Blind T20 World Cup final: అంధుల టీ20 ప్రపంచకప్ విజేత భారత్- మూడోసారి టైటిల్ గెలుచుకున్న టీమిండియా
Blind T20 World Cup final: అంధుల టీ20 ప్రపంచకప్ ను భారత్ గెలుచుకుంది. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచులో బంగ్లాదేశ్ ను 120 తేడాతో ఓడించి టైటిల్ ను గెలుచుకుంది.
Blind T20 World Cup final: అంధుల టీ20 ప్రపంచకప్ ను భారత్ గెలుచుకుంది. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచులో బంగ్లాదేశ్ ను 120 తేడాతో ఓడించి టైటిల్ ను గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియాను కెప్టెన్ అజయ్ కుమార్, సునీల్ రమేష్ లు ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 247 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు చేశారు. అజయ్ (50 బంతుల్లో 100 నాటౌట్), సునీల్ (63 బంతుల్లో 136 నాటౌట్) అజేయ శతకాలతో చెలరేగారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 120 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. భారత్ బౌలర్లు లలిత్ మీనా, అజయ్ కుమార్ చెరో వికెట్ తీశారు.
T20 Blind Cricket World Cup winners
— Jega8 (@imBK08) December 17, 2022
2012 - India
2017 - India
2022 - Indiapic.twitter.com/KzlCO7DvcX#Cricket #BlindT20WorldCup #IndianCricket #TeamIndia pic.twitter.com/J8TsByysWv
డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ కు ఇది మూడో టీ20 ప్రపంచకప్.
The winning moment of team India - they're the champions of T20 World Cup for blind. pic.twitter.com/RBwpOPz9lD
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 17, 2022
India is the most successful team in the World Cup history for Blind. pic.twitter.com/Z8WjzWQkLf
— Johns. (@CricCrazyJohns) December 17, 2022