అన్వేషించండి

Rukmini Vasanth Hits And Flops: రుక్మిణి ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాప్స్... ఎన్టీఆర్ 'డ్రాగన్'తో పాటు కన్నడ సీక్వెల్‌పై ఆశలు

Rukmini Vasanth Upcoming Movies: 'కాంతార: లెజెండ్'తో పాటు ఎన్టీఆర్ - నీల్ 'డ్రాగన్'లో రుక్మిణీ వసంత్ హీరోయిన్. ప్రస్తుతానికి కెరీర్‌కు ఢోకా లేదు. కానీ, ట్రాక్ రికార్డులో వరుస ఫ్లాప్స్ పడ్డాయి.

'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో ఆర్తీ అగర్వాల్ గురించి వర్ణిస్తూ 'ఓ నవ్వు చాలు ఎన్నెన్ని వలలు వేస్తూ అల్లుకుంటుంది... ముత్యాల జల్లు... మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది' అని వెంకటేష్ ఓ పాట పాడతారు. హీరోయిన్ రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) గురించి చెప్పాలంటే ఆ సాంగ్ కరెక్ట్ ఏమో!? ఆమె నవ్వుకు, హావభావాలు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. గ్లామర్ షో చేయకుండా కేవలం అభినయంతో, ముఖారవిందంతో ఆకట్టుకుంటోంది రుక్మిణీ. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కానీ సరైన విజయాలు మాత్రం రావడం లేదు.

రుక్మిణీ వసంత్ ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాప్స్
Rukmini Vasanth Flop Movies: రక్షిత్ శెట్టి సరసన నటించిన 'సప్త సాగరాలు దాటి' సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది రుక్మిణీ వసంత్. ఆమె నవ్వు, రూపం అందరికీ నచ్చాయి. అప్పట్నుంచి రుక్మిణీ వసంత్ తెలుగు డెబ్యూ కోసం ఆడియన్స్ ఎదురు చూశారు. వాళ్ళకు నిఖిల్ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'తో షాక్ తగిలింది. 

'సప్త సాగరాలు దాటి'లో అవకాశం రావడానికి ముందు తెలుగు సినిమా చేసింది రుక్మిణీ వసంత్. ఆ చిత్రమే నిఖిల్ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'. థియేటర్లలోకి ఎప్పుడు వచ్చిందో? ఎప్పుడో వెళ్లిందో? కూడా చాలా మందికి తెలియదు. అంత డిజాస్టర్ అన్నమాట. 'స్వామి రారా' హీరో, దర్శకుడు కలిసి మరోసారి అటువంటి మేజిక్ రిపీట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఆ ఫ్లాప్ పక్కన పెడితే... మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 'ఏస్'తో తమిళ్ తెరపై అడుగు పెట్టింది రుక్మిణీ వసంత్.

Rukmini Vasanth Hits And Flops: రుక్మిణి ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాప్స్... ఎన్టీఆర్ 'డ్రాగన్'తో పాటు కన్నడ సీక్వెల్‌పై ఆశలు

'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' తర్వాత 'ఏస్' రూపంలో మరొక ఫ్లాప్ వచ్చింది రుక్మిణికి. ఆ సినిమా చేశాక కోలీవుడ్ రైజింగ్ స్టార్ శివకార్తికేయన్ సరసన ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 'మదరాసి'లో నటించే అవకాశం వచ్చింది. బ్లాక్ బస్టర్ 'అమరన్' తర్వాత హీరోకి అటువంటి హిట్ ఇస్తుందని అనుకుంటే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది మురుగదాస్ సినిమా. రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్టు నిర్మాణ సంస్థ అనౌన్స్ చేసినా ఆడియన్స్ నుంచి అప్లాజ్ రాలేదు. బ్యాక్ టు బ్యాక్ మూడు ఫ్లాప్స్ రావడంతో హ్యాట్రిక్ నమోదు చేసింది రుక్మిణీ వసంత్.

చేతిలో పాన్ ఇండియా సినిమాలు...!
రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth Upcoming Movies)కు హ్యాట్రిక్ ఫ్లాప్స్ వచ్చినా ఆవిడ కెరీర్‌కు వచ్చిన ఢోకా ఏమీ లేదు. ప్రస్తుతం ఆవిడ చేతిలో రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. పాన్ ఇండియా హిట్ 'కాంతార'కు ప్రీక్వెల్‌గా వస్తున్న 'కాంతార: ఏ లెజెండ్'లో రుక్మిణీ వసంత్ హీరోయిన్. అందులో రాణీ కనకావతిగా నటించారు. అక్టోబర్ 2న సినిమా విడుదల. ఇది కాకుండా ఎన్టీఆర్ 'డ్రాగన్' మరొకటి.

Also Read: ఘాటీ vs లిటిల్ హార్ట్స్... బాక్సాఫీస్ కలెక్షన్లలో మౌళి మూవీ ముందు అనుష్క సినిమా గల్లంతు!

Rukmini Vasanth Hits And Flops: రుక్మిణి ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాప్స్... ఎన్టీఆర్ 'డ్రాగన్'తో పాటు కన్నడ సీక్వెల్‌పై ఆశలు

అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు కానీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలోనూ రుక్మిణీ వసంత్ హీరోయిన్. ఆ విషయాన్ని ఆవిడ పరోక్షంగా అంగీకరించారు. ఆ రెండూ విజయాలు సాధిస్తే హ్యాట్రిక్ ఫ్లాప్స్ మరుగున పడతాయి. ఎవరికీ ఈ సినిమాలు గుర్తుండవు. 'డ్రాగన్'లో అవకాశం ఇవ్వడానికి ముందు ప్రశాంత్ నీల్ కథతో ఆయన బావ శ్రీ మురళి హీరోగా నటించిన 'భగీర' సైతం ఫ్లాప్. కన్నడలో శివరాజ్ కుమార్ 'భైరాతి రణగళ్' డీసెంట్ హిట్ అయ్యింది.

Also Readఇప్పుడు పూకీ కాదు... 'బూకీ' - తెలుగు ఆడియన్స్ దెబ్బకు టైటిల్ మార్చిన విజయ్ ఆంటోనీ

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget