IND vs ENG Test Series : స్టోక్స్ దూకుడు వల్లే ఇదంతా, బీసీసీఐ అధ్యక్షుడి సంచలన కామెంట్స్
ind vs eng: బజ్‌బాల్ ఆటతో ఇంగ్లాండ్ దాదాపు అన్ని దేశాలపై ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ భారత్‌తో జరుగుతున్న అయిదు టెస్ట్‌ల సిరీస్‌లో మాత్రం ఆ పాచిక పారలేదు.
BCCI President Slams Ben Stokes Captaincy Blames It For Englands Downfall: బజ్‌బాల్ ఆటతో ఇంగ్లాండ్(England) దాదాపు అన్ని దేశాలపై ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ భారత్(Bharat)తో జరుగుతున్న అయిదు టెస్ట్‌ల సిరీస్‌లో మాత్రం ఆ పాచిక పారలేదు. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్... చివరి టెస్ట్‌లోనూ ఎదురీదుతోంది. ఎన్ని విమర్శలు వచ్చినా బజ్‌బాల్ ఆటను సమర్థిస్తూ వస్తున్న బ్రిటీష్ జట్టుపై... ఇప్పుడు విమర్శలు చెలరేగుతున్నాయి. తొలి టెస్టులో ఓడిన భారత్.. బలంగా పుంజుకుని, తర్వాతి మూడు టెస్టుల్లో విజయంతో సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఇప్పుడు భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఇంగ్లాండ్ వైఫల్యం చెందడానికి ప్రధాన కారణం స్టోక్స్ అని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
ఇంతకీ బిన్ని ఏమన్నాడంటే..?
బెన్ స్టోక్స్(Ben Stokes) దూకుడైన కెప్టెన్సీనే భారత్‌తో సిరీస్‌లో ఇంగ్లాండ్ పతనానికి కారణమని రోజర్ బిన్నీ(Roger Binny) అన్నాడు. సహనం, వ్యూహంతో కెప్టెన్‌గా రోహిత్ పైచేయి సాధించాడని అంచనా వేశాడు. స్టోక్స్ చాలా దూకుడుగా కెప్టెన్సీ చేస్తున్నాడని... కొన్ని టెస్టుల్లో ఇంగ్లాండ్ దెబ్బతినడానికి ఇదే ప్రధాన కారణమని బిన్నీ అన్నాడు. భారత స్పిన్నర్లను ధాటిగా ఎదుర్కోవడానికి ఇంగ్లాండ్ ప్రయత్నించిందని అదే భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో బ్రిటీష్ జట్టు పతనం కావడానికి కారణమని బిన్నీ తెలిపాడు. స్టోక్స్‌కు భిన్నంగా రోహిత్ చాలా ఓర్పును ప్రదర్శించాడు. తర్వాతి టెస్టుల్లో సహనాన్ని పాటించి విజయం సాధించాడని అన్నాడు.
ఆరంభంలో బాగా ఆడినా+
భారత్‌తో జరుగుతున్న అయిదో టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ఆరంభంలో సాధికారికంగా బ్యాటింగ్ చేసింది. తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి రెండు వికెట్ల నష్టానికి సరిగ్గా 100 పరుగులు చేసింది. ఆరంభంలో బజ్ బాల్‌ను పక్కన పెట్టిన ఇంగ్లాండ్.. ఆచితూచి బ్యాటింగ్ చేసింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు దూకుడు తగ్గించారు. సిరాజ్, బుమ్రా అద్భుతమైన బంతులతో పరుగులను కట్టడి చేస్తున్నారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు తొలి 5 ఓవర్లకు 23 పరుగులు చేశారు. పది ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నా ఆచితూచి పరుగులు రాబడుతున్నారు. 12వ ఓవర్లో సిరాజ్ వేసిన బంతి క్రాలే ప్యాడ్స్‌ను తాకగా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. భారత్ రివ్యూ కోరినా అనుకూల ఫలితం రాలేదు. 15 ఓవర్లలో ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న బెన్ డకెట్ 18వ ఓవర్లో కుల్‌దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. గిల్ అద్భుతమైన క్యాచ్‌తో డకెట్ వెనుదిరిగాడు. 27 పరుగులు చేసిన డకెట్ ఇచ్చిన క్యాచ్‌ను శుభ్‌మన్ గిల్ అద్భుతంగా ఒడిసిపట్టాడు. తొలి రోజు ఆటలో లంచ్ బ్రేక్ ముందు చివరి ఓవర్లో భారత్‌కు రెండో వికెట్ దక్కింది. 26వ ఓవర్లో ఒలీ పోప్ 11 పరుగులు చేసి కుల్‌దీప్ వేసిన బంతికి స్టంప్ ఔట్‌గా వెనుతిరిగాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా క్రాలే 61 పరుగులతో క్రీజులో ఉన్నాడు. భారత్ తీసిన రెండు వికెట్లు కుల్‌దీప్ యాదవ్‌కే దక్కాయి.
కట్టి పడేసిన కుల్‌దీప్, అశ్విన్ ...
కుల్‌దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51) తమ స్పిన్ మాయజాలంతో పర్యటక జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వరుసగా వికెట్లు తీసి బ్రిటీష్ జట్టును కుప్పకూల్చారు.తొలి రోజు టీ బ్రేక్.. ఇంగ్లాండ్ 194/8స్థితిలో ఉన్నా ఇంగ్లాండ్ ఆ తర్వాత మిగిలిన రెండు వికెట్లు కోల్పోయింది.