అన్వేషించండి

AUS vs PAK: వార్నర్‌ ఫేర్‌వెల్‌ టెస్ట్‌లో పుంజుకున్న పాక్‌

Australia vs Pakistan: ఆసీస్‌తో జరుగుతున్న నామమాత్రమైన మూడో టెస్ట్‌లో పాకిస్తాన్‌  తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులకు ఆలౌటైంది. లోయర్‌ అర్డర్‌ అద్భుతంగా పుంజుకోవడంతో పాక్‌ గౌరవప్రదమైన స్కోరు చేసింది.

Australia vs Pakistan 3rd Test Day 1 Highlights: ఆసీస్‌తో జరుగుతున్న నామమాత్రమైన మూడో టెస్ట్‌లో పాకిస్తాన్‌ (Pakistan Cricket Team)  తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులకు ఆలౌటైంది. లోయర్‌ అర్డర్‌ అద్భుతంగా పుంజుకోవడంతో క్లిష్టమైన దశనుంచి పాక్‌ గౌరవప్రదమైన స్కోరు చేసింది. రిజ్వాన్‌ 88 పరుగులు, అఘా సల్మాన్‌ 53 పరుగులు, ఆమిర్‌ జమాల్‌ 82 పరుగులు చేసి పాక్‌కు మంచి స్కోరు అందించారు.
టాస్‌ గెలిచిన పర్యాటక పాకిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ (Pakistan First Batting) ఎంచుకోగా ఆదిలోనే పాక్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్‌ను మిచెల్‌ స్టార్క్‌.. సయీమ్‌ ఆయుబ్‌ను జోష్‌ హాజిల్‌వుడ్‌ డకౌట్‌ చేసి పెవిలియన్‌కు పంపారు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే పాక్‌ రెండు వికెట్లు కోల్పోయింది. షాన్‌ మసూద్‌ (35), బాబర్‌ ఆజమ్‌ (26) కాసేపు ఆసీస్‌ బౌలర్ల (Australia Bowlers)ను నిలువరించారు. ఆతర్వాత స్వల్ప వ్యవధిలో వీరిద్దరితో పాటు సౌద్‌ షకీల్‌ (5) ఔట్‌ కావడంతో పాక్‌ 95 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత రిజ్వాన్‌ 88, అఘా సల్మాన్‌ 53, ఆమిర్‌ జమాల్‌ 82 పరుగులు చేసి పాక్‌కు 313 పరుగుల  స్కోరు అందించారు. ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ (Australia Captain Pat Cummins) మరోసారి అద్భుతమైన బౌలింగ్‌ ప్రదర్శనతో (5/61) చెలరేగి పాక్‌ వెన్నువిరచగా.. స్టార్క్‌ (2/75), హాజిల్‌వుడ్‌ (1/65), లయోన్‌ (1/74), మార్ష్‌ (1/27) కూడా రాణించారు. 
 
స్టెయిన్‌ అంటేనే భయం: వార్నర్‌
ముందంతా టెస్టు క్రికెట్‌ నుంచి మాత్రమే తప్పుకోనున్నట్టు ప్రకటించిన డేవిడ్‌ వార్నర్‌ (David Warner) అకస్మాత్తుగా వన్డేల నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. జనవరి 3 (ఈరోజు ) నుంచి సిడ్నీ(Sydney) వేదికగా పాకిస్తాన్‌(Pakistan)తో జరుగబోయే పింక్‌ టెస్టుకు ముందు వార్నర్‌ మాట్లాడుతూ తన కెరియర్లో భయపెట్టిన, అత్యంత కఠినమైన బౌలర్‌ ఎవరన్నది వెల్లడించాడు. ఇన్ని సంవత్సరాల కెరియర్లో ఎంతోమంది దిగ్గజ బౌలర్లను ఎదుర్కున్నఈ ఆసీస్‌ స్టార్ ఓపెనర్‌.. సౌతాఫ్రికా(South Africa) మాజీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ (Dale Stein ) తనను బాగా భయపెట్టాడని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా 2016-17లో దక్షిణాఫ్రికా ఆసీస్‌(Ausis) పర్యటనకు వచ్చినప్పుడు స్టెయిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం తనకు కత్తిమీద సాములా అనిపించిందని గుర్తు చేసుకున్నాడు. ప్రత్యేకించి ఆ టెస్టులో 45 నిమిషాల సెషన్‌ అయితే తమకు చుక్కలు చూపించిందని, . ఆ సందర్భంలో మార్ష్‌ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని చెప్పాడు.
వార్నర్‌కు చివరి టెస్ట్‌
ఇప్పటికే టెస్ట్‌ క్రికెట్‌(Test Cricket)కు వీడ్కోలు పలికిన డేవిడ్‌ భాయ్‌ ఇప్పుడు వన్డే(ODI cricket)లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించేశాడు. భారత్‌(Bharat)పై వన్డే ప్రపంచకప్‌(ODI World Cup2023 ) గెలిచిన ఈ మధుర క్షణాలే తన వన్డే కెరీర్‌కు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నట్లు వార్నర్‌ తెలిపాడు. తన నిర్ణయం వల్ల కొత్త వారికి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2025లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో ఆస్ట్రేలియాకు ఓపెనర్ అవసరమైతే మాత్రం తాను పునరాగమనం చేస్తానని వార్నర్‌ చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Botsa Satyanarayana: రైతుల సమస్యలపై వైసీపీ పోరుబాట, యూరియా కొరతపై ఈ 9న రాష్ట్రవ్యాప్త నిరసన
రైతు సమస్యలపై వైసీపీ పోరుబాట, యూరియా కొరతపై ఈ 9న రాష్ట్రవ్యాప్త నిరసన
Team India New Jersey: టీమిండియా కొత్త జెర్సీ చూశారా.. స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్ 2025 బరిలోకి
టీమిండియా కొత్త జెర్సీ చూశారా.. స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్ 2025 బరిలోకి
Amaravati Property Festival: ఈ 19 నుంచి మూడు రోజులపాటు అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్‌, ప్రత్యేక రాయితీలు
ఈ 19 నుంచి మూడు రోజులపాటు అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్‌, ప్రత్యేక రాయితీలు
Rukmini Vasanth Hits And Flops: రుక్మిణి ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాప్స్... ఎన్టీఆర్ 'డ్రాగన్'తో పాటు కన్నడ సీక్వెల్‌పై ఆశలు
రుక్మిణి ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాప్స్... ఎన్టీఆర్ 'డ్రాగన్'తో పాటు కన్నడ సీక్వెల్‌పై ఆశలు
Advertisement

వీడియోలు

Adilabad 54Feet Ganesh Idol Immersion | ఆదిలాబాద్ లో ఈ వినాయకుడి నిమజ్జనం చూసి తీరాల్సిందే | ABP
Vizag Helicopter Museum Vlog | విపత్తుల్లో నేవీ ధైర్య సాహసాలు తెలియాంటే ఈ మ్యూజియం చూడాల్సిందే | ABP
Sri Lanka vs Zimbabwe T20 | శ్రీలంకను చిత్తు చేసిన జింబాబ్వే
Asia Cup 2025 Team India | ప్లేయింగ్ 11 లో హర్షిత్ రాణా చోటు సంపాదిస్తారా ?
Arshdeep Singh in Asia Cup 2025 | రికార్డు బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్న అర్షదీప్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Botsa Satyanarayana: రైతుల సమస్యలపై వైసీపీ పోరుబాట, యూరియా కొరతపై ఈ 9న రాష్ట్రవ్యాప్త నిరసన
రైతు సమస్యలపై వైసీపీ పోరుబాట, యూరియా కొరతపై ఈ 9న రాష్ట్రవ్యాప్త నిరసన
Team India New Jersey: టీమిండియా కొత్త జెర్సీ చూశారా.. స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్ 2025 బరిలోకి
టీమిండియా కొత్త జెర్సీ చూశారా.. స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్ 2025 బరిలోకి
Amaravati Property Festival: ఈ 19 నుంచి మూడు రోజులపాటు అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్‌, ప్రత్యేక రాయితీలు
ఈ 19 నుంచి మూడు రోజులపాటు అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్‌, ప్రత్యేక రాయితీలు
Rukmini Vasanth Hits And Flops: రుక్మిణి ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాప్స్... ఎన్టీఆర్ 'డ్రాగన్'తో పాటు కన్నడ సీక్వెల్‌పై ఆశలు
రుక్మిణి ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాప్స్... ఎన్టీఆర్ 'డ్రాగన్'తో పాటు కన్నడ సీక్వెల్‌పై ఆశలు
SSMB29 Updates: మహేష్ ఫస్ట్ లుక్ ఒక్కటే కాదు - 'SSMB29' ఎపిక్ అనౌన్స్‌మెంట్ కూడా ఆ రోజే... జక్కన్న ప్లాన్ మామూలుగా లేదు
మహేష్ ఫస్ట్ లుక్ ఒక్కటే కాదు - 'SSMB29' ఎపిక్ అనౌన్స్‌మెంట్ కూడా ఆ రోజే... జక్కన్న ప్లాన్ మామూలుగా లేదు
Shocking Video: బాలుడి ప్రాణాల మీదకు తెచ్చిన సరదా.. మీరు మాత్రం​ ఇలా ప్రయాణించొద్దు
బాలుడి ప్రాణాల మీదకు తెచ్చిన సరదా.. మీరు మాత్రం​ ఇలా ప్రయాణించొద్దు
India Wins Gold At World Championships: ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్, చరిత్రలో తొలిసారిగా ఘనత
ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్, చరిత్రలో తొలిసారిగా ఘనత
Manchu Manoj - Bellamkonda Sreenivas: ఎన్టీఆర్ అభిమానికి సాయం చేసేందుకు ముందుకొచ్చిన మంచు మనోజ్ - బెల్లంకొండ
ఎన్టీఆర్ అభిమానికి సాయం చేసేందుకు ముందుకొచ్చిన మంచు మనోజ్ - బెల్లంకొండ
Embed widget