భారత్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం జట్టు ప్రకటించిన ఇంగ్లండ్- 15 మంది ఆటగాళ్ల టీం ఇదే!
England VS India: భారత్-ఇంగ్లండ్ మహిళల మధ్య 3 వన్డేల సిరీస్ జులై 16, 19, 22 తేదీల్లో జరగనుంది. దీని కోసం ఇంగ్లీష్ టీం జట్టును ప్రకటించింది.

England announces women ODI squad for India series: ఒకవైపు భారత పురుషుల క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌తో హోరాహోరీగా తలపడుతోంది. ఇప్పుడు మహిళా క్రికెట్ జట్టు కూడా పోటీ పడేందుకు సిద్ధమైంది. వన్డే మ్యాచ్ ఆడేందుకు రెడీ అవుతుంది. దీనికి సంబంధించిన ఇండియాతో తలపడేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. ఇందులో టీమ్ ఇండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు భారత్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఇంగ్లండ్ ప్రకటించింది.
భారత్, ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్ల మధ్య జులై 16 నుంచి 3 వన్డేల సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్‌లు జులై 16, జులై 19, జులై 22 తేదీల్లో జరగనున్నాయి. సోఫీ ఎక్లెస్టోన్, మైయా బౌషర్‌ను భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఇంగ్లాండ్ 15 మంది సభ్యుల మహిళల జట్టులో చోటు కల్పించారు.
భారత్, ఇంగ్లండ్ మహిళా జట్ల మధ్య మూడు వన్డేలు వరుసగా జూలై 16, 19, 22 తేదీల్లో సౌతాంప్టన్, లార్డ్స్, చెస్టర్-లే-స్ట్రీట్‌లో జరగనున్నాయి. ప్రస్తుతం రెండు జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది, ఇందులో మొదటి రెండు మ్యాచ్‌లను భారత్ గెలుచుకోగా, మూడో టీ20ని ఇంగ్లండ్ గెలుచుకుంది. ఇప్పుడు జgలై 9న నాల్గో టీ20, జులై 12న ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది.
సీనియర్ క్రీడాకారిణి సోఫీ ఎక్లెస్టోన్ వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌కు దూరమైన తర్వాత వన్డే జట్టులోకి తిరిగి వచ్చింది, అయితే బౌషర్‌ను గాయపడిన నాట్ సివర్-బ్రంట్ స్థానంలో టీ20 సిరీస్‌కు జట్టులోకి తీసుకున్న తర్వాత వన్డే జట్టులో కూడా చేర్చారు. నడుము గాయం కారణంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మూడు టీ20 మ్యాచ్‌లకు దూరమైన కెప్టెన్ సివర్-బ్రంట్ వన్డే సిరీస్‌కు ఫిట్‌గా వస్తారని భావిస్తున్నారు.
భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఇంగ్లాండ్ 15 మంది సభ్యుల మహిళల జట్టు- నాట్ సివర్-బ్రంట్ (కెప్టెన్), ఎం అర్లట్, సోఫియా డంక్లే, ఎమ్మా లాంబ్, టామీ బ్యూమాంట్ (వికెట్ కీపర్), ఎమీ జోన్స్ (వికెట్ కీపర్), మైయా బౌషర్, ఎలిస్ కాప్సీ, కేట్ క్రాస్, ఎలిస్ డేవిడ్‌సన్ రిచర్డ్స్, చార్లీ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, లిన్సీ స్మిత్, లారెన్ బెల్.




















