అన్వేషించండి

T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్‌ 2024పై రియాన్‌ పరాగ్‌ షాకింగ్ కామెంట్స్, ఏమన్నాడంటే!

Riyan Parag: జాతీయ జట్టులో స్థానం దక్కకపోవటం రియాన్‌ పరాగ్‌ ను తీవ్ర అసంతృప్తిని కలిగించి ఉంటుందన్న విషయం ఊహించినదే . అయితే ఈ క్రమంలో అతను చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Riyan Parag Says I Dont Want To Watch The T20 World Cup 2024:  ఐపీఎల్(IPL) 16 వ సీజన్ లో  పేలవమైన  ప్రదర్శనతో  విమర్శ పాలైన రియాన్ పరాగ్(Riyan Parag) ఈ సారి ఆ కసితో ఆడాడో లేకుంటే ప్రాక్టీస్ పై దృష్టి పెట్టి టాలెంట్‌ను చూపించాడో తెలియదు కానీ ఐపీఎల్‌ 2024లో దుమ్ములేపాడు.  అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడు వరల్డ్‌ కప్‌(T20 World Cup) టీం లో చోటు సంపాదిస్తాడనే చర్చ కూడా జరిగింది. కానీ, బీసీసీఐ(BCCI) సెలక్టర్లు మాత్రం అతడిని ఎంపిక చేయలేదు. దీంతో రియాన్ బాగా హర్ట్ అయ్యాడు. తాజాగా ఈ విషయంపై స్పందించాడు యంగ్ క్రికెటర్. 

ఏం జరుగుతుందనే ఆసక్తి ఉండేది.. 
తాను జట్టులో ఉండుంటే ప్రపంచ కప్‌ 2024లో ఏం జరుగుతుందనే ఆసక్తి, ఒత్తిడి ఉండేది. కానీ, తాను టీమ్‌లో లేడు కాబట్టి తనకు  దానిపై పెద్దగా ఆసక్తి లేదన్నాడు. అలాగే  టాప్-4లో ఎవరుంటారని కూడా ఆలోచించడం లేదన్నాడు . చివరికి టైటిల్ సాధించింది ఎవరో మాత్రం తెలుసుకుని సంతోషపడతానన్నాడు. జట్టులో లేకపోవడం వల్ల తాను ప్రపంచకప్ గురించి ఎలాంటి ఆలోచనలూ చేయనన్నాడు  పరాగ్ .  అయితే టీంలో విరాట్ కోహ్లీ(Kohli)  చూపించే జోష్‌ను ఎవరూ అందుకోలేరన్నాడు. గతంలో కూడా రియాన్ ఒకసారి ఇలాంటి వ్యాఖ్యలే చేసి వార్తల్లో నిలిచాడు. ఏదో ఒక సమయంలో  తనను  జాతీయ జట్టులోకి తీసుకోక తప్పని పరిస్థితి వస్తుందని,  అప్పుడు తప్పకుండా టీమిండియా తరఫున ఆడతానన్నాడు. అయితే ఆ సమయం ఎప్పుడనేది తానుకూడా  చెప్పలేనన్నాడు. కానీ తాను  అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే టైమ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది అంటూ చేసిన వ్యాఖ్యలు గతంలో వైరల్ అయ్యాయి. 

హాట్ వీడియోల సెర్చింగ్‌..

ఇక తాజాగా  ఆన్‌లైన్ గేమింగ్ లైవ్ స్ట్రీమింగ్ సెషన్‌లో పాల్గొన్న పరాగ్ తన యూట్యూబ్ హిస్టరీని చేజెటులా  లీక్ చేసుకుని విమర్శలపాలయ్యాడు. స్ట్రీమింగ్ సందర్భంగా   ఇష్టమైన పాట ఏది అని యూట్యూబ్ సెర్చ్‌లోకి వెళ్లాడు. ఆ సెర్చ్ హిస్టరీ చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. స్టార్ హీరోయన్ల హాట్ వీడియోలు వెతికిన తన యూట్యూబ్ హిస్టరీ ప్రత్యక్షమైంది. ఆ హిస్టరీలో సారా అలీఖాన్ హాట్, అనన్య పాండ్య హాట్‌ అని సెర్చ్ చేసిన విషయాన్ని గుర్తించిన నెటిజన్లు దొరికింది ఛాన్స్ అన్నట్టు  ట్రోల్స్‌ చేసిపడేసారు. 

ఐపిఎల్ లో అదరగొట్టిన రియాన్..

ఐపీఎల్‌ 2024లో రాజస్థాన్ రాయల్స్‌(RR) ఫ్రాంచైజీ తరఫున బరిలో దిగిన రియాన్‌ పరాగ్‌ తన బ్యాటింగ్ ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశాడు. 15 మ్యాచ్‌లు ఆడిన రియాన్ పరాగ్‌ నాలుగు హాఫ్‌ సెంచరీలు చేశాడు. టోర్నీ మొత్తంలో 573 పరుగులు చేసి ది బెస్ట్ అనిపించుకున్నాడు. అతను ఆడిన ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్‌ను ప్లేఆఫ్ వరకు తీసుకొచ్చాడు.  22 ఏళ్ల ఈ అసోం కుర్రాడు ఈ ఐపీఎల్‌లో 150 స్ట్రైక్ రేట్‌తో 573 పరుగులు చేసి మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో కోహ్లి , రుతురాజ్ గైక్వాడ్ తర్వాత మూడో స్థానంలో నిలిచాడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Kakinada Pawan Kalyan: కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
Lagacharla Land Acquisition:: లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మురళి కృష్ణుడి అలంకారంలో  శ్రీప‌ద్మావ‌తి అమ్మవారునర్సుపై కొడవలితో దాడి, లవర్ పనే..! సీసీటీవీ వీడియోఊరి మీద విరుచుకుపడి ప్రాణాలు తీసేసిన పెద్దపులిISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Kakinada Pawan Kalyan: కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
Lagacharla Land Acquisition:: లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Tiger Attack Komaram Bheem Asifabad District News: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
Crime News: బాలున్ని కట్టేసి గొంతు కోసి చంపేశారు - మేనమామే కాలయముడు, సత్యసాయి జిల్లాలో ఘోరం
బాలున్ని కట్టేసి గొంతు కోసి చంపేశారు - మేనమామే కాలయముడు, సత్యసాయి జిల్లాలో ఘోరం
Dragon Movie - NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడో తెలుసా?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడో తెలుసా?
Amazon Black Friday Sale 2024: ఇండియాలో అమెజాన్ మొట్టమొదటి బ్లాక్ ఫ్రైడే సేల్ - స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు!
ఇండియాలో అమెజాన్ మొట్టమొదటి బ్లాక్ ఫ్రైడే సేల్ - స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు!
Embed widget