది సిగ్గులేకుండా నవ్వడం మహిళలకు ఇచ్చే గౌరవమా అని నిలదీస్తున్నారు. ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేయడం వల్ల సోషల్ మీడియాలో పేరు వస్తుందని రజాక్‌ భావించి ఉంటాడని మరొకరు కామెంట్‌ చేశారు.  నీ పరువు నువ్వే తీసుకున్నావు’ అంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా..? రజాక్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం.. పక్కనే ఉన్న అఫ్రిదీ సహా ఇతర మాజీ ఆటగాళ్లు సిగ్గులేకుండా నవ్వడం పై ఇలా నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget