Koneru Humpy: కోనేరు హంపి విజయం తెలుగు జాతికి గర్వకారణం - శాప్ ఛైర్మన్ రవి నాయుడు
SAAP chairman Ravi Naidu | వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ రవి నాయుడును భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె విజయం తెలుగు జాతికి గర్వకారణం అన్నారు.
World Rapid Chess champion Koneru Humpy | విజయవాడ: వరల్డ్ చెస్ ఛాంపియన్, భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపిని శాప్ ఛైర్మన్ రవినాయుడు అభినందించారు. ప్రపంచ మహిళా చెస్ విజేత కోనేరు హంపికి విజయవాడలోని కార్యాలయంలో శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, స్పోర్ట్స్ అథారిటీ సిబ్బంది, క్రీడాకారులు ఘనస్వాగతం పలికారు. కోనేరు హంపి విజయం తెలుగుజాతికి గర్వకారణం అన్నారు.
శాప్ ఛైర్మన్ ఏపీ స్పోర్ట్స్ పాలసీని హంపికి వివరించారు. శాప్ నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఛైర్మన్ వెల్లడించారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి విలువైన సూచనలు, సలహాలివ్వాలని కోనేరు హంపిని శాప్ ఛైర్మన్ కోరారు. ఇదివరకే ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ఆమె త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబును కలుస్తానని తెలిపారు. ఇటీవల జరిగిన వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ టైటిల్ సాధించారు కోనేరు హంపి. గతంలోనూ ఆమె ఈ ర్యాపిడ్ చెస్ ఛాపింయన్‌గా నిలిచారు.
తెలుగుతేజం సరికొత్త చరిత్ర
భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అరుదైన ఘనత సాధించారు. ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన టోర్నీలో కోనేరు హంపి ఛాంపియన్‌గా నిలిచారు. ర్యాపిడ్ చెస్ టోర్నీలో8.5 పాయింట్లతో కోనేరు హంపి అగ్రస్థానంలో నిలిచి ఛాంపియన్ అయ్యారు. వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ టైటిల్ కోనేరు హంపి రెండుసార్లు నెగ్గారు. 2019లో తొలిసారి టైటిల్ సాధించి తెలుగు వారితో పాటు యావత్ దేశం ఆమె విజయాన్ని ఆస్వాదించారు. కాగా, చైనాకు గ్రాండ్ మాస్టర్ జు వెంజున్ తరువాత ఒకటి కంటే ఎక్కువసార్లు ర్యాపిడ్ చెస్ చాంపియన్‌గా నిలిచి హంపి అరుదైన ఘనత సాధించారు. ఈ టోర్నీలో మరో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక టాప్ 5గా నిలిచారు. కాగా, గత ఏడాది సెప్టెంబర్ లో జరిగిన చెస్ ఒలంపియాడ్‌లో భారత మహిళలు స్వర్ణం సాధించారు. ఆ జట్టులో ద్రోణవల్లి హారిక కీలకపాత్ర పోషించారు.
Also Read: World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత