Champions Trophy 2025: రాకపోతే నష్ట పరిహారం ఇవ్వాలి, వేడుకుంటున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
Champions Trophy 2025: 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులకు సంబంధించిన అగ్రీమెంట్ తమతోనే చేసుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. ఐసీసీని కోరింది.
![Champions Trophy 2025: రాకపోతే నష్ట పరిహారం ఇవ్వాలి, వేడుకుంటున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు Champions Trophy 2025 Pakistan Cricket Board urges ICC to sign hosting rights agreements Champions Trophy 2025: రాకపోతే నష్ట పరిహారం ఇవ్వాలి, వేడుకుంటున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/27/40c4c2bd5804f909fe1a3e14124fb5ef1701074246912872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు అసలు జరగడమే లేదు. సరిహద్దుల్లో దాయాది దేశం అవలంభిస్తున్న శాంతి వ్యతిరేక విధానాలతో భారత్.. పాక్‌తో సిరీస్‌లు ఆడడం లేదు. ఐసీసీ టోర్నీల్లో తటస్థ వేదికలపై మాత్రమే టీమిండియా.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడుతోంది. ఐసీసీ ఈవెంట్‌లు జరిగినా భారత్.. పాకిస్థాన్ పర్యటనకు వెళ్లడం లేదు. అయితే 2025లో జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరగనుంది. ఈ మెగా టోర్నీకి భారత్ హాజరు కావడంపై నీలినీడలు కమ్ముకున్నాయి, భారత్ రాకపోతే ఛాంపియన్స్ ట్రోఫీపై పెను ప్రభావం పడనుంది. దీంతో పాకిస్థాన్ అప్రమత్తమైంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులకు సంబంధించిన అగ్రీమెంట్ తమతోనే చేసుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. ఐసీసీని కోరింది. ఒక వేళ భద్రత, రాజకీయ కారణాలు చెప్పి పాక్‌లో పర్యటించేందుకు టీమిండియా నిరాకరిస్తే అందుకు తమకు పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేసింది.
పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు ఐసీసీ అంగీకరించినా దానికి సంబంధించిన అగ్రిమెంట్‌పై సంతకం చేయలేదని తెలుస్తోంది. మరోవైపు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్‌లో నిర్వహించడంపై చర్చించేందుకు ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డుతో పీసీబీ ఛైర్మన్ జకా అష్రఫ్, సిఓఓ సల్మాన్ నసీర్ సమావేశమయ్యారు. ఒకవేళ భారత జట్టు పాక్ పర్యటనకు వెళ్లకపోతే వచ్చే పర్యావసానాలపైనా వీరు చర్చించారు. ఏ పరిస్థితిలోనైనా ఐసీసీ.. టోర్నమెంట్‌పై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదని పీసీబీ స్పష్టం చేసింది. భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత్ నిరాకరిస్తే.. స్వతంత్ర భద్రతా ఏజెన్సీని నియమించాలని పీసీబీ అధికారులు ఐసీసీకి తెలిపారు. గత రెండేళ్లలో ఎలాంటి భద్రతా పరమైన సమస్యలు లేకుండానే అనేక అగ్రశ్రేణి జట్లు పాకిస్థాన్‌లో పర్యటించాయని పీసీబీ గుర్తు చేస్తోంది.
పాక్‌లో టీమ్ఇండియా పర్యటనపై భారత ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ అధికారి తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో ఆసియాకప్‌లో భాగంగా కొన్ని మ్యాచ్‌లు పాక్‌లో ఉండగా అక్కడికి వెళ్లేందుకు భారత్ నిరాకరించిన విషయాన్ని కూడా ఆ అధికారి గుర్తు చేస్తున్నారు. భద్రత, రాజకీయ కారణాల వల్ల పాక్‌లో ఆడకుండా భారత్ మళ్లీ వెనక్కి తగ్గే అవకాశం ఎక్కువగా ఉందని పీసీబీ అధికారులు స్పష్టంగా భావిస్తున్నారు.
భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో సెమీస్ కూడా చేరకుండా వెనుదిరిగిన పాకిస్థాన్‌పై క్రికెట్ విశ్లేషకులు విమర్శనాస్త్రాలు సంధించారు. మాజీ క్రికెటర్లు, పాక్ అభిమానులు పాక్ క్రికెటర్లపై తీవ్ర విమర్శలు చేశారురు. ఈ మహా సంగ్రామంలో ప్రపంచ నెంబర్ 2 ర్యాంక్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ఘోరంగా విఫలమయ్యాడు. ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. పాకిస్థాన్ జట్టులో ఆత్మ విశ్వాసం నింపడంలో కూడా బాబర్ విఫలమయ్యాడని మాజీలు తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో బాబర్ ఆజమ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. అయితే, మూడు ఫార్మాట్లలోనూ ప్లేయర్‌గా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశాడు. ప్రపంచకప్‌లో పాక్ వైఫల్యం తర్వాత పాక్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ ఆజమ్‌ను తప్పిస్తారని ఊహగానాలు చెలరేగాయి. అయితే పాక్ కెప్టెన్సీ భాద్యతల నుంచి ఆ దేశ క్రికెట్ బోర్డు తప్పించేలోపే బాబర్ ఆజమే తానే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)