By: ABP Desam | Updated at : 17 Dec 2022 05:05 AM (IST)
Edited By: nagavarapu
వికెట్ తీసిన ఆనందంలో అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు (source: twitter)
Big Bash League: బిగ్ బాష్ లీగ్ లో సంచలనం. ఈ టోర్నీ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదైంది. సిడ్నీ థండర్స్ జట్టు 15 పరుగులకే ఆలౌట్ అయ్యి అత్యంత చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. అంతేకాక పవర్ ప్లే కూడా ముగియకముందే అన్ని వికెట్లు కోల్పోయిన జట్టుగా నిలిచింది.
బిగ్ బాష్ లీగ్ లో భాగంగా శుక్రవారం అడిలైడ్ స్ట్రైకర్స్- సిడ్నీ థండర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన అడిలైడ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. క్రిస్ లిన్ 36 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కొలిన్ డీ గ్రాండ్‌హోమ్ 33 పరుగులు చేశాడు. సిడ్నీ థండర్స్ బౌలింగ్‌లో ఫజల్లా ఫరుఖీ 3 వికెట్లు పడగొట్టాడు. గురీందర్ సందు, డేనియల్ సామ్స్, బ్రెండన్ డోగ్గెట్‌లు తలా 2 వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సిడ్నీ థండర్స్ జట్టు 5.5 ఓవర్లలో కేవలం 15 పరుగులకే ఆలౌటైంది. అలెక్స్ హేల్స్, రిలీ రొసౌ, డేనియల్ సామ్స్ వంటి స్టార్లు ఉన్నప్పటికీ అతి తక్కువ పరుగులకే కుప్పకూలింది. అడిలైడ్ స్ట్రైకర్స్ బౌలర్ హెన్రీ థోర్టన్ 2.5 ఓవర్లు వేసి 3 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అతడితో పాటు వెస్ అగర్ 4 వికెట్లతో రాణించాడు. స్ట్రైకర్స్ బౌలర్ల ధాటికి థండర్స్ జట్టులో ఐదుగురు డకౌట్ అయ్యారు. ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిటికు పరిమితమయ్యారు.
An unforgettable, record-breaking night in Sydney 😱 #BBL12
Full recap from the Showground Stadium 👇 https://t.co/segU52dqwl — cricket.com.au (@cricketcomau) December 16, 2022
ఈ ప్రదర్శనతో బిగ్ బాష్ టోర్నీలోనే అత్యంత చెత్త రికార్డును సిడ్నీ థండర్స్ జట్టు తన ఖాతాలో వేసుకుంది. ఈ టోర్నీలోనే అత్యంత తక్కువ స్కోరుకే ఆలౌటైన జట్టుగా నిలిచింది. అంతేకాక పవర్ ప్లే కూడా పూర్తికాకముందే ఆలౌటైన జట్టుగా మరో చెత్త రికార్డును నెలకొల్పింది. టీ20 క్రికెట్ చరిత్రలో సీనియర్ విభాగంలో సిడ్నీ థండర్స్‌దే అత్యల్ప స్కోరుగా ఉంది. అంతకముందు చెక్ రిపబ్లిక్‌తో మ్యాచ్‌లో టర్కీ 21 పరుగులకే ఆలౌటైంది. ఇప్పటివరకు ఇదే అత్యల్ప స్కోరు కాగా.. తాజాగా సిడ్నీ థండర్స్ ఆ రికార్డును బద్దలు కొట్టింది.
Commiserations, @ThunderBBL fans. #BBL12 pic.twitter.com/g9b6QacngV
— KFC Big Bash League (@BBL) December 16, 2022
Henry. Thomas. Raphael. James. York. Thornton. #BBL12 pic.twitter.com/aSW07oy8bX
— KFC Big Bash League (@BBL) December 16, 2022
Virat Kohli: రేపే భారత్- ఆస్ట్రేలియా తొలి టెస్ట్- ఆతృతగా ఎదురుచూస్తున్నానన్న కోహ్లీ
ICC WTC 2023 Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూపీఎల్) ఫైనల్ తేదీ వచ్చేసింది- ఎప్పుడంటే!
IND vs AUS: ఇది లవ్లీ సిరీస్ - బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై ఆస్ట్రేలియా ఓపెనర్ ఏమన్నాడంటే?
IND vs AUS 1st Test: 'తొలిరోజు నుంచే బంతి స్పిన్ అయ్యే పిచ్ కావాలి- తుది జట్టులో ఎవరుండాలంటే!'
Border Gavaskar Trophy: రేపే బోర్డర్- గావస్కర్ సిరీస్ ప్రారంభం- ఈ ట్రోఫీలో టాప్- 10 విశేషాలు చూసేద్దామా!
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్‌న్యూస్! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్ తెస్తున్నారు!