అన్వేషించండి

Rohit Sharma: హిట్‌మ్యాన్‌ మరో ఘనత, పాఠ్యాంశంగా రోహిత్‌ సెంచరీ

Rohit Sharma: భారత జట్టు సారధి రోహిత్‌ శర్మఅరుదైన గౌరవం పొందాడు. తమిళనాడు 11వ తరగతి మ్యాథ్స్‌ సిలబస్‌లో హిట్‌మ్యాన్‌ శతకానికి చోటు దక్కింది.

Rohit Sharma featured in the 11th Class Maths Text book: భారత జట్టు సారధి రోహిత్‌ శర్మ(Rohit Sharma)కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు 11వ తరగతి మ్యాథ్స్‌ సిలబస్‌లో హిట్‌మ్యాన్‌ శతకానికి చోటు దక్కింది. టీ 20ల్లో 35 బంతుల్లో శతకాన్ని సాధించిన హిట్‌మ్యాన్‌ ఊచకోతను పాఠ్యాంశంగా పొందుపరిచారు. రోహిత్‌ శతకాన్ని ఉదాహరణగా తీసుకుని గణిత శాస్త్రంలోని ఫంక్షన్స్‌ అండ్‌ రిలేషన్స్‌ కాన్సెప్ట్‌పై పలు ప్రశ్నలు అడిగారు. పాఠ్యాంశంగా మారిన రోహిత్‌ టీ20 సెంచరీ 2017 డిసెంబర్‌లో చేసింది. ఇండోర్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన నాటి మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ 35 బంతుల్లో 10 ఫోర్, 12 సిక్సర్ల సాయంతో సెంచరీ చేశాడు. కొద్ది నెలల కిందటి వరకు ఇది అంతర్జాతీయ టీ20ల్లో జాయింట్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీగా చలామణి అయ్యింది.

ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఈటన్‌
నమీబియా నయా సంచలనం నికోల్‌ లోఫ్టీ ఈటన్‌ విధ్వంసం సృష్టించాడు. బ్యాట్‌తో బౌలర్లను ఊచకోత కోశాడు. అదేదో బంతిపై పగబట్టినట్లు చెలరేగిపోయాడు.ఈ విధ్వంసంతో పలు రికార్డులు కాలగర్భంలో కలిసిపోయాయి. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్‌గా ఈటన్‌ అవతరించాడు. నేపాల్‌ వేదికగా నేపాల్‌, నమీబియా, నెదర్లాండ్స్‌ మధ్య ట్రై సిరీస్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా నేపాల్‌, నమీబియా మధ్య తొలి టీ20 మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో నమీబియా బ్యాటర్‌ ఈటన్‌ కేవలం 33 బంతుల్లోనే శతకం సాధించాడు. 11 ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన ఈటన్‌ 11 ఫోర్లు, 8 సిక్సులతో సెంచరీ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. నికోల్ ధనాధన్‌ బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో నమీబియా విజయం సాధించింది. పొట్టి క్రికెట్‌లో నికొల్‌కు మంచి రికార్డు ఉంది. సుడిగాలి ఇన్నింగ్స్‌ల‌తో విరుచుకుప‌డే ఈ లెఫ్ట్ హ్యాండ‌ర్ ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క హాఫ్ సెంచ‌రీ బాద‌లేదు.
టీ20ల్లో వేగవంతమైన సెంచరీలు..
జాన్‌ నికోల్‌ (నమీబియా) - 33 బంతులు
కుశాల్‌ మల్లా (నేపాల్‌) - 34 బంతులు
డేవిడ్‌ మిల్లర్‌ (దక్షిణాఫ్రికా) - 35 బంతులు
రోహిత్‌ శర్మ (భారత్‌) - 35 బంతులు
సుదేశ్ విక్రమశేఖర (చెక్‌ రిపబ్లిక్‌) - 35 బంతులు

ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా 22 ఏళ్ల జాన్ నికోల్ లాఫ్టీ విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో జాన్ నికోల్ లాఫ్టీ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. జాన్ నికోల్ లాఫ్టీ క్రీజులోకి వచ్చే సమయానికి నమీబియా స్కోర్ 10.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 62గా మాత్రమే ఉంది. కానీ ఆ తర్వాత జాన్ నికోల్ లాఫ్టీ విధ్వంసంతో 200 దాటింది. మొత్తంగా 36 బంతులు ఎదుర్కొన్న జాన్ నికోల్ లాఫ్టీ 101 పరుగులు చేసి చివరి ఓవర్‌లో ఔటయ్యాడు. ఓపెనర్ మలన్ క్రుగర్ 48 బంతుల్లో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం నేపాల్ జట్టు 18.5 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో నేపాల్‌పై నమీబియా 20 పరుగుల తేడాతో గెలిచింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Embed widget