News
News
X

IND vs AUS 1st Test: 'తొలిరోజు నుంచే బంతి స్పిన్ అయ్యే పిచ్ కావాలి- తుది జట్టులో ఎవరుండాలంటే!'

మరొక్క రోజులో భారత్- ఆస్ట్రేలియా మధ్య 4 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుంది. రేపు నాగ్ పుర్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. దీనికోసం భారత మాజీ కోచ్ రవిశాస్త్రి తన తుది జట్టును ప్రకటించారు

FOLLOW US: 
Share:

IND vs AUS 1st Test:  బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి సమయం వచ్చేసింది. మరొక్క రోజులో భారత్- ఆస్ట్రేలియా మధ్య 4 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుంది. రేపు (ఫిబ్రవరి 9) నాగ్ పుర్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. ఆసీస్ ఆటగాళ్ల కవ్వింపు మాటలు, భారత ప్లేయర్ల కౌంటర్లు, మాజీల విశ్లేషణలు, క్రికెట్ పండితుల అభిప్రాయాలతో ఈ సిరీస్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 

భారత్ కు మ్యాచ్ కంటే ముందే ఒక పెద్ద తలనొప్పి ఉంది. అదే తుది జట్టు కూర్పు. చాలా మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండడం, కొందరి ఫాం, జట్టు సమతుల్యం వీటన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ తుది జట్టును ఎంపిక చేయడం కోచ్, కెప్టెన్ కు కత్తిమీద సాములా మారింది. తొలి మ్యాచ్ లో తుది జట్టు ఎలా ఉంటుందో తెలియదు కానీ.. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం తన తుది జట్టును ప్రకటించారు. ఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ.. తన ప్లేయింగ్ ఎలెవన్ గురించి తెలిపాడు. అలాగే ఈ సిరీస్ ను భారత్ 4-0 తో గెలుచుకుంటుందని అన్నాడు. 

భారత్‌ 4-0తో గెలవాలి

2017లో భారత్ 2-1తో ఆసీస్ తో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. దాని తర్వాత ఆస్ట్రేలియా జట్టు భారత్ లో టెస్టుల కోసం రావడం ఇదే తొలిసారి. ఈ మధ్య భారత్ రెండు బోర్డర్- గావస్కర్ (2018-19, 2020-21) ట్రోఫీలను గెలుచుకుంది. ఇవి రెండూ ఆస్ట్రేలియా వేదికగా జరిగాయి. ఈ క్రమంలోనే ఈసారి భారత్ సిరీస్ గెలవాలని రవిశాస్త్రి అన్నాడు. అది కూడా 4-0 తో ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేయాలని అభిప్రాయపడ్డాడు. 

'టీమిండియా 4-0తో గెలవాలి. మేం స్వదేశంలో ఆడుతున్నాం. నేను 2 ఆస్ట్రేలియా పర్యటనలకు వెళ్లాను. అప్పుడు ఏం జరిగిందో నాకు తెలుసు. నేను కోచ్ గా ఉంటే ఆసీస్ ను వైట్ వాష్ చేయాలనే ఆలోచనతోనే ఉంటాను. ఎవరైనా నన్ను ఏ విధమైన పిచ్ కావాలని అడిగితే..  కచ్చితంగా స్పిన్ పిచ్ కావాలనే చెప్తాను. అదికూడా మొదటిరోజు నుంచే బంతి తిరిగేలా. నాకు అదే కావాలి.' అని రవిశాస్త్రి అన్నారు. 

ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు రవిశాస్త్రి ప్రకటించిన తుది జట్టు

  • రోహిత్ శర్మ(కెప్టెన్),
  • శుభ్ మన్ గిల్ (లేదా) కేఎల్ రాహుల్
  • ఛతేశ్వర్ పుజారా
  • విరాట్ కోహ్లీ
  • సూర్యకుమార్ యాదవ్
  • కేఎస్ భరత్ (లేదా) ఇషాన్ కిషన్
  • కుల్దీప్ యాదవ్
  • రవిచంద్రన్ అశ్విన్
  • రవీంద్ర జడేజా
  • మహమ్మద్ సిరాజ్
  • మహమ్మద్ షమీ

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ నాగ్‌పూర్‌లో జరగనుంది. ఈ మైదానంలో ఇప్పటి వరకు ఆరు టెస్టు మ్యాచ్‌లు జరగ్గా అందులో ఒకటి భారత్, ఆస్ట్రేలియా మధ్య కూడా జరిగింది. 14 ఏళ్ల క్రితం 2008 నవంబర్‌లో ఈ మైదానంలో ఇరు జట్లు తలపడ్డాయి.

Published at : 08 Feb 2023 03:24 PM (IST) Tags: Ravi Shastri Ind vs Aus IND vs AUS 1st test IND vs AUS Test Series Boarder- Gavaskar Trophy India Vs Australia Test series

సంబంధిత కథనాలు

Pragyan Ojha on Rohit Sharma: కిట్‌ కొనేందుకు పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్‌ శర్మ! అడిగితే ఎమోషనల్‌!

Pragyan Ojha on Rohit Sharma: కిట్‌ కొనేందుకు పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్‌ శర్మ! అడిగితే ఎమోషనల్‌!

Ganguly on Rishabh Pant: అలాంటి ఆటగాళ్లు ఈజీగా దొరకరు బాబూ - గంగూలీ!

Ganguly on Rishabh Pant: అలాంటి ఆటగాళ్లు ఈజీగా దొరకరు బాబూ - గంగూలీ!

Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?

Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?

Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!

Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!

IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్‌కతా కెప్టెన్‌గా సర్‌ప్రైజ్ ప్లేయర్!

IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్‌కతా కెప్టెన్‌గా సర్‌ప్రైజ్ ప్లేయర్!

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ

TSPSC Exam Postpone: పేపర్ల లీకుల ఎఫెక్ట్ - హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా, కొత్త తేదీ ప్రకటించిన టీఎస్ పీఎస్సీ

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!