Ind Vs Eng 3rd Toss Update: ఇండియా బౌలింగ్.. మళ్లీ టాస్ ఓడిన గిల్.. ఇరుజట్లలో ఒక మార్పు.. బుమ్రా, ఆర్చర్ ఇన్..
ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలవడంతో మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో ఆధిపత్యం కొనసాగించాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో తొలుత ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేయనుంది.

Jasprit bumrah Re entry: ఇంగ్లాండ్ తో లార్డ్స్ తో జరిగిన మూడో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బౌలింగ్ చేయనుంది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే ఇరుజట్లు చెరో మ్యాచ్ ను గెలవడంతో 1-1తో సిరీస్ సమంగా నిలిచింది. ఈ మ్యాచ్ లో భారత్ ఒక మార్పు చేసింది. స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా జట్టులోకి రాగా, ప్రసిధ్ క్రిష్ణపై వేటు పడింది. మరోవైపు ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే తుది జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్ ఒక మార్పు చేసింది. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ జట్టులోకి వచ్చాడు. జోష్ టంగ్ స్థానంలో అతను బరిలోకి దిగుతున్నాడు. ఈ మ్యాచ్ లో పేసర్లకు అనుకూలించే వికెట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Jofra Archer's return headlines England's team to take on India at Lord's 📝
— ICC (@ICC) July 10, 2025
More from #ENGvIND 📲 https://t.co/HJkPWxaZgH#WTC27 pic.twitter.com/EREqou1kdP
🚨 Toss and Team Update 🚨
— BCCI (@BCCI) July 10, 2025
England win the toss and elect to bat in the 3rd Test.
Jasprit Bumrah is back in the eleven 🙌
Updates ▶️ https://t.co/X4xIDiSmBg#TeamIndia | #ENGvIND pic.twitter.com/uulWRWPOaU
కొంచెం కన్ఫ్యూజన్..
మరోవైపు టాస్ సందర్భంగా గిల్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే ఏం చేయాలో కొంచెం కన్యూజింగ్ గా ఉందని పేర్కొన్నాడు. అయితే పిచ్ పరిస్థితిని బట్టి, తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించానని, వికెట్ అందుకు కరెక్టుగా ఉందని పేర్కొన్నాడు. ముఖ్యంగా తొలి సెషన్ లో బౌలర్లకు ఈ వికెట్ నుంచి అద్భుతమైన మద్దతు లభిస్తుందని పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా తుది జట్టులోకి వస్తున్నాడని, మరో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కు రెస్ట్ ఇచ్చామని పేర్కొన్నాడు. ఇక రెండో టెస్టులో బౌన్స్ బ్యాక్ అయి, అద్భుత విజయం సాధించిన టీమిండియా, అదే జోరును ఈ టెస్టులో కొనసాగించాలని భావిస్తోంది.
పుంజుకుంటాం..
ఈ మ్యాచ్ కు బాగా సిద్ధమయ్యామని, ఇక్కడ గెలిచి సిరీస్ లో 2-1 ఆధిక్యం సంపాదిస్తామని స్టోక్స్ ధీమా వ్యక్తం చేశాడు. రెండో టెస్టు తర్వాత లభించిన విరామంతో జట్టులో సానుకూల వాతావరణం నెలకొందని, ఈ మ్యాచ్ కు అది హెల్ప్ కావద్దని పేర్కొన్నాడు. ఈ టెస్టు సిరీస్ లో తమ జట్టు అద్భుత పోరాట పటిమను ప్రదర్శించామని, రాబోయే మ్యాచ్ ల్లో దీన్ని కొనసాగిస్తామని పేర్కొన్నాడు.
ఇండియా ప్లేయింగ్ లెవన్: శుభమాన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), నితీశ్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.
ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవన్: బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ డకెట్, జాక్ క్రాలీ, ఒల్లీ పోప్, జో రూట్, హేరీ బ్రూక్, జేమీ స్మిత్,క్రిస్ వోక్స్, బ్రైడెన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.




















