PAK vs BAN: బంగ్లా పులుల చేతిలో పాక్ బలి, సిరీస్ క్లీన్‌స్వీప్‌తో బంగ్లా చరిత్ర
Pakistan vs Bangladesh highlights: రావల్పిండిలో జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ జట్టును ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
Bangladesh Won By 6 Wikects Against Pakistan In Second Test: బంగ్లాదేశ్(Bangladesh) చరిత్ర సృష్టించింది. అది అలాంటి ఇలాంటి చరిత్ర కాదు. భవిష్యత్తు తరం గర్వంతో చెప్పుకునేలా... తమ ఘనతను సువర్ణాక్షరాలతో లిఖించేలా యువ క్రికెటర్లకు స్ఫూర్తి నింపేలా చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్(Pakistan) గడ్డపైనే పాక్‌ను మట్టికరిపించి.. క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి.. ఆశ్చర్యానికి గురి చేసింది. తమపై ఉన్న పసికూన ముద్రను పాక్‌కు అప్పగిస్తూ... తామిక అగ్ర జట్టని... తమతో అంత ఈజీ కాదని ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరికలే పంపింది. పాక్‌ను వారి దేశంలోనే 2-0తో క్లీన్ స్వీప్ చేసి..ఔరా అనిపించింది. పాకిస్థాన్‌ను వారి దేశంలోనే క్లీన్ స్వీప్ చేసిన తొలి ఆసియా జట్టుగాను రికార్డు నెలకొల్పింది.
Read Also: Paris Paralympics 2024: పతక పంట అంటే ఇది, బ్యాడ్మింటన్ లో కొత్త చరిత్ర
Bangladesh team celebrates with the trophy after securing their first-ever Test series win against Pakistan.🏆🎉
— Bangladesh Cricket (@BCBtigers) September 3, 2024
PC: PCB#BCB #Cricket #BDCricket #Bangladesh #PAKvBAN #WTC2 pic.twitter.com/qJtfXccjrs