Boycott IPL Twitter Trending : ట్విట్టర్ లో నెంబర్ వన్ గా ట్రెండ్ అవుతున్న బాయ్ కాట్ ఐపీఎల్
ఐపీఎల్. ఇండియన్ క్రికెట్ ఫేజ్ ను మార్చేసిన ఓ కంప్లీట్ కమర్షియల్ క్రికెటింగ్ ఫార్మాట్. మరిప్పుడు ఎందుకు క్రికెట్ ఫ్యాన్స్ బాయ్ కాట్ ఐపీఎల్ అంటున్నారు. ఎందుకు అంటున్నారో క్లియర్ గా మాట్లాడుకుందాం
ఐపీఎల్. ఇండియన్ క్రికెట్ ఫేజ్ ను మార్చేసిన ఓ కంప్లీట్ కమర్షియల్ క్రికెటింగ్ ఫార్మాట్. ఐపీఎల్ ట్యాగ్ కూడా... యత్ర ప్రతిభా అవసర ప్రాప్ నోతిహి: అంటే Where Talent meets Opportunity. ఎక్కడ ప్రతిభ, అవకాశం కలుసుకుంటాయో అలాంటి ప్లాట్ ఫామ్ ఐపీఎల్ అని అర్థం. మరిప్పుడు ఎందుకు క్రికెట్ ఫ్యాన్స్ బాయ్ కాట్ ఐపీఎల్ అంటున్నారు. ఎందుకు అంటున్నారో క్లియర్ గా మాట్లాడుకుందాం
1.ఫాస్ట్ ట్రాక్ సెలక్షన్
ఐపీఎల్ ఈ దీనికి అడ్డా. ఇంతకు ముందు టీమిండియాలోకి రావాలంటే రంజీలు, దులీప్ లు, విజయ్ హజారేలు అబ్బో చాలా చోట్ల ప్రూవ్ చేసుకుంటే కానీ జట్టులోకి వచ్చేవాళ్లు కాదు. ఇప్పుడదంతా అవసరం లేదు ఐపీఎలో హిట్టయ్యావా టీమిండియా డోర్ నీకు ఓపెన్ అవుతుంది. అవకాశాలివ్వటం...ప్రతిభాన్వేషణ కోసం ఐపీఎల్ ను ఓ ప్లాట్ ఫాం గా మార్చటం చాలా మంచి విషయమే. కానీ కేవలం ఐపీఎల్ ప్రదర్శనలే ప్రామాణికంగా తీసుకోవటం ఎంతవరకూ కరెక్ట్ అనేదే ప్రశ్న. పోనీ ఎంత మంది ప్లేయర్లు వస్తున్నారు. నువ్వు లెక్కపెట్టుకోలేనంత. 2019 నుంచి ఐపీఎల్ ద్వారా టీమిండియాలో కి వచ్చిన ప్లేయర్లు 20 మందికి పైగా ఉన్నారు. సరే కొత్త నీరు రావటం, టీమిండియా రిజర్వ్ బెంచ్ బల పడటం మంచి విషయమే. మరి వచ్చిన వాళ్లు ఎంత మంది కన్సిస్టెంట్ గా టీమిండియాకు ఆడుతున్నారు. ఉదాహరణ కోసం కొన్ని మాట్లాడుకుందాం. ఐపీఎల్ లో సన్ రైజర్స్ కు అదిరే ఫర్ ఫార్మెన్స్ చేస్తున్నాడని ఉమ్రాన్ మాలిక్ ను టీమిండియాలోకి తీసుకున్నారు. ఇంగ్లండ్ లో రెండు మ్యాచ్ లు ఆడించారు. ఇక అంతే ఖేల్ ఖతం దుకాణ్ బంద్. మిస్టరీ స్పిన్నర్ ట్యాగ్ లైన్ ఇచ్చి మరీ వరుణ్ చక్రవర్తి ని తీసుకున్నారు. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు. ఇలా ఐపీఎల్ ను బేస్ చేసుకుని ఫాస్ట్ ట్రాక్ సెలక్షన్ చేయటం...ఇంటర్నేషనల్ క్రికెట్ లో రెండు మ్యాచ్ లు ఆడినా..ఆడకున్నా పక్కన పెట్టడం. ఇలా చేయటం వల్ల ఆ ప్లేయర్ కి ఎలాంటి భరోసా ఇస్తున్నట్లు.. ఇంకా మానసికంగా కాన్సిఫడెన్స్ కిల్ చేయటం తప్ప.
2. బ్యాకప్ ప్లేయర్లు ఎంత మంది రెడీగా ఉంటున్నారు
2019 నుంచి ఇరవై మంది కొత్త ప్లేయర్లు వచ్చారు అనుకున్నాం కదా. నవదీప్ సైనీ, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, ఉమ్రాన్ మాలిక్, వెంకటేష్ అయ్యర్ ఇలా చెప్పుకుంటూ చాలా మందే వచ్చారు. వీళ్లలో శివమ్ దూబే, వెంకటేష్ అయ్యర్ ను పేస్ ఆల్ రౌండర్ బ్యాకప్ కోసం అనుకున్నారు. మరి వాళ్లకు అవకాశాలేవి. మీరొకటి గమనించండి 2008 నుంచి ఐపీఎల్ జరుగతుంది. టీమ్ కి పనికొచ్చే పేస్ ఆల్ రౌండర్ లో ఇన్నాళ్ల దొరికింది ఎంత మంది అంటే ఒక్కడు... హార్దిక్ పాండ్యా. మిగిలిన వాళ్లంతా రెండు మూడురోజుల మెరుపులే. ఇంత పెద్ద ఐపీఎల్ వ్యవస్థ పెట్టుకుని... అన్ని వందల మంది ప్లేయర్లకు అవకాశాలిస్తూ ఒక్క పేస్ ఆల్ రౌండర్ ను పట్టుకోలేకపోయామా మనం.
3. ప్లేయర్ల మెంటాలిటీ గురించి మాట్లాడుకోవాలి
ఐపీఎల్ ఎంత కమర్షియల్ గా తయారైంది అంటే. ఫ్రీ ఫ్లో ఆఫ్ మనీ. ఐపీఎల్ అంటే చాలు ఆక్షన్లు. కోట్లాది రూపాయల బేస్ ప్రైస్ లు...వేలంపాటలో కోట్లకు కోట్లు పోసి కొనుక్కుంటున్నారు. వాళ్లు ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నారు. టీమిండియా అంటే రెస్ట్ అంటున్నారు. డబ్బుకు లోకం దాసోహం. టీమిండియా లో ఛాన్స్ లేకపోయినా పర్లేదు ఐపీఎల్ ఆడుకుంటే చాలు అనే మెంటాలిటీ ఇప్పుడు టీమ్ లో ఉన్న ప్లేయర్లలో కూడా కనిపిస్తుంది. పేర్లు చెప్పటం అప్రస్తుతం కానీ కొంత మంది ప్లేయర్లను గమనించండి. వాళ్లు ఐపీఎల్ అంటేనే ఆడతారు.
ఇప్పుడు ఇదంతా చాలదన్నట్లు మాజీ కోచ్ , కామేంటేటర్ రవిశాస్త్రి మొన్నా మధ్య ఓ మాట అన్నారు. ఇయర్ లో రెండు ఐపీఎల్ లు ప్లాన్ చేయాలి అని. ఈ మాట బీసీసీఐ ఓ లీక్ లా రవిశాస్త్రి తో చెప్పించింది అనే టాక్ కూడా నడుస్తోంది . ఇప్పటికే ఒక్క ఐపీఎల్ ఆడి...ఇంత కన్ఫ్యూషన్ క్రియేట్ చేసుకుంటున్న టీమిండియా.. ఇక రెండంటే పరిస్థితి అర్థం చేసుకోండి. కొత్త అవకాశాలు ఇవ్వకూడదు...ప్రయోగాలు చేయకూడదు అని అనటం లేదు. కానీ ఎప్పుడు చేయాలి..ఎలా చేయాలి అనేది ఓ క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ మంత్ వరల్డ్ కప్ పెట్టుకుని ఇప్పటికీ టాప్ 15 ఎవరనే క్లారిటీ..వాళ్ల రోల్స్ ఏంటీ అనే కన్ఫర్మేషన్ ప్లేయర్లకు కూడా ఇవ్వకపోతే వాళ్లకేం బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఆసియా కప్ లో సూపర్ ఫోర్ మ్యాచ్ లు ఇండియా రెండు ఓడిపోగానే...ట్విట్టర్ లో బాయ్ కాట్ ఐపీఎల్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. అవకాశాలిచ్చేందుకు పెట్టిన ఐపీఎల్ కాస్తా స్వార్థపూరిత మార్కెట్ ప్రయోజనాలకు వేదికగా మారిపోయి...నిజమైన ప్రతిభావంతులైన క్రికెటర్లకు అన్యాయం చేస్తూ వాళ్ల కెరీర్లను సందిగ్ధంలో పడేస్తుందనే వాదనను ఫ్యాన్స్ వినిపిస్తున్నారు.